IT raids on MIM binams and BRS MLA Rohith Reddy

Crime News Breaking News

Posted by admin on 2023-11-25 06:10:42 | Last Updated by admin on 2025-07-08 01:51:47

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 282


IT raids on MIM binams and BRS MLA Rohith Reddy

  • పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది పెరుగుతున్న ఐటీ దాడులు.
  • ఎంఐఎం, బీఆర్ఎస్ అనుచరుల ఇళ్లలో సోదాలు. 
  • కింగ్స్ గ్రూప్, కోహినూర్ కంపనీలకు ఎంఐఎం పార్టీకి లింకులు. 
  • పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడి కి సన్నిహిత సంబందాలు.  
  • కింగ్స్ గ్రూప్ షానవ్వాజ్, కోహినూర్ గ్రూప్ మజీద్ ఖాన్ వద్ద భారీగా నగదు. 
  • నగదు నిల్వల పైనే ఐటీ శాఖ నిఘా ? 
  • రాజేంద్రనగర్ గెలుపు కోసమే అంటున్న నేతలు.
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ (బ్యూరో )9848070809

    ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ లో భారీనగదు పై దృష్టి పెట్టింది. ప్రతి పార్టీ ఎన్నికలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేల నగదు నిల్వలు ఉంచారు. వీటన్నింటి పై నిఘా ఉంచింది. పతంగి పార్టీకి ఎప్పటి నుంచో కోహినూర్ గ్రూప్ ,కింగ్స్ గ్రూప్ అధినేతలు బినామిలుగా ఉన్నారనే అరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టు పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేశారు. ఫలక్ నుమా, శాస్ట్రీ పురం లో 4 టీంలు తనిఖీలు చేస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వీరి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజక వర్గం బీజేపీ అభ్యర్ధి తోకల శ్రీనివాస్ రెడ్డి గెలుపు అంచుల్లో ఉన్నారు. ఈ నగదు అంతా శ్రాస్ట్రీ పురం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధికి చేరుతుందని సమాచారం అందుకున్న ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.  పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడికి వీరికి దగ్గర సంబందాలు ఉండటంతో ఈ దాడులు పైలట్ రోహిత్ పై కూడా జరగుతున్నట్లు పుకార్లు వచ్చాయి. 


Telugu latest News | Crime News | Scams | Telangana War 2023


Leave a Comment: