Cheater Cheedhar Rao Cheating Style

SCAMS Real estate fraud and scams

Posted by admin on 2023-12-21 05:48:49 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 134


Cheater Cheedhar Rao Cheating Style

  1.         ఛీటర్ చీధర్ రావు పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిఘా.
  2.         20 ఏండ్లలో 22 వేల కోట్ల ఛీటింగ్ సంపద పై ఆరా
  3.         డీకే శివకుమార్ తో మాట్లాడించి డిజీపీ పోస్టు ఇప్పించానని బాతకాలు.
  4.         సన్నాయి నొక్కులతో ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయడంలో చీధర్ రావు దిట్ట.
  5.         బాధితుల్లో 150 మంది బ్యూరోక్రాట్స్ యే అంటే ఎంత జాదో.
  6.         సిబిఐ,ఈడీ, ఇన్కమ్ టాక్స్ , మున్సిపాల్టీ అధికారుల అక్రమ సంపదే టార్గెట్ గా ఛీటింగ్.
  7.         అప్పా వద్ద ఎస్టేట్ కొనుగోలులో ఖమ్మం తాజా మంత్రి బాధితుడే.
  8.         అసాంఘీక రేప్ కేసులో కోర్టులను తప్పుదారి పట్టించిన వైనం.
  9.         అబద్దాలతో తెచ్చుకున్న ఆర్ఢర్స్ ని సస్పెండ్ చేసిన హైకోర్టు.
  10.         1000 కోట్ల ఇన్కమ్ టాక్స్ చెల్లింపుల్లో 92 స్టే ఆర్డర్స్ తో జాప్యం.
  11.         ఎదురుతిరిగిన బాధితుల పై పక్క రాష్ట్రాల్లో కేసులు .
  12.         ఎంత పెద్ద ఆఫీసర్స్ నైనా అమాయకంగా నటిస్తూ ఇట్లే వాడేస్తాడు.  
  13.         తన ఫ్యాలెస్ లో కూర్చోబెట్టి అరచేతిలో అద్బుతాలు చూపిస్తాడు.
  14.         మూడునెలలు అయితే కాని మోసపోయామని తెలియని పరిస్థితి.
  15.          ఇలాంటి వారితో హైదరాబాద్ కే చెడ్డపేరంటూ అధికారుల వద్దకు రిపోర్టు.
  16.         మహానగరంలో మాయగాడి మోసాలతో జర జాగ్రత్త. ?
  17.         కట్టడి చేస్తేనే మరోక్కరు ఇలా వ్యవహారించరు.  
  18.       తనకు ఫీజు కట్టలేని కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తి కేవలం కల్లబొల్లి  కబుర్లతో 20 ఏండ్లుగా అధికారులను , బిజినెస్ మెన్స్ ని మోసం చేస్తూ 22 వేల కోట్ల ఆస్తులను కూడబెట్టాడు.  మోసాలనే పెట్టుబడిగా పెట్టిన తీరు అందరికి అర్ధమవుతుంది. వివాదస్పదంగా, విచిత్రంగా వ్యవహారించే ఈ ఛీదర్ రావు అవితాబ్ బచ్చన్ వియ్యకుండిని మోసం చేసి తీహార్ జైలుకి వెళ్ళివచ్చినా బుద్ది రావడం లేదు.  కొత్త గా ఏర్పాడిన ప్రభుత్వంలో అంతా తానే కర్నటక నుంచి నడిపిస్తున్నాని చెప్పుకోవడం ప్రభుత్వంలోని పెద్దలను ఇబ్బందులకు గురిచేస్తుంది. డీకే శివకుమార్ తన జేబులో ఉన్నట్లే చెప్పుతాడు. కర్నాటకలో డికే కి చెందిన 700 ఎకరాలు తానే కొనుగోలు చేశానని ఆ పరిచయంతోనే డిజీపీగా రవిగుప్తాను నేనే పెట్టించానని ఓపెన్ గా చెప్పుకోవడంతో కొత్త మోసాలకు తెరలేపుతున్నారని నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించాయి.

 మోసాల్లో ఫస్ట్ స్టేప్.

        తన లంకంత కొంపలోకి తీసుకెళ్లి వేల కోట్ల అస్తి పరుణ్ణి నాకు ఇవ్వన్ని ఒక  లెక్కేనా అంటూ  ప్రారంభించే ముచ్చట్లతో అరచేతిలో సర్గం చూపిస్తారు. జీవితాంతం కష్టపడ్డా రాని సొమ్ము నాతో జర్ని చేస్తే లైఫ్ సెట్ చేస్తానంటూ పలుకుతారు. ఆ మాటలకు ఆయనకు ఉన్న ఆస్తిని చూపిస్తే ఎవ్వరైనా ఇట్లే ఫిదా అయిపోవాల్సిందే. ఇలా మోసపోయిన వారి లిస్టు భారీగానే ఉంది.

వేల కోట్ల అస్థి ఎలా సాధ్యమయింది.

        నమ్మిన వారిని ఒమ్ముచేయడం వెన్నతో పెట్టిన విధ్య, 2000 సంవత్సరం లో  ఎల్బీనగర్ లో మొదలైన ఇతగాడి అరాచకాలు , అక్రమాలు  , మోసాలతో  నమ్మించి సంపాదించిన  ఆస్తులతో  లక్డికపూల్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ,గచ్చిబౌలి, కోకాపేట్, అప్పా జంక్షన్ వరకు  విస్తరించాడు. 2009లోనే ఓ సిటీ ప్లానర్ వద్ద నుంచి 30 కోట్ల కాష్ రాబట్టారు. ఆ తర్వాతి కాలంలో అదే అధికారి పై ఏసీబీ దాడి చేపించి తనని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేపించటమే కాకుండా , ఒక్క రూపాయి కూడా రాకుండా ఆ అధికారి తానంతట తాను ఆ డబ్బుని వదిలేసుకునేటట్టు చేసాడు.  ఆ డబ్బుతో 2009 కొన్న ఆస్తులు ఈ రోజు 3000 వేల కోట్లకు చేరుకుంది. బ్యూరో క్రట్స్  ఎవరెవరు అక్రమంగా సంపాదిస్తున్నారో లిస్ట్ చేసుకుంటారు. ఢిల్లీలో లేదా ముంబాయిలో ప్రాపర్టీ కొందాం అని చెప్తాడు. ఇన్కమ్ బాగుంటుంది అని ఆశ చూపిస్తాడు . నమ్మక్కమ్ కుదరకపోతే హైదరాబాద్  మార్కెట్ లో 10 కోట్లు విలువ చేసే భూమిని లేదా కమర్షియల్ భవంతిని చూపించి 6 కోట్లకు ఇచ్చేస్తాను చెప్పుతారు. మార్కెట్లో కూడా నిజంగా 10 కోట్లు విలువ చేస్తుంది. ఆ ప్రాపర్టీల అద్దెలతో మీరు, పిల్లల జీవితం సెటిల్ అవుతుందని భూతాల స్వర్గం చూపిస్తాడు. నిజమనే అనిపిస్తుంది. కానీ ఇదంతా క్యాష్ తన చేతికి చేరేంత వరకే ఉంటుంది. అగ్రిమెంట్లు చేసిన అందులో లిటిగేషన్ ఉంటుంది. డబ్బులకు రిసిప్ట్ ఇవ్వకుండా తిప్పించుకుంటాడు. పోలీస్ కేసులు పెడదామని అనుకుంటే డబ్బులు ఎలా వచ్చాయో లెక్క చెప్పలేరు. మొదట్లో రోజులు, నెలలు పోయి 5 ఏండ్ల వరకు ఆ డబ్బులు అసలు మాత్రమే ఇచ్చేలా చేస్తాడు. అప్పటికే ఆ డబ్బులతో ఆయన పేరు మీద ప్రాపర్టీ తీసుకుంటారు. అది మూడోంతలు అవుతుంది. కోటి రూపాయల నుంచి 100 కోట్లు పెట్టిన కేవలం అధికారులే 150 మంది ఉంటారంటే అశ్చర్యపోనవసరం లేదు. ఏ అధికారైనా ఒత్తిడి చేస్తే.. ఏసీబీ రైడ్స్, అదాయపన్ను శాఖ అధికారులకు లీకులు ఇచ్చి నోటీసులు ఇప్పిస్తాడు. దీంతో ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు నోరెత్తకుండా ఉంటున్నారు. పరిచయాలు ఉన్న వ్యక్తిని బొల్తా కొట్టించి.. ఆ వ్యక్తి వద్ద నుంచి ఎన్ని పనులు ఎలా నయానో , భయానో చేయించుకోవాలో ఆ  చీధర్ రావుకు మాత్రమే తెలుసు.

 మంత్రి బాధితుడే.

     ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అప్పులో ఇరుక్కుంటుంది. అప్పా జంక్షన్ వద్ద వారి ఎస్టేట్ ని విక్రయించేందుకు రేడీ అవుద్ది. 5 కోట్లు ఎకరం చొప్పున బేరం పెట్టుకుని ఆ మంత్రి వద్ద 7 కోట్లు చెప్పుతారు.ఒకే సారి 50 కోట్లు తీసుకోచ్చి అడ్వాన్స్ ఇస్తారు. ఇలా డబ్బులు ఒక్కరివి బిజినెస్ మరోక్కరిదా అనుకుంటూ చీధర్ రావు చరిత్ర తెలుసుకుని ఇప్పటిచీదురించుకుంటారు ఆ మంత్రి.

 రేప్ కేసులో నోటీసులు ఇవ్వకుండానే క్లోజ్ చేశారు.

        అసాంఘీక రేప్ కేసులో అరెస్ట్ అయినా చీధర్ రావు ఆ తర్వాత కోర్టులో మూడో హియరింగ్ కే కేసును క్లోజ్ చేపిస్తాడు. బాధితుడి తరుపున వాదించాల్సిన  పీపీ , అసలు వాదనలు వినపించకుండానే, బాధితుడికి నోటీసులు ఇవ్వకుండానే  కేసును క్లోజ్ చేశారు. తనకు ఎలాంటి నోటీసులు రాకుండానే  కేసు క్లోజ్ చేశారని బాధితుడు అవేదన వ్యక్తం చేస్తున్నాడు. చీధర్ రావు న్యాయవ్యస్థను తప్పుదారి పట్టించాడని అరోపణలు ఉన్నాయి. ఈ రేప్ కేసు క్లోజ్ విషయం పై సమగ్ర విచారణ జరిపిస్తే, న్యాయ వ్యస్థను ఎలా వాడుకున్నాడో ఎవ్వరికైనా అర్ధం అవుతుంది. లుక్ అవుట్ నోటీసులు రద్దు చేయాలని హైకోర్టులో WP No. 44985/2022 దాఖలు చేశారు. ఇందుకు రేప్ కేసు క్లోజ్ అయినందున లుక్ అవుట్ నోటీసులు తీయించుకోవాలని ఆరాటపడుతున్నారు. కాని రేప్ కేసులో బాధితుడు బెంచ్ మీదికి వస్తే ఇంప్లిడ్ అయ్యేలా ఉండటంతో.. బెంచ్ మీదికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

 హైకోర్టులో లెక్కలేనన్ని కేసులు.

        చీధర్ రావు పై 35 కేసులు నమోదు కావడంతో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనను ఎప్పుడు, ఏ కేసుల్లో అరెస్ట్ చేయరాదని, ఏ కేసులోనూ FIR నమోదు చేయకూడదని , ఎలాంటి విచారణకు పోలీసు స్టేషన్ కి పిలవకూడదని, హైకోర్టును తప్పుదారి పట్టించి ఒక ఉత్తర్వులు తీసుకొచ్చుకున్నాడు. ఆలాంటి తీర్పు ఇంత వరకు దేశంలో ఏ న్యాయస్థానం ఇవ్వలేదని ఒక బాధితుడు అదే హై కోర్ట్ లో WP No. 37689/2021 పిటిషన్ లో ఇంప్లిడ్ అయిన సమయంలో సీ.జే  సతీష్ చంద్ర సంబోదిస్తూ " ఈ కోర్ట్ ఇలాంటి ఆర్డర్ ని ఎప్పుడు ఉపేక్షించదు అంటూనే ఆ తీర్పును రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణ చేయవచ్చని , అవసరమైతే అరెస్ట్ కూడా చేయవచ్చున్నని వాఖ్యా నించారు. జస్టిస్ కన్నెగంటి లలిత పూర్తి వాదనలు విన్న తర్వాత జస్టిస్ విజయ్ సేన్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.  

 ఎక్కడ చిక్కడు దొరకడు.

        అదాయపు పన్ను శాఖకు సుమారు 1000 కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు అస్తులు ప్రీజ్ చేశారు. అధికారుల నోటీసులకు హైకోర్టుకు వెళ్లుతూ.. ఎదో వంకతో తప్పించుకుంటున్నారని అరోపణలు ఉన్నాయి. హైకోర్టులో ఒక్క 2021లోనే 92 రిట్ పిటిషన్స్ ఐటీ శాఖ మీద వేసి మేనేజ్ చేస్తున్నరంటే ఎంత జాదు గా వ్యవహారం ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.   ఎవ్వరికి డబ్బులు తీసుకున్న రిసిప్ట్స్ ఉండవు. ఇతను ఇచ్చినా అగ్రిమెంట్లలో అమౌంట్ తక్కువ వేపిస్తాడు. బినామి యాక్ట్ పై చర్యలు తీసుకుంటే తప్పా.. లెక్కలు భయటకు రావు. ఎవ్వరు కొత్తగా వచ్చినా.. కొత్త రీల్ వేస్తూ.. అధికారులను మచ్చిగా చేసుకుంటారు. చివరికి వాళ్లను కూడా మోసం చేస్తుంటాడు. అందుకే ఆ లిస్టు పెరుగుతునే ఉంది.

బాధితులకు భయం పుట్టాల్సిందే.

        కొత్తగా మాధపూర్, జూబ్లిహిల్స్ లో డిసిపిలు, ఏసీపీలు వస్తే వాళ్లకు చేతులు తడిపి ఆయన ప్రాపర్టీస్ చూపిస్తాడు. ఉన్నతాధికారులు రోజు మాట్లాడుతారని ఫోజులు కొడుతాడు. మీడియా పెద్దలంతా మా గుప్పిట్లో ఉంటారని ఊదరగోట్టుతాడు. ఇలా దగ్గరకు తీసుకుని చిన్న చిన్న బాధితుల పై అక్రమంగా కేసులు నమోదు చేయించుతాడు. మాధాపూర్ డీసీపీ సందీప్ రావు తో కలిసి నార్సింగి SOT CI శివ ప్రసాద్ తో కుమ్మకై కొంతమంది బాధితులపై డ్రగ్స్ కేసులు బనాయించి, భాదితులని చాలానే హింసించారు , లేదా పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఇబ్బందులకు గురి చేసేలా చేపిస్తాడు. దీంతో చాలా మంది ఇతని ల్యాండ్స్ లేదా భవనాలు లీజుకు తీసుకుని మోసపోయిన బిజినెస్ మెన్స్ ఛీదర్ రావుతో ఎందుకు లే అని వదిలేసుకుని వెళ్లిన వారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా 13 కోట్లు డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్న శ్రీనివాస్ హోసమనే అనే 63 ఏళ్ళ  వ్యక్తిని అక్రమంగా కర్ణాటక పోలీసులతో అరెస్ట్ చేపించి ఒక 5 రోజులు నాలుగైదు పోలీసుస్టేషన్ లు తిప్పి , కొట్టి చివరికి ఆ బాధితుడి దగ్గర తెల్ల కాగితాల మీద సంతకాలు చేపించుకుని వదిలేసారు.  ప్రిన్సిపాల్ సెక్రటరీ మంజునాథ ప్రసాద్ మరియు కొల్హర్ జిల్లా ఎస్పీ నారాయణ తో కుమ్మకై , హైదరాబాద్ కి ఒక 10  మంది కర్ణాటక పోలీసుల్ని పంపించి ముగ్గురు బాధితుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం పీట్ వారెంట్ లేకుండా కర్ణాటక రాష్ట్రంలో కొల్హర్ పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింసలకి గురిచేసారు. ఇది అక్రమ అరెస్ట్ అని న్యూస్ మీడియా చానెల్స్ లో రావటంతో మంజునాథ ప్రసాద్ కాళ్ళ బేరానికి వచ్చి  బాధితుల్ని వదిలేసారు . కర్ణాటక లో డి కె శివ కుమార్తో తనకి బిజినెస్ లావాదేవీలు ఉన్నాయి అని ఇప్పటికి జనానికి చెప్పుకుంటాడు ఈ చీదర్ రావు. వాస్తవానికి అతనికి డి కె  శివ కుమార్ని ఎప్పుడు కూడా కలిసింది లేదు అని మాకు తెలిసింది .

 సొమ్ముంతా వేరే వాళ్లు పెట్టాలి.

        సొమ్ముంతా వేరే వాళ్లు పెట్టాలి. డెవలప్ అయ్యాక స్వాధీనం చేసుకోని తరమి కొట్టేలా పక్క ప్లాన్ వేసుకుని సమయానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. తక్కువలో తక్కువ 50 లక్షలు కనిపించని మోసం చేసి భయటకు పంపిస్తుంటాడు. ఈ లిస్టు లో 10 లక్షల నుంచి 4 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయిన వారిలో 100 మందికి తక్కువ ఉండరని తెలుస్తుంది. 

 కీలక వ్యక్తులను అవసరం ఉన్నన్ని రోజులు గుప్పిట్లో పెట్టుకుంటాడు.

        ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను తన మాటలతో గుప్పిట్లో పెట్టుకుంటాడు. గతంలో కొంత మంది మీడియా ప్రముఖులను గట్టిగా వాడేశాడు. వారికి తెలియకుండానే వారి పేర్లు వాడి  కోట్లాది రూపాయల బిజినెస్ చేశాడంటే ఎంత ముదురో తెలుసుకోవచ్చు. ఓ ఛానల్ వైస్ ప్రెసిడెంట్ ని ఎలా వాడుకోవాలో వాడుకుని అమ్మిన ఇళ్లును మళ్లీ అమ్మి, పెట్టుబడులు అంటూ 25 కోట్ల వరకు మోసం చేశారని తెలుస్తుంది. ఓ పేరుపొందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ ని బుట్టలో వేసుకుని , CA కి ఉన్నా పరిచయాలతో పోలీసుల్ని మేనేజ్ చేస్తున్నాడు అని ప్రధానంగా వినిపిస్తుంది . ఇలా ఏ రోజుకు ఎవ్వరు దొరికితే వారికి గుడ్ మార్నింగ్ తో స్టార్ట్ చేసి.. మూడు నెలల్లో మొత్తం సినిమా చూపించి ఛీటింగ్ కి ఫ్లాన్ చేస్తాడు చీధర్ రావు. అయితే గతంలో కేటీఆర్ పేరును వాడుకుని పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఎమ్మెల్యేలను బురిడీ కొట్టించినట్లు అధారాలు లభించాయి. అప్పుడు కేటీఆర్ ఇప్పుడు డీజీపీ, సీఎం పేరును విరివిరగా వాడుతుండటంతో నిఘా వర్గాలు ఇయన పై ఉన్న కేసులు , బాధితుల వ్యవహారాలను ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్ని కేసులు పెట్టినా అన్ని వ్యవస్థలను మాయమాటలతో మేనేజ్ చేసుకోవడంలో దిట్ట అని తెలుసుకున్న అధికారులు ఇతగాడి  మోసాలను కట్టడి చేసి పనిలో నిమగ్నం అయ్యినట్టు తెలియవచ్చింది . హైదరాబాద్ లో ఇలాంటి వారికి గుణపాఠం నేర్పించేలా కఠిన చర్యలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. చెన్నైలో సీఎం స్టాలిన్ మనుషుల వద్ద కూడా ఇలానే వ్యవహారిస్తే తగిన చర్యలు తీసుకున్నట్లు ప్రచారం ఉంది. ఓ సినిమా ప్రముఖున్ని ఇబ్బందులు పెట్టి , మోసం చేసి అక్కడ ఆస్తులు కూడబెట్టిన అధారాలు ఉన్నాయి. చీధర్ రావు ఛీటింగ్ ల గురించి చెప్పితే.. ఓ పుస్తకం రాయోచ్చని బాధితులు క్యూ కడుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉన్న పని ఇదే  

ఇలాంటి ఛీటర్స్ ని వదిలి వాళ్ల మెదళ్లకు పదును పెట్టి మరిన్ని మోసాలు చేస్తారు. ఇప్పటికే కక్కలేక మింగలేక ఉన్నవారికి కనీసం ఉపశమనం అయినా కల్గుతుంది. వాపోతున్నారు. కనీసం భయట ప్రపంచానికైన తెలుస్తే ఇంకేవ్వరు చేసిన అందరికి తెలుస్తుందనే భయం ఉంటుందని బాధితులు అకాంక్షిస్తున్నారు. 

Leave a Comment: