Posted by admin on 2023-03-07 14:09:42 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 294
Land and Records Bureau.
బీఆర్ఎస్ పార్టీలో నిత్యం బిజిగా ఉండే మంత్రి హరీష్ రావు. ఏ శాఖ అయినా కొట్టిన పిండే. ఎన్నికల్లో తానదైన ముద్ర ఉంటుంది. సిద్దిపేట్ లో రికార్డులు సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ లీడర్ అలక పూనిన బుజ్జగిస్తారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలను తొలుకొచ్చారు. కేసీఆర్, హరీష్ ని ఆయుధంలా వాడుకుంటారు. ఆ ఆయుదాన్ని మొండి కత్తిలా మూలకు పడేసిన ఘటనలు ఉన్నాయి. ఎన్నికలు రాబోతున్న తరణం బిజేపీ పాలి ట్రిక్స్ తో కేసీఆర్, కేటీఆర్ అలోచనలు రోజురోజుకు మారుతున్నాయి. ఎవ్వరెవరు గోడ దూకుతారు. వారి వీక్ పాయింట్స్ ఏం ఉన్నాయో ఆరా తీస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేరనే వంకతో టికెట్లో కోతలు పెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఎమ్మెల్యే సీటీ బీఆర్ఎస్ మాటలా కట్టుబడి ఉండే వారినే చూస్తున్నారు. అందుకే కేటీఆర్ కి ప్రతి నియోజక వర్గంలో ఎదో ఒక అభివృద్ది పనులు అంటూ చుట్టేస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశంలో తన చాతుర్యం ప్రదర్శించారు. దీంతో మరో ఫవర్ సెంటర్ లేకుండా ఒకే సెంటర్ ని ఏర్పాటు చేసే అలోచనలో బీఆర్ఎస్ ఉందని సమాచారం.
సెకండ్ లీడర్స్ యాక్టివ్.
పొలిటికల్ లో ఏ రోజు ఏం జరుగుతుందో ఊహించలేం. అందుకే ప్రతి నియోజక వర్గంలో రెండో తరం నేతలను లేదా సెంకడ్ క్యాడర్ ని బీఆర్ఎస్ యాక్టివ్ చేస్తుంది. అది సిద్దపేట నియోజక వర్గం వరకు చేరింది. కేసీఆర్ అన్న రంగారావు కుమారుడు వంశీధర్ రావు ఇటీవల యూత్ కి కావాల్సిన క్రీడా సామాగ్రి పంచిపెట్టారు. అది హరీష్ రావుకి తెలయకుండానే ప్రజలకు సేవ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. దీని పై సామాగ్రి రాకుండా మంత్రి అడ్డుకున్నారనే అరోపణలు ఉన్నాయి. ఎవ్వరు సహాకరించవద్దని కొంత మంది నేతలకు సందేశాలు వెళ్లాయి.
మెదక్ లో సుతిమొత్తగా ఎంట్రీ.
నియోజక వర్గంలో పద్మదేవేందర్ రెడ్డి కి పోటీగా మైనంపల్లి రోహిత్ రావు కన్నేశారు. తన కుమారిడి రాజకీయం మెదక్ అంటున్నారు మైనం పల్లి హాన్మంత్ రావు. కేసీఆర్ పొలిటికల్ అడ్వజర్ శేరి సుభాష్ రెడ్డి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. పద్మ దేవేందర్ రెడ్డి మంత్రికి సన్నిహితంగా ఉంటారనే టార్గెట్ చేశారని అమె అనుచరుల్లో చర్చ జరుగుతోంది.
సంగారెడ్డి సత్తా అంటూనే సైడ్ చేస్తున్నారా..?
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎదో విధంగా మంత్రి పై అరోపణలు చేస్తూనే కేసీఆర్ ని ఇటీవల కాలంలో పొగుడుతున్నారు. అయితే ఇక్కడ మంత్రి అనుచరునిగా ముద్ర పడ్డా చింత ప్రభాకర్ కి టికెట్ ఇచ్చేలా కనిపించడం లేదు. నరహరి రెడ్డి లేదా గ్రంధలయ ఛైర్మన్ పట్నం మాణిక్యం పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఆంధోల్ లోను అదే తీరు.?
జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ ఎమ్మెల్యేగా ఎన్ని మార్కులు వేసుకోవాలో సర్వేలు చెప్పుతున్నాయని చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. మరో నేతను యాక్టివ్ చేస్తున్నారు. బక్కి వెంకటయ్య చాపకింద నీరులా తనకు ఈ సారి టికెట్ ఇస్తారనే ఆశతో ఉన్నారు. ప్రతిపక్షాల అభ్యర్ధులు బల పడుతున్నారనే ఉద్దేశంతో వెంకటయ్యను ప్రొత్సహిస్తున్నట్లు సమాచారం.
నర్సపూర్ లో నేత బిజేపీలోకి .
నర్సపూర్ లో సునీత లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వబోతుందని మురళీయాదవ్ బిజేపి పార్టీలో చేరిపోయారు. మురళీ హరీష్ రావు ప్రధాన అనుచరుడు. ఆయన మనిషి అని మార్క్ పడితే జిల్లాలో ఎదగడం కష్టమని.. ఎమ్మెల్యే కావాలని గట్టి నిర్ణయంతో బిజేపీలో చేరినట్లు చెప్పుకుంటున్నారు.
జహీరాబాద్ లో జెండా కోసం పోటీ.
మాణిక్ రావు ఎమ్మెల్యేగా ఉన్నా... యంగ్ లీడర్ మంత్రి నమ్మిన బంటు ఎర్రోళ్ల శ్రీనివాస్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే ఇప్పడు కేసీఆర్ ఇంట్లో మనిషిలా చెప్పుకునే ఢిల్లీ వసంత్ ఎంట్రీ ఇస్తున్నారు. చివరి నిమిషం వరకు ఎదైనా జరగవచ్చని కేసీఆర్ టికెట్స్ లో గెలవడం ఎంత ముఖ్యమో.. గెలిచాక తన వెంట నిలబడే వారే ఇంపార్టెంట్ గా భావిస్తున్నట్లు తెలుస్తుంది.
దుబ్బాక కు కొత్తగా కొత్త..
రామలింగరెడ్డి కుటుంబానికి మరోసారి అవకాశం ఇస్తారని అనుకుంటున్నారు. అందుకు హరీష్ రావునే నమ్ముకున్నారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతుంది. నారాయణ ఖేడ్ లో భూపాల్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఉంది.
పటాన్ చెరువులో పరషాన్.
పటాన్ చెరువు పై ప్రత్యేక అభిమానం ఉంటుంది హరీష్ రావుకి. గూడెం మహిపాల్ రెడ్డి నిత్యం జిల్లా మంత్రితో తిరుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ సెంకడ్ లీడర్స్ ఎమ్మెల్యేను కాదని చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. నీలం మధుకి కేటీఆర్ అండదండలు ఉన్నాయని టికెట్ ఆయనకే అని ప్రచారం చేసుకుంటున్నారు. బొల్లారం బాల్ రెడ్డి లాంటి నేతలు కూడా నీలం మధు అయితే మాకు ఓకే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో బుజ్జగించినట్లు ఇప్పుడు బుజ్జగించే ప్రయత్నాలు జరగడం లేదు. దీంతో టికెట్ తెచ్చుకునే దమ్ము ఎవ్వరికి ఉంటే వారేనని పార్టీ కార్యక్రమాలతో పాటు ఊరూరా ప్రత్యేకంగా మనుషులను పెట్టుకుని నెక్ట్స్ టికెట్ నాకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
మళ్లీ అగ్నిపరీక్షేనా..
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి మంత్రి హరీష్ రావు అలక పునడం. ఈటెల రాజేందర్ ని పొమ్మనలేక పోగపెట్టడం లాంటి జిమ్మిక్కులు భారీగానే జరిగాయి. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జిల్లాలో టికెట్లు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా మారింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా జెంపు జెలానిలకి ఛాన్స్ ఇవ్వరాదని దోరణిలోనే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే కొంత మంది బీఆర్ఎస్ లీడర్స్ మాత్రం కారు ఓవర్ లోడ్ కావడంతో ఇలా నియోజక వర్గంలో పోటీ పడుతున్నారని చెప్పుతున్నారు. వీటికి తోడుగా కార్యకర్తలకు ఎం చేయాలి. ఓటర్లని ఎలా అకర్షించాలో ఇప్పటికే ఎన్నికల మూడులోకి వచ్చారు బీఆర్ఎస్ నేతలు.