BRS ex MLA Jeevan Reddy Kabja threating

SCAMS Real estate fraud and scams

Posted by admin on 2023-12-27 05:23:28 | Last Updated by admin on 2025-07-07 23:26:26

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 560


BRS ex MLA Jeevan Reddy Kabja threating

  • కొనసాగుతున్న బీఆర్ఎస్ నేతల అరాచాకాలు.
  • అధికార బలంతో అప్పట్లో రెచ్చిపోయిన జీవన్ రెడ్డి
  • ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్న వైనం. ?
  • వ్యాపారవేత్త  సామ దామోదర్ రెడ్డి కి బీహార్ గ్యాంగ్ స్టైలో స్పాట్ పెట్టి బెదిరింపు.  ?
  • సుఫారీ 50 లక్షలు తీసుకున్నాం నిన్ను ఖథం చేస్తానని ఫోన్స్.? 
  • కోటి  రూపాయలు నాకు ఇస్తే నిన్ను ఎవరు చంపమన్నారో చెబుతామన్న దుండగులు. 
  •  బిట్ కాయిన్ స్కానర్ కు పంపాలని వాట్స్ అఫ్ మెసేజ్.
  •  నా వెంట బీహారీ గ్యాంగ్ ఉంది. క్షణాల్లో నిన్ను చంపేస్తామంటూ  ఫోటోలు.  
  • తనకు ప్రాణ హాని ఉందని 25న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.
  •  రిసార్ట్స్ ని కబ్జా చేసిన  పట్టించుకోని శంకర్ పల్లి పోలీసులు. అప్పటి కమిషనర్లు. 
  • శంకర్ పల్లిలో జీవన్ రెడ్డి జీవలీలలు అంటూ ఆరు నెలల క్రితమే ఇన్వేస్టిగేషన్ కథనం. 
  • మోసాలతో 93 ఎకరాలు రిజిస్ట్రేషన్ మరో 200 ఎకరాలు కబ్జా

by

Devender Reddy

9848070809.

అధికారం పోయినా బీఆర్ఎస్ నేతల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు పోలీసులు. 25న పిర్యాదు చేస్తే ఇప్పటికి ఆ దుండగులను పట్టుకోలేకపోయారు. ఆ బెదిరింపులు, హత్య వెనక అర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ దందా ఎలా మొదలైయింది. లీజుకంటూ వచ్చి కబ్జా ఎలా పెట్టాడో 6నెలల క్రితమే దేవేందర్ రెడ్డి అధారాలతో సహా కథనం ఇచ్చారు. పోలీసుల పేరు చెప్పుకోని అసలైన ఓనర్ సామా దామోదర్ రెడ్డిని ఆయన రీసార్ట్ లోకి రానివ్వలేదు. పైగా ఇప్పుడు చంపేస్తామని బెదిరించడం. 50 లక్షలు సుఫారీ తీసుకున్నాం అంటూ ఆ డబ్బులు చూపించడం, కోటి రూపాయలు ఇస్తే ఎవ్వరు చేయమన్నారో చెప్పుతామని బరితెగించి బీహార్ గ్యాంగ్ మాట్లాడుతుంది. అన్ని ఎవిడెన్స్ ఇచ్చినా.. పోలీసులు ఇంకా చర్యలు చేపట్టలేదు. 300 ఎకరాలను కబ్జా చేస్తే మీకు వాటా ఇస్తానని అప్పటి యువరాజును గుప్పిట్లో పెట్టుకోవడంతో ఆ రిసార్ట్స్ ని కబ్జా చేసి  ఇన్నాళ్లు ఆ మాజీ ఎమ్మెల్యే అడిందే ఆట.. పాడిందే పాటగా మార్చుకున్నాడు. ప్రభుత్వం మారడంతో రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

అసలు కథ ఇదే.

