Posted by admin on 2024-01-05 04:35:22 | Last Updated by admin on 2025-07-08 00:32:20
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 831
Landsandrecords.com
By
Devender Reddy
9848070809
ఐ అండ్ పీఆర్ ఈ శాఖ చివరి మూడు నెలలు తప్పా.. మాజీ సీఎం కేసీఆర్ వద్దే ఎక్కువ రోజులు ఉంది. ప్రచార అర్బాటాలకు ఎక్కువ ప్రాధన్యత ఇచ్చే ప్రభుత్వం కావడం. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారడంతో దేశం మొత్తం వెయ్యి కోట్లకు పైగా ప్రకటనలు వెదజల్లేలా ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేశారు. పథకాలు ప్రజలకు చేరాలనే పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహారించారు. దీంతో ఐ అండ్ పీఆర్ లో అరాచకం రాజ్యమేలింది. అక్రమ సంపద పొగుచేసుకున్నారు. ఔట్ డోర్ మీడియాతో కలుపుకుంటే గడిచిన 5 ఎండ్లలోనే మొత్తం వెయ్యి కోట్ల స్కాం జరిగిందని ఆ శాఖ అధికారులే అనుకుంటున్నారు. అనుకున్న బడ్జెట్ కంటే మూడోంతలు విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఏ ఒక్క సమాచారం అడిగినా ఇచ్చే నాథుడే లేడు. ఆర్టీఐ వేస్తే సమాధానం రాదు. అప్పిల్ కి వెల్దామంటే ఆర్టీఐ కమిషనర్స్ ని నియమించరు. ప్రజల సొమ్ముని ఇబ్బడి ముబ్బడి గా ప్రచారానికి ఖర్చు చేసి అడ్డగోలు గా దొచుకున్న వ్యక్తుల్లో ఈ రిటైర్డ్ ఆఫీసర్, డైరెక్టర్ బి. రాజమౌళి ముందు ఉంటాడని అరోపణలు ఉన్నాయి.
ఆపరేషన్ ఇలా ఉంటుంది.
ప్రకటనలు ఇవ్వదలుచుకుంటే ఐ అండ్ పీఆర్ కి తెలియజేస్తుంది ప్రభుత్వం. అక్కడ ఎంపానల్ చేసుకున్న 20 ఏజెన్సీలు ఉంటాయి. కాని చక్రం తిప్పేది అంతా వలయం, తేజ లాంటి ఎజెన్సీలే ప్రధాన 5 పత్రికలకు, ఛానల్స్ కి ఎలాగు రిలీజ్ ఆర్డర్ ప్రకారం ఇస్తుంటారు. మిగితా ఎజెన్సీకి కూడా పెద్ద ఎజెన్సీ వారే మాట్లాడి ఇచ్చేస్తుంటారు. ఇందులో ఎజెన్సీ నుంచి 15 శాతం కమిషన్ కామన్ గా ఉంటుంది. ఫుల్ జాకెట్ ప్రకటనల్లో భారీ బడ్జెట్ ఉంటే పెద్ద ఎజెన్సీ వలయం జగన్ మోహన్ తో కూడిన మాయలు ఉంటాయి. చిన్న పత్రికలు, చిన్న ఛానల్స్ పబ్లిషర్స్ ని నేరుగా పిలుపించుకునే వారు రాజమౌళి. అసలు మీ మీడియాకు ఈ యాడ్స్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాని నేనే పెట్టించాను. కొంత వరకే ఇస్తానని బేరాసారాలు అడుతారు. సరే ఎంతో కొంత వస్తుంది కదా అని మార్కెంటింగ్ పర్సన్స్ ఒప్పెసుకుంటారు. ఇలా అందరిని ఎప్పుడు ఒకేసారి కలువరు. ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతారు. రేపు యాడ్ వేయాలి అనుకున్నప్పుడు మరోసారి పిలుపిస్తారు. ఎజెన్సీకి వచ్చిన రేట్ కి మీకి సంబందం ఉండదు. ఏజెన్సీ ఎంత ఇస్తుందో అంత తీసుకోవాల్సిందేనని ఒక్క రోజు ముందు చెప్పేస్తారు. దీంతో డైలామాలో పడ్డ మార్కెంటింగ్ టీం. మీరు ఎంతైనా పెట్టుకోండి మన మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఇస్తే చాలు అంటారు. ఇందులో జీఎస్టీ తిరకాసు కూడా ఉంటుందని మళ్లీ డబ్బులు నొక్కెస్తారట. అయితే పెద్ద ఎజెన్సీ డబ్బులు ఇవ్వడం కూడా బాధ్యత తీసుకోవడంతో తొందరగా వస్తున్నాయని ఎలాంటి స్కాంలు జరిగినా పత్రిక యాజమాన్యాలు ఊరుకున్నట్లు తెలుస్తుంది.
ఇతర రాష్ట్రాల యాడ్స్ తో కోట్లు సంపాదించాడు.
కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, బెంగాల్, ఢిల్లీ,మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ , పంజాబ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల లోకల్ పత్రికలకు యాడ్స్ ఇచ్చింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ గా దేశం మొత్తం వెలిగేలా.. ప్రకటనలు ప్రజల సొమ్ముతో ఇచ్చారు. మధ్య ప్రదేశ్ కి చెందిన డైనిక్ భాస్కర్ పేపర్ కి ఒక్క జాకెట్ యాడ్ 4 కోట్లు, ఉత్తర ప్రదేశ్ లోని అమర్ ఉజాలకు మూడున్నర కోట్లు . ఇలా నార్త్ , నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోని ప్రతికలకు ఆర్.వో వందల కోట్లు రిలీజ్ చేశారు. అదే దక్షిణ భారత దేశంలో తక్కువ రేట్ కే ఇచ్చేశారు. కర్నాటక లో 500, మహారాష్ట్రాలో 1000 రూపాయల స్లాట్స్ ఇచ్చేశారు. అయితే ఔట్ డోర్ మీడియాకు పార్టీ యాడ్స్ లా ప్రభుత్వం ప్రకటనలను వాడుకున్నారు. కేరళ లోని నెంబర్ 1 పేపర్ కి కోటి రూపాయలు యాడ్ అని ఆర్ వో రిలీజ్ అయితే.. ఎజెన్సీకి కోటీ వచ్చినా.. అక్కడి యజమాన్యానికి మాత్రం 40 లక్షలే చేరేది. ఇలా చాలా రాష్ట్రాల పేపర్స్ కి, టీవీలకు రిలీజ్ అయినా సొమ్ములో 60 శాతం డబ్బులను ఇక్కడ ఉన్న ఎజెన్సీలు, రాజమౌళి నొక్కెశారు. అప్పటి ముఖ్యమంత్రి అదేశాలతో మహారాష్ట్రలో లోక్ మత్ అనే పేపర్ కి ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. పంజాబ్ కేసరీ లాంటి పత్రికలకు అడగకుండానే యాడ్స్ ఎక్కువ రేట్లతో కుమ్మరించారు. అక్కడికి చేరింది ఎంత అనేది మాత్రం ఇప్పటికి తెలియదు. ఎవ్వరు అడిగే వారే లేరు. బీఆర్ఎస్ గా అవతరించే సమయంలో ఎంత అంటే అంతా ప్రచారానికి పెట్టేశారు. ఇలా అక్రమంగా సంపద అంతా రామాంతాపూర్ దర్గా దగ్గరకు చేరుకునేది. ప్రజల సొమ్ము తలా ఇంత పంచుకున్నా.. ఎవ్వరికి నొప్పి ఉండకపోయేది. భయటకు తెలిసినా మాదేమి పోతుంది లే అని వదిలేచేవారు.
చిన్న పత్రికలను పట్టించుకోలేదు.
గడిచిన 9 ఎండ్లలో వ్యవస్థను నడిపించేందుకు నడిచే చిన్న పత్రికలకు యాడ్స్ ఇవ్వలేదు. ఫైట్ చేస్తే సగానికి తగ్గించి ఇచ్చారు. వారి బాధలు వర్ణనాతీతం. సొంత రాష్ట్రంలో వీరికి యాడ్స్ ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు, వాళ్లకు అనుకూలమైన వారికి మాత్రమే కమిషన్స్ తీసుకొని ఇచ్చేవారని చిన్న పత్రికల వారు వాపోతున్నారు.
ఇప్పటికైనా చర్యలు ఉంటాయా సార్.
ప్రజల సొమ్మును తిన్నదంతా కక్కిస్తామన్న కాంగ్రెస్ సర్కార్.. కేవలం తప్పించేసి చేతులు దులుపుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. ఐ అండ్ పీఆర్ లో స్కాంల గురించి ఎవ్వరిని కదిలించినా ఇట్లే చెప్పుతారు. ఒక్కసారి విచారణకు అదేశిస్తే.. కుప్పలు, తెప్పలుగా పిర్యాదులు అందుతాయి. ఎన్ని డబ్బులు విడుదల అయ్యాయి. ఎంత ఎజెన్సీకి వెళ్లాయి. పబ్లిషర్స్ తీసుకున్నది ఎంతా..? ప్రచారం చేసింది ఎన్ని స్లాట్స్, ఔట్ డోర్ మీడియాలో ఎన్ని రోజులు వేయాల్సిన ప్రచారం ఎన్ని రోజులు బోర్డుల పై ఉన్నాయి. ఎన్నింటికి ఆర్.ఓ లు తీసుకుని ఎన్నింటికి వేశారు. చిన్న ఛానల్స్ రేట్లు తగ్గించి ఎక్కువ స్లాట్స్ తో ఎంత నొక్కెశారో.. నెల రోజుల్లో భయటపెట్టవచ్చు. ఐ అండ్ పీఆర్ నుంచే మొదలు పెడితే అందరు సంతోషిస్తారని అంటున్నారు ఐ అండ్ పీఆర్ లో ఉన్న అధికారులు. స్కాంలకు ఎలా తెరలేపారో..
అధారాలతో సహా మీ ముందు ఉంచుతాం.. చర్యలు తీసుకుంటారా..?
గత మూడేళ్లలో 1500 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ సర్కార్ ఎంపానల్ ఎజెన్సీలను పెంచిపోషించాయి. పేద వాడిలా నటిస్తూ లబ్బర్ చెప్పులు, చినిగిన చొక్కాల వేషదారాలతో ప్రజల సొమ్మును బీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహారిస్తూ రాజమౌళి ఎలా లూటీ చేశారు. శాఖల వారిగా ఎంత ఇచ్చారు. ఔట్ డోర్ మీడియాని వాడుకుంది ఎంతా.. ఎలా దొచుకున్నారు. వలయం, తేజా పబ్లిసిటీ, స్లోకా, టచ్ స్టోన్, అదిత్య కమ్యూనికేషన్, పెంపెస్ట్, వినాయక, వెనిగెస్ ఇలా ఎవ్వరరెవరు ఏం చేశారో పూసగుచ్చినట్లు మీ ముందుకు అధారాలతో సహా ఉంచబోతుంది ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ .కామ్.
I&PR Scam in Telangana | B Raja Mouli, Director i and pr | i and pr telangana | KCR I&PR Scam | BRS Adds I&PR Telangana | Valayam Agency | Valayam Jaganmohan Reddy |