Another Scam in ESI - Telemedicine Scam.

SCAMS Health & Hospitals

Posted by admin on 2023-11-13 07:44:53 | Last Updated by admin on 2025-05-22 22:19:48

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1047


Another Scam in ESI - Telemedicine Scam.

  • ఈఎస్ఐ లో  టెలి మెడిసిన్ స్కాం.
  • దేవికారాణి పై ఏసీబీ కేసు తెలకుండానే 20 కోట్లకు ఎసరు
  • అప్పట్లో టెలి మెడిసిన్  బిల్లులు రిలీజ్ చేయలేదని అరెస్ట్ కాలేదు. 
  • ఇప్పుడు డబ్బులు విడుదల కోసం మాజీ ఎంపీ వినోద్, ఆఫీసర్ భూపాల్ రెడ్డి ఒత్తిళ్లు ?   
  • రూ.100 ఖర్చుకు 600 దోపిడి. 
  • ఎలాంటి టెండర్స్ లేకుండానే పనుల అప్పగింత.
  • ఇలాంటి కేసులోనే ఏపీ మాజీ మంత్రి అచ్చెంనాయుడు అరెస్ట్.
  • తెలంగాణలో నానో రే మెడికల్ టెక్నాలజీకి 10 కోట్లు విడుదల ?
  • వీఆర్ టెలి హెల్త్ సర్వీస్ కి మరో 10 కోట్లకు క్లియరెన్స్ ఇవ్వాలని ఐఎంవో ల పై ఒత్తిడి. 
  • 2017-18,2018-19 నాటి అక్రమ బిల్లుల  పై ఏసిబీ నిర్లక్ష్యం.
  • గుణపాఠం చేర్చుకోలేకపోతున్న ఈఎస్ఐ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్. 
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్ చేతిలో పూర్తి అధారాలు.   

By

Devender Reddy 

9848070809

    తెలంగాణ హెల్త్ డిపార్మెంట్ లో భారీ కుంభకోణం  ఈఎస్ఐ లో మెడికల్ కిట్ల కోనుగోలు స్కాం. ఏసిబి 9 మందిని అరెస్ట్ చేసి 7 కోట్ల స్కాం జరిగిందని తెల్చింది. అప్పటి డైరెక్టర్ దేవికారాణి తో పాటు నాయిని, ఆయన అల్లుడు, పీఏ ముకుంద్ పేర్లు వినిపించాయి. దేవికారాణి అక్రమంగా 450 కోట్లు సంపాదించారని ఏసీబీ తెల్చింది. ఈడీ కేసు నమోదు ఆస్తులు అటాచ్మెంట్ చేశారు. ప్రయివేట్ ఆస్పత్రుల ఓనర్లు కటకటాల పాలయ్యారు. కళ్ల ముందు ఈ స్కాం కదలాడుతుండగానే మరో 20 కోట్ల అక్రమ బిల్లులకు తెర లేపారు. 




    ఎలాంటి టెండర్స్ లేకుండానే అక్రమంగా బిల్లులు పెట్టి  టెలి మెడిసిన్ పేరుతో 2 కంపనీలు 20 కోట్ల ఫేక్ బిజినెస్ చేసిందని అరోపణ. ఈఎస్ఐ స్కాం సమయంలో  ఆర్ధిక లావాదేవిలు జరగలేదని ఆయా కంపనీలను వదిలేశారు. (Nano re medical technology private limited, VR Telehealth services  pvt limited ).  2017 లో వీఆర్ టెలిహెల్త్ కంపనీ రిజిస్ట్రేషన్ కాలేదు. మరో కంపనీ  కంపనీ వివరాలు వరంగల్ ఈఎస్ఐ హాస్పటల్ సూపరెండెంట్ క్రాంతి సాగర్ అడ్రస్ పై నమోదు అయింది. అంటే ప్రభుత్వ పెద్దలు, బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో ఈ దందా కోనసాగిందని అనుమానాలు ఉన్నాయి. ఉద్యోగులకు  టెలి మెడిసిన్ , గుండెకు సంబందించిన  ఈసీజీల సర్వీస్ ఇచ్చేలా  ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వం ఈసీజీ కోసం టెండర్స్ లేకుండానే ఒక్కొక్క ఈసీజీ కి రూ. 600లకు పైగా బిల్లింగ్ చేసినట్లు సమాచారం. ఒక్క ఈసీజీ తీసి 10 ఈసీజీ ల పేర్లు నమోదు చేశారని అభియోగం ఉంది.  టెలి మెడిసిన్ పేరుతో 20 కోట్ల ఫేక్ బిల్లులు తయారు చేశారని తెలుస్తుంది.


కమిటీ ఏర్పాటు చేసి మరి ఒత్తిడి. 

2018 నుంచి అక్రమాలు జరిగాయని పెండింగ్ లో ఉన్న బిల్లులకు 6 నెలల నుంచి రెక్కలు వచ్చాయి. వీరికి బిల్లులు ఇచ్చేందుకు జాయింట్ డైరెక్టర్ గౌతమ్ తో పాటు సుధాకర్, రియాంబర్స్ మెంట్ మెంబర్, రవీందర్ తో కూడిన కమిటీని వేసి వీరి ద్వారా బిల్లులు క్లియర్ చేసుకుంటున్నారు. వీరి పై మాజీ ఏంపీ వినోద్ కుమార్, సీఏంవో ఆఫీస్ నుంచి భూపాల్ రెడ్డి నుంచి ఒత్తిడి తీసుకోచ్చి డబ్బులు తీసుకునేలా ప్లాన్ చేశారు. 70 డిస్పెన్సరీల ఇంచార్జీలు మాత్రం ససేమిరా అంటున్నారు. అప్పుడు జరిగిన అవకతవకలకు తాము ఎప్పుడు బలవుతామోనని సంతకాలు చేయడం లేదు. మేము ఆ రోజు లేమని.. ఇప్పుడు ఉన్నవారిగా ఎలా క్లియరెన్స్ ఇస్తామని వాపోతున్నారు. 


ఏపీలో జరిగింది ఇదే స్కాం. 

టెలి మెడిసిన్ పేరుతో జరిగిన మోసం పై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అప్పటి టీడీపీ మంత్రి అయినా అచ్చెంనాయుడిని అరెస్ట్ చేసింది. ఆ రోజు టీడీపీ తెలంగాణలో టెండర్స్ లేకుండా పనుల అప్పగింత పాలసీనే ఫాలో అయ్యామని చెప్పారు. ఏపీ చార్జీషీట్ దాఖలు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వం కనీసం స్కాం జరిగిన తీరును పట్టించుకోవడం లేదు. ఆ పైగా బిల్లులు ఇచ్చేలా కమిటీలను ఏర్పాటు చేయడం .. ఎన్నికల కోడ్ ఉన్నా.. డబ్బులు రిలీజ్ చేయాలని ఒత్తిళ్లు తీసుకరావడం ఎంటో తెలంగాణ ప్రభుత్వ అడ్మిస్ట్రేషన్ కే తెలియాలి. 


అక్రమాల పై నిగ్గు తెల్చాలి. - శ్రీనివాస్, సిపీఏం హైదరాబాద్ సిటీ సెక్రెటరీ. 

ఈఎస్ఐ స్కాం జరుగుతుందని  భయటపెట్టిన సీపీఎం పార్టీ సిటీ కార్యదర్శి శ్రీనివాస్. మళ్లీ దోచుకుంటున్న తీరు పై మండిపడ్డారు. ఏసీబీ అధికారులు కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును ఎలాంటి టెండర్స్ లేకుండా ప్రయివేట్ కంపనీలకు దోచిపెట్టడాన్నితప్పుపట్టారు. ఈఎస్ఐ దందాల పై కొత్త ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత పూర్తి బండారం భయటపెడుతామని దేవికారాణికి పడిన శిక్ష ఇప్పుడున్న ఈఎస్ఐ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్స్ కి పడుతుందని హెచ్చరించారు.

Leave a Comment: