Posted by admin on 2023-11-15 03:55:22 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 531
కోర్టుకు చేరిన కాళేశ్వరం - క్యాచ్ ప్రాజెక్ట్.
భూపాలపల్లి కోర్టులో నేడు విచారణ.
పిర్యాదు పై ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు.
తప్పిదాలు చేసిన వారి పై కేసు నమోదు చేయాలని పిటిషన్.
నిందుతులుగా కేసీఆర్, హారీష్ రావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్,
ఇంజనీర్స్ హరీరాం,శ్రీధర్ తో పాటు మెగా, ఎల్ అండ్ టీ లను చేర్చిన పిటిషనర్.
ఎస్.ఆర్. నెంబర్ 1969 కేటాయించిన భూపాలపల్లి కోర్టు.
ఛీటింగ్, కుట్ర కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి.
ఎఫ్ఐఆర్ అయితే రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు.
రాజకీయ విమర్శలకే పరిమితం అయిన ప్రతిపక్షాలు.
న్యాయపోరాటం దిశగా అడుగులు వేస్తున్న ప్రజా సంఘాలు.
గతంలో కాళేశ్వరం పై సంచలన కథనాలు ఇచ్చిన
లాండ్స్ అండ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ దేవేందర్ రెడ్డి .
by
Devender Reddy
9848070809
కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రజల అవసరాలకంటే ఎక్కువగా క్యాచ్ రూపంలో మార్చుకోవడానికే పనికొచ్చిందని అధారాలతో సహా ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ దేవేందర్ రెడ్డి ప్రత్యేక కథనాలు ఇచ్చారు. చెప్పినట్లే.. నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టడం, నియమనిబంధనలు పాటించకుండా టెండర్స్ ఇవ్వడం, ఇంజనీర్స్ కాంట్రక్ట్ కంపనీల ఇంట్లో మనుషుల్లా వ్యవహారించడం, బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే రీ డిజైన్ చేసిందని ఎన్నో కథనాలు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశాం. చేసిన తప్పిదాలకు కప్పిపుచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు న్యాయపరంగా ఎదుర్కోనేందుకు ప్రజలు సిద్దమయ్యారు. అందుకు పోలీసులకు పిర్యాదు చేశారు. వేల కోట్లు నష్టం వాటిల్లేలా చేసిన వారి పై పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో కోర్టులో ప్రయివేట్ పిటిషన్ దాఖలు చేశారు. అనుమతించిన భూపాలపల్లి ప్రిన్సిపల్ కోర్టు ఎస్.ఆర్ నెంబర్ 1969 కేటాయించింది. నేడు విచారించేందుకు కోర్టు లిస్టింగ్ చేసింది. బుధవారం ప్రతివాదులైన వారిని నిందుతులుగా చేర్చుతూ ఎఫ్ఐఆర్ చేసి విచారించేలా కోర్టు అదేశిస్తే.. సంచలనంగా మారనుంది. ఒక వేళ కోర్టు తమ పరిధిని దృష్టిలో ఉంచుకొని పిటిషన్ తిరస్కరించినా.. హైకోర్టుకు అప్పిల్ కు వెళ్లేందుకు పిటిషనర్ నాగవెల్లి రాజలింగమూర్తి సిద్దమవుతున్నానని తెలిపారు.
రాజకీయాలకే పరిమితం అవుతున్న పార్టీలు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం లా మారిందని బీజేపీ, ప్రాజెక్ట్ మాటున అక్రమంగా సంపాదించిన వాటిని కక్కిస్తామని కాంగ్రెస్ చెప్పుకుంటున్నాయి కానీ ఎక్కడ ఆ దిశగా అడుగులు పడటం లేదు. దీంతో ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు న్యాయ పోరాటం చేసేందుకు సిద్దమవుతున్నారు. అందుకు తొలి అడుగులు ముందు పడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేయకపోడంతో కోర్టు రిఫర్ కేసుగా పిటిషన్ దాఖలు చేశారు. అధికారుల తప్పిదాలు వారి అక్రమ సంపాదన పై కూడా విచారణ జరిపించేలా దర్యాప్తు చేయాలని వివిధ దర్యాప్తు ఏజెన్సీకి పిర్యాదులు అందించేందుకు సిద్దమవుతున్నారు. 2 వేల కోట్లతో మేడిగడ్డలో కుంగిన పిల్లర్స్ నిర్మించవచ్చని కేటీఆర్ చెప్పడం పై అనేక అనుమానాలు ఉన్నాయి. నిర్మాణ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థను కూడా నాణ్యత విషయంలో తప్పుదారి పట్టించింది ఏవరనేది కీలకంగా మారింది. ఈఎన్సీల వ్యవహారం తీరు పై విచారణ ముగిస్తే గాని ఎక్కడెక్కడ ఎన్ని తప్పిదాలు చేశారో వాటిని ఎలా సరిదిద్దుకోవాల్సి ఉంటుందో బట్టభయలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.