CCS Focus on Sahithi Scam lands and records.com Effect

Crime News Breaking News

Posted by admin on 2024-01-07 10:00:51 | Last Updated by admin on 2025-07-07 22:57:50

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 757


CCS Focus on Sahithi Scam lands and records.com Effect

  • సాహితీతో అంటకాగిన వారికి ఇక చుక్కలే. 
  • రంగంలోకి దిగిన సిసిఎస్ పోలీసులు. 
  • సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్‌ రూ.1800 కోట్లుగా తేల్చిన పోలీసులు
  • సాహితీ ఇన్‌ఫ్రాపై ఇప్పటివరకు 50 కేసులు నమోదు
  • ఫ్రీలాంచ్ పేరుతో పెద్దఎత్తున డబ్బు వసూలు చేసిన సాహితీ
  • 9 ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన సాహితీ ఇన్‌ఫ్రా
  • సాహితీ స్వాద్‌ పేరుతో రూ.65 కోట్లు
  • సిస్టాఅడోబ్‌ పేరుతో రూ.79 కోట్లు.
  • సాహితీ గ్రీన్‌ పేరుతో రూ.40 కోట్లు.
  • సాహితీ సితార పేరుతో రూ.135 కోట్లు.
  • సాహితీ మెహతో పేరుతో రూ.44 కోట్లు.
  • ఆనంద ఫర్చూన్‌ పేరుతో రూ.45 కోట్లు.
  • సాహితీ కృతి పేరుతో రూ.16 కోట్లు.
  • సాహితీ సుదిక్ష పేరుతో రూ.22 కోట్లు.
  • రూబికాన్ సాహితీ పేరుతో రూ.7 కోట్లు వసూలు
  • వసూలు చేసిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్న లక్ష్మినారాయణ.
  • భూములు కొనుగోలు చేయకున్నా ఫ్రీలాంచ్‌ పేరుతో వసూళ్లు.
  • సాహితీ స్కామ్‌ దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన సీసీఎస్
  • గత కొంత కాలంగా ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ప్రత్యేక కథనాలు. 
  • ఎవ్వరెవరికి డబ్బులు చేరాయో ప్రత్యేక కథనాలు. 
  • By

Devender Reddy

9848070809

ప్రీలాంచ్ పేరుతో జనం సొమ్ము దోపిడీ చేసిన సాహితీ గ్రూప్ ప్రతినిధిలు ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే. ప్రతి పైసా ఎక్కడికి పోయిందో సీసