Posted by admin on 2023-11-21 07:39:14 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 409
By
Devender Reddy .9848070809.
ఈ ఏడాది చుక్క నీళ్లు కూడా వాడుకోలేం.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్న అన్నారం (సరస్వతి ) బ్యారేజీ , సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల్లో ఉన్న నీళ్లు అన్ని సముద్రంలోకి వదిలారు. ఏసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అని చెప్పిన తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్. ఎన్నికల ముందు బొక్కబొర్ల పడింది. ఎల్ అండ్ టీ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వెనక కుట్ర తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ లదేనని తెలుస్తుంది. అక్కడ గట్టి నేల వచ్చేంత వరకు తీయాల్సిన మట్టిని తియ్యకుండా ఇసుకలోనే పిల్లర్స్ వేయడంతో మొదటికే మోసం వచ్చింది. దీంతో సుందిళ్ల సామర్థ్యం 8.83 టీఏంసీలు కాగా ఇప్పటి ఉన్న నిల్వ 1.5 టీఎంసీలు. అన్నారం సామర్ధ్యం 10.97 కాగా.. ఇప్పుడు 1.5 టీఎంసీలకు తీసుకొచ్చారు. బ్యారేజీలో జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ తెలంగాణ ప్రభుత్వాన్ని అదేశించింది. దీంతో బ్యారేజీలోని రంధ్రాలు, పగుళ్లు ఏమైనా ఉన్నాయో గుర్తించాల్సిన అవసరం మన ఇంజనీర్స్ పై ఉంది. ఇక మేడి గడ్డ ఇప్పటికే కుంగిపోగా.. 16.17 టీఎంసీలు ఉండాల్సిన నీళ్లు 0.06 మాత్రమే ఉంచారు. ఇక ఈ ఏడాది ఒక్క చుక్క నీరు కూడా కాళేశ్వరం నుంచి సాగులోకి రాదని తెలుస్తుంది.
భూపాలపల్లి కోర్టు లో వ్రాతపూర్వక వాదనలు.
కేసీఆర్, హరీష్ రావు , ఐఏఏస్ అధికారులు రజత్ కుమార్, స్మితా సబర్వాల్ తో పాటు ఈఎన్సీల పై కాంట్రక్ట్ కంపనీలను నిందుతులుగా చేర్చుతూ వేసిన పిటిషన్ లో భూపాల పల్లి కోర్టు తర్జన భర్జన పడుతుంది. ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయాలా లేదా.. వ్రాతపూర్వక వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలో సమయం తీసుకుంటుంది. మంగళవారం వాదనలు ఇస్తే తీర్పును వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి.
సిబిఐ దర్యాప్తు కోసం ఢిల్లీ టూ హైదరాబాద్.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సిబిఐ దర్యాప్తు జరిపించాలన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఢిల్లీ హైకోర్టులో వేసి పిటిషన్ పై విచారణ జరిగింది. హైదరాబాద్ హైకోర్టులోనే తెల్చుకోవాలని సూచించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమయింది.
సెంట్రల్ కి అధారాలు కావాలా..
కేంద్రంలో అధికారంలో ఉన్న
బిజేపీ పార్టీ కేసీఆర్ పై కాళేశ్వరం పై మాటలకే పరిమితం అవుతున్నారు. డీపీఆర్ సరిగ్గా
లేకుండానే ప్రాజెక్ట్ నిర్మించినా ప్రశ్నించదు. వేల కోట్ల రూపాయాలు క్యాచ్ రూపంలో విత్
డ్రా చేసుకున్న కనిపించదు. కాగ్ నివేదికలో కాళేశ్వరం కాదు తెలంగాణ ప్రజల పై శనిశ్శరం
అని తెల్చిచెప్పినా కేసులు ఉండవు. కాని తెలంగాణలో అధికారం వస్తే మాత్రం అరెస్ట్ లు
చేస్తామని అమిత్ షా హైదరాబాద్ లో మాట్లాడిన తీరు పై బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కే అనిపిస్తుంది.