న‌గ‌ర శివార్లలోని భూములు అప్పటి అధికార పార్టీ నేత‌ల‌కు బంగారు బాతుల్ల మారాయి.. వంద‌ల ఎక‌రాలు ఒకే చోట ఉంటే ఎదో విధంగా ఎంట్రీ ఇచ్చి క‌బ్జా చేశారు. అందుకు నిద‌ర్శనం శంక‌ర్ ప‌ల్లిలోని ఈర్ల‌ప‌ల్లి వ‌ద్ద ఉన్న‌ చైత‌న్య రిసార్ట్స్ వ్య‌వ‌హార‌మే ఉద‌హార‌ణ‌. గ‌తంలో ఈ రిసార్ట్స్ లో రేవ్ పార్టీలు న‌డిపిస్తున్న‌ట్లు ప‌ట్టుబ‌డ్డ వార్త‌ల‌తో ఈ పేరు అంద‌రికి ప‌రిచ‌యం అయింది.  300 ఎక‌రాల్లో రియ‌ల్ ఎస్టేట్ , రిసార్ట్స్ వ్యాపారం చేసుకుందామ‌ని 2003లో కొనుగోలు చేశారు సామా దామోద‌ర్ రెడ్డి కుటుంబం. 2016 వ‌ర‌కు రియ‌ల్ ఎస్టేట్ అంత‌గా లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ఎమ్మెల్యేలు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగు పెట్టారు. అంద‌రిలాగానే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి చైత‌న్య రిసార్ట్స్ పై క‌న్ను ప‌డింది. ఎలాగైనా చేజిక్కించుకోవాల‌ని ప్లాన్ వేశారు. డ‌బ్బులు లేకుండానే త‌న వివాద‌స్ప‌దమైన విల్లాను 15 కోట్ల‌కు వ్రాయించి ఇచ్చారు. 2400 గజాలు ఉంటే 3 వేల గజాల విల్లా అని సామా కుటుంబానికి అంటగట్టారు. మున్సిపల్ టాక్స్ చెల్లించలేదు. కొంపల్లిలో టైటిల్ లేని 22 వేల స్వోయిర్ ఫీట్ల భవనాన్ని అగ్రిమెంట్ చేశాడు.  ఇలా మోసం చేసి మాయ మాట‌ల‌తో రిసార్ట్స్ లోని 93 ఎక‌రాలు, దాని భ‌య‌ట 20 ఎక‌రాలు 113 ఎక‌రాల‌ను రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నాడు. 113 ఎక‌రాల పేరుతో మ‌రో 63 ఎక‌రాల‌ను క‌బ్జా చేశాడు. వెంక‌టేశ్వ‌ర స్వామి, సాయిబాబా గుడిని మింగేశాడు. సామా ప‌ర‌మారెడ్డి ఫంక్ష‌న్ హాల్ ని జీవ‌న్ రెడ్డి ఫంక్ష‌న్ హాల్ గా మార్చేశాడు. మొత్తం 300 ఎక‌రాలు నాదే అని బ‌రితెగించి క‌బ్జాలో ఉంటు ఎవ్వ‌రిని రానివ్వ‌లేదు.  

సెటిల్మెంట్ల పేరుతో బ‌ల‌ప‌డ్డ జీవ‌న్ .

 అందితే జుట్టు, అంద‌క‌పోతే కాళ్లు ప‌ట్టుకునే ర‌కంగా మారారు ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి. ఎంవోయి పేరుతో లాభాలు తీసుకోస్తాన‌ని చెప్పి.. ఒక్క రూపాయి చెల్లించ‌కుండా.. వంద‌ల కోట్ల భూమిని లాగేసుకున్నారు. అప్పటి వ‌రంగ‌ల్ మంత్రి దయాకర్ రావు పిలిచి మాట్లాడితే ఒకే అన్నారు. మైనంపల్లి హన్మంత్ రావుతో సెటిల్మెంట్ అంటూ అప్పటి యువరాజుని ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత ఎంట్రీ ఇచ్చారు. అయితే డబ్బులు ఇచ్చి మొత్తం సెటిల్మెంట్ చేసుకోవాలని జీవన్ రెడ్డికి చెప్పగా... సామా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. మంత్రి హరీష్ రావు ఎంట్రీ ఇస్తే..15 కోట్లతో అంతా సర్దుమనిగింది అని చెప్పాడు. దౌర్జన్యం వద్దు అంటూ హెచ్చరించనా.. పద్దతి మార్చుకోలేదు. పైగా పోలీసులను రంగంలోకి దింపి కబ్జాను అధికారికంగా చేసుకున్నాడ జీవన్ రెడ్డి.  

