Posted by admin on 2023-12-09 04:38:40 | Last Updated by admin on 2025-07-08 03:37:15
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1119
By
Devender Reddy
9848070809
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ డాట్ కమ్ వ్రాసిన కథనం తెలంగాణ ఆఫీసర్స్ లో సంచలనం సృష్టించింది. ఇన్నాళ్లకు నిజాలను నిర్బయంగా చెప్పే రోజులు వచ్చాయని సంబరపడ్డారు. వివిధ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 400 కోట్ల అక్రమాస్తులు సంపద నిజమే అయి ఉంటుందని చర్చించుకున్నారు. సీఎం రేవంత్ దృష్టికి వెళ్లడంతో ఇంటలిజెన్స్ అధికారులు పూర్తి అధారాలు సేకరించారు. ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ వద్ద ఉన్న సాక్షాదారాలు తీసుకున్నారు. మొదటి దఫా లిస్టులో ఎవ్వరెవరి ఫైరవీలతో అనర్హులకు ఎలా ఐఏఎస్ హోదా ఇచ్చారో పూర్తి సమాచారం సేకరించారు. రూల్స్, మెరిట్ ప్రకారం, 5 గురిలో 3 గురు ఆ ఫోస్టులకు అనర్హులేనని తెలిపోయింది. కేవలం మంత్రుల వద్ద పనిచేస్తున్నారు కాబట్టే ఇచ్చేశారు. అదే అదునుగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ అంటూ 10 మంది అభ్యర్ధులను చేర్చి వారి వద్ద నుంచి ఖర్చులు పెట్టించిన మహేందర్ తీరు పై మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నెల 20 న ఇంటర్వ్యూ లిస్టులో అక్రమాలకు తావు కల్పించింది కూడా మహేందరేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కేటీఆర్ ఓస్డిగా ఉండటంతో తనకు అనుకూలంగా , వీలుగా లిస్టు తయారయిందని అనుమానిస్తున్నారు. ఈ లిస్ట్ ని వెనక్కి తెప్పించాలా.. లేక అందులోనే అర్హులు, మెరిట్ ప్రకారం పేర్లని పరిశీలించాల అనేది సీఎస్ , సీఎం నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు సమాచారం. 10 మంది ఇంటర్వ్యూ అభ్యర్ధుల్లో లిస్టులో 4 గురు ఏపి స్థానికత ఉండటంతో వారు అర్హులు కారని ప్రాథమికంగానే గుర్తించారు.
అక్రమ సంపద పై వేట మొదలయింది.
రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ అధికారం అంతా కొంత మంది చేతిలోకి వెళ్లడంతో .. గత పరిపాలనను పూర్తిగా బృష్టుపట్టించారనే అరోపణలు ఉన్నాయి. కలెక్టర్స్ , మంత్రులకు దగ్గరగా ఉండే అధికారులు వందల కోట్లు అక్రమంగా సంపాదించారు. ఆ అధికారుల లిస్టు రెడీ అవుతుంది. మహేందర్ మూడు నెలల క్రితం ఐటీ దాడులు జరిగిన ఓ రియల్ ఎస్టేట్ కంపనీలో పెట్టుబుడులు పెట్టారని వివరాలు సేకరిస్తున్నారు. ధరణి పేరుతో విచ్చల విడిగా సంపాదించిన కలెక్టర్స్ అమోయ్ కుమార్ , హరీష్, హాన్మంతరావు, శరత్, ల పై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు సమాచారం. ధరణి పై సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కి రిపోర్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది.
కీ పోస్టులో ఉంటే అంతా కామన్.
కేటీఆర్ కు ఓస్డీగా చేసి ఇప్పుడు లూప్ లైన్ లోకి వెళ్లేందుకు సిద్దమయినా మహేందర్ ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ కామ్ చీఫ్ ఎడిటర్ ని సంప్రదించారు. ఆ రోజుల్లో ఒత్తిడితో కొన్ని జరిగి ఉంటాయి. ఇలాంటి అరోపణలు వస్తుంటాయని అన్నారు. అయితే ప్రభుత్వం మారడంతో ఈ లిస్టులో తన పేరు ఉన్నా.. మెరిట్ ప్రకారం రాదని అర్ధమయినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో కీ రోల్ ఉన్న ఆఫీసర్స్ పై దర్యాప్తు చేయాలని పిర్యాదులు అందుతున్నాయి. లోకాయుక్తాలో సెక్షణ్ 7 ప్రకారం సీఎస్ కి లేదా డీజీపి కి అదేశాలు జారీ చేయవచ్చని పిటిషనర్ గోపాల్ శర్మ చెప్పారు.
KTR OSD Mahender | IAS List | UPPSC | CM Revanth on BRS corruption | BRS illegal activities |