Who is Farmhouse Owner Raj Pakala

SCAMS Real estate fraud and scams

Posted by admin on 2024-10-27 14:27:59 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 266


Who is Farmhouse Owner Raj Pakala


రాజ్ పాకాల ఫామ్ హౌజ్ మీదేనా..?

అయితే మీ పేరు మీద ఎందుకు మార్చుకోలేదు.

సెప్టెంబర్ 19న ప్రశ్నిస్తే, మాది కాదన్నారు.

ఇప్పుడు మీది ఎలా అయింది. మీరిచ్చే పార్టీ ఎవ్వరిది.

జన్వాడాలో బావ కేటీఆర్ ది ఒక డ్రామా..

భావమర్ధిది మరో భాగోతం.

ఇద్దరూ బినామిల పేర్లపైనే ఫామ్ హౌజ్ లు.

ఎమ్మెల్సీ కవిత ఫామ్ హౌజ్ లోను ఇదే తీరు.

జన్వాడలో 200 ఎకరాల్లో బిజినెస్ చేసిన

 కేటీఆర్ బినామి దండు రాజేష్.

జన్వాడలో అక్రమ ఫామ్ హౌజ్ ల పై

ల్యాండ్స్ అండ్ రికార్డ్స్.కామ్ స్పెషల్ స్టోరీ.

By

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల.

9848070809.

బినామిలు ఎలా అయిన పుట్టుకోస్తారు. కేటీఆర్ 50 ఎకరాల ఫామ్ హౌజ్ లో తన భార్య పేరు మీద 3 ఎకరాలు మాత్రమే ఉంటుంది. నిర్మించిన ఇంద్రభవనం మాత్రం ప్రదీప్ రెడ్డి పేరు మీద కనపిస్తుంది. అతనే కోర్టుల్లో కేసులు వేస్తారు. ఫామ్ హౌజ్ నాదే, కేటీఆర్ కి లీజ్ కిచ్చాను . అంటారు. కేటీఆర్ కూడా కోర్టులో తనదేనని అఫిడవిట్ లో పెర్కొన్న రోజులు ఉన్నాయి. అంటే తన మీదికి వస్తుంది అంటే నాది కాదు. కాని నాదే అంటూ కథలు చెప్పడంలో కేటీఆర్ వీరంతా అరుతేరారు. తాజాగా కేటీఆర్ బావమర్ధి ఫామ్ హౌజ్ మొత్తం 111 జీవోలోనే ఉంటుంది. జన్వాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 691 లో 7 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. 1999లో ఎస్ లక్ష్మి ప్రభాకర్ కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత 2016లో వారి కంపనే అయినా శ్రీమాతే కు మళ్లీ సెల్ డీడ్ చేసుకుంటారు. 2021లో ఈ శ్రీమాతే కంపనీ డైరెక్టర్స్ మారిపోతారు.  రాజేంద్ర ప్రసాద్ పాకాల బంధువులు అయినా రావు గురు ప్రసాద్ క్రుష్ణ రంగారావు, రావు శ్రీ రాజేశ్వరీ దేవీ పేర్ల మీదకి కంపనీ మారుతుంది. కంపనీ మారడంతో ఈ భూమి కూడా వారికే చెందుతుంది. ఈ భూమి ఇప్పటికి వీళ్ల పేర్ల మీదిగా మ్యూటేషన్ కాలేదు. 10శాతం నిర్మాణాలు చేపట్టాల్సింది 30 శాతం నిర్మాణాలు చేపట్టారు. 15 కోట్లతో పెద్ద ఎత్తున విదేశీ ఇంటరియల్ తో ఇంద్ర భవనాన్ని నిర్మించారు. అయితే ఇది తమదే అని ఎలా అంటున్నారు. ఆ ఫామ్ హౌజ్ కేటీఆర్ ది కాదంటారు. మరి ఇది ఎలా రాజ్ పాకాలది అవుతుంది.  ఇలా శంకర్ పల్లి, జన్వాడ రోడ్డుకు అనుకుని ఎమ్మెల్సీ కవిత ఫామ్ హౌజ్ ఉంటుంది. ఇక్కడ కూడా అమె పేరు మీద ఉండదు. కాని అంతా అమేదే.. ? దండు రాజేష్ అనే వ్యక్తి విదేశాల్లో ఉన్న వారికి జన్వాడలో భూములు ఇప్పిస్తానని పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ చేశారు. ఇప్పటికి ఆ భూములు ఇప్పించలేదు. 200 ఎకరాల్లో కేటీఆర్ పేరు చెప్పి దందాలు ఇంకా కొనసాగుతున్నాయి. 

Leave a Comment: