Posted by admin on 2023-11-14 05:45:04 | Last Updated by admin on 2025-07-07 11:39:34
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 521
ఐటీ దాడుల్లో 7 కోట్ల నగదు స్వాధీనం
కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్ లు రికవరీ.
రెడ్డి ల్యాబ్స్ డైరెక్టర్ ఇంట్లో సోదాలు.
9 ప్రాంతాల్లో ముగిసిన ఆదాయపు పన్ను శాఖ అకస్మితిక తనిఖీలు.
మహేశ్వరం అభ్యర్ధుల పై ఐటీ ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటీ ?
ప్రదీప్ రెడ్డి అక్రమ సంపద పై తేలుకుట్టిన దొంగలా మంత్రి కుమారుడు.?
పోలీస్ శాఖలో డిసిపి వ్యవహారం తీరు పై చర్చ.
పాత పరిచయాలతో ఎస్వోటీలను శాశిస్తున్న వైనం పై పిర్యాదులు.
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ కథనంతో బాధితుల్లో బరోసా.
by
Devender Reddy
9848070809
సోమవారం జరిగిన ఐటీ దాడుల్లో 7 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు ఆదాయపు పన్ను శాఖ. వివాదస్పద భూముల్లో తల దూర్చి వందల కోట్లు అక్రమ లావాదేవీలు జరుపుతున్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులకు నగదు సహాయం చేస్తున్నారని ఐటీ అధికారులు ఏకకాలంలో 9 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. రెడ్డీ ల్యాబ్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో ఓ అభ్యర్ధికి డబ్బులు సమకూర్చుతున్నారనే సమాచారంతో సోదాలు నిర్వహించారు. మరోవైపు మంత్రి సబిత ఇంద్రా రెడ్డి కుమారుడి బినామి గా వ్యవహారిస్తున్న ప్రదీప్ రెడ్డి నివాసమైన మైహోం బూజా లో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. కీలకమైనన డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఓపెన్ చేసి బుధవారం ఐటీ కార్యలాయానికి పిలిచే అవకాశాలు ఉన్నాయి.
మహేశ్వరమే టార్గెట్.
మహేశ్వరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్దుల ఇళ్లలో వారి అనుచరుల పై ఐటీ సోదాలు చేసింది. మహేశ్వరంలో బిజేపి గెలుస్తుందని సర్వేలు చెప్పుతున్నాయి. అందుకు ఈ ఇద్దరీ నేతలను ఎన్నికల్లో డబ్బులు తియ్యకుండా చూసేలా ప్లాన్ చేశారని చర్చ జరుగుతుంది.
డిసిపి తీరు పై నిఘా
రాజకీయనాయకులకు, రియల్టర్స్ కి అండదండగా ఉంటూ అక్రమంగా భూములు సంపాదిస్తున్న సైబరాబాద్ లోని డిసిపి పై నిఘా పెంచింది కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఎస్ఓటీ లో పనిచేసిన పరిచయాలతో అక్రమంగా ఆ సిబ్బందిని వాడుకుంటున్న తీరు పై ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బిజేపీ అగ్రనేతలు ఆ డిసిపికి బంధువులుగా ఉండటంతో ఆయన ఎక్కడైన కీలక పోస్టుల్లో ఉంటూ సెటిల్మెంట్స్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అరోపిస్తున్నారు. గతంలో ఓ కన్వేన్షన్ సెంటర్ ఓనర్ సైబరాబాద్ లో 15 కేసులకు పైగా నమోదయ్యాయి. వాటి పై చర్యలు తీసుకోకుండా ఉంటే భూమి అప్పగిస్తామని హామితో కేసులను నీరుగార్చారని బాధితులు, కాంగ్రెస్ నేతలు అరోపిస్తున్నారు.
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ కథనాలతో బాధితుల్లో బరోసా
సీలింగ్ యాక్ట్ ప్రకారం మిగులు భూములుగా ఉన్న గుట్టల బేగంపేట్ భూముల పై ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతుంది. వందల కొద్ది అగ్రిమెంట్లు, కోట్లాది రూపాయలు అక్రమంగా చేతులు మారుతున్నాయి. అధికార బలంతో అక్రమ భూములను సక్రమంగా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కబ్జాలోకి తీసుకునేందుకు పోలీసుల సహాయసహాకారాలు తీసుకుంటున్నారు. సివిల్ మ్యాటర్ లో ఇన్వాల్ అయిన అధికారులు గతంలో నమోదయిన కేసులను భూషిగా చూపించి భయపెడుతున్నారు పోలీసులు. నార్సింగ్ లో ఓ భూ సెటిల్మెంట్ లో ఇలానే తలదూర్చారని తెలుస్తుంది.