పోలీసులు ప‌ట్టించుకోరు.

ఎన్ని తతంగాలు చేసినా పోలీసులు అటువైపు చూడ‌టం లేదు. స్థానిక పోలీస్ స్టేష‌న్ నుంచి డీజీపీ వ‌ర‌కు పిర్యాదులు చేసిన మంత్రి ఈ భూమి వెన‌క ఉన్నార‌ని తాము జోక్యం చేసుకోలేమ‌ని నేరుగా చెప్పేవారు.  

రిసార్ట్స్ గ‌లీజ్ ప‌నులు.

 చైత‌న్య రిసార్ట్స్ లో గ‌తంలో సుజీత్ రావు, సుమంత్ రావు లు న‌డిపించే వారు. 2013లో రేవ్ పార్టీ న‌డిపిస్తూ దొరికి పోయారు. 20 ఏండ్ల లీజ్ ఉన్నా.. వారిని కేసుల‌తో భ‌య‌పెట్టించి.. గ‌న్ చూపించి జీవ‌న్ రెడ్డి త‌న‌దైన  స్టైల్ లో భ‌య‌ట‌కు పంపించారని టాక్. ఆ త‌ర్వాత జిందాల్ వారితో టై అప్ అవుదామ‌ని చెప్పి.. వారితో అగ్రిమెంట్లు చేసుకున్నార‌ని అంటున్నారు. నెల‌కు 12 ల‌క్ష‌ల చొప్పున లీజు కుదిరింద‌ని ప్రచారం చేసుకున్నాడు.. ఆ రిసార్ట్స్ లో ప్ర‌యివేట్ పార్టీల పేరుతో నానా గ‌లీజ్ ప‌నులు జ‌రుపుతున్నార‌ని ఇప్పటికి అరోప‌ణ‌లు ఉన్నాయి. వీటి పై సైబ‌రాబాద్ పోలీసులు దృష్టి పెట్టాల్సి ఉంది. ఇంజ‌నీరింగ్ కాలేజీ నిర్మిద్దాం అనుకుని అనుమ‌తులు తీసుకున్నా సామా దామోదర్ రెడ్డి కుటుంబం.. జీవన్ రెడ్డి కబ్జాతో అంతా నాదే అన‌డంతో బాధితులు ఎవ్వ‌రికి చెప్పుకోవాలో దిక్కు తొచ‌ని స్థితిలో ఉన్నారు. అధికార బ‌లంతో వంద‌ల కోట్ల విలువ చేసే భూముల‌ను క‌బ్జా చేయ‌డం అంద‌రిని అశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. రూపాయి పెట్టుబ‌డి లేకుండా అనధికారికంగా మరో 173 ఎక‌రాల‌ను త‌న కంబంధ హాస్త‌ల్లో పెట్టుకుని ఆట‌లాడిస్తున్న తీరు పై విచారణ జరపాల్సి ఉంది.

రౌడీ ముకలకు ఏది శిక్ష.

ఎన్నో దందాలు చేసి , రౌడీయిజంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యేలు తాజాగా ఇలా వ్యవహారించడం కలవరపెడుతుంది. అధికారం ఉన్నప్పుడు పోలీసులు, ఇప్పుడు  కిరాయి ముఠాలతో రెచ్చిపోవడం శాంతి భద్రతలకే విఘాతం. దామోదర్ రెడ్డికి మరెవ్వరితో గొడవలు లేకపోవడం. జీవన్ రెడ్డియే హత్యకు కుట్ర పన్ని ఉంటాడని అనుమానాలు రెక్కిస్తున్నారు బాధిత సామా కుటుంబం. 

Armoor Jeevan Reddy | Sama Damodhar reddy | Chaithnay Resorts kabja | BRS Ex MLA Jeevan reddy | Shankarpally kabja |



Leave a Comment: