Posted by admin on 2023-11-16 02:58:05 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 303
నల్గోండలో ఐటీ రైడ్స్ కలకలం.
మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్యెల్యే అనుచరుల ఇళ్లలో సోదాలు.
పవర్ ప్రాజెక్ట్స్ తో పాటు పలు బిజినెస్ లో ఉన్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కుటుంబం.
ఉదయం నాలుగు గంటల నుంచే అకస్మతిక తనిఖీలు
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ బ్యూరో.
తెలంగాణలో ఇంకోసారి ఐటీ అధికారులు కొరడా ఘుళిపిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే 40 బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లోని విజం శ్రీధర్ రావు ఇంట్లో మిర్యాలగూఢలోని వైదేహి టౌన్ షిప్ లోను సోదాలు కొనసాగుతున్నాయి. మిర్యాల గూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అనుచరుడిగా పేరుంది. ఎన్నికల కోసం భారీగా డబ్బులు నిల్వ ఉంచారన్న అరోపణలతో ఐటీ అధికారులు అకస్మతిక తనిఖీలు చేపట్టారు. నల్గోండ బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలయింది. రియల్ ఎస్టేట్ సంస్థల వద్ద పెద్ద ఎత్తున సొత్తును దాచిపెట్టారని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల నగదు అంతా ఇప్పటికే నియోజవర్గాలకు చేరిందని తెలుసుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రతి నియోజకవర్గం పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక నుంచి ప్రతి రోజు దాడులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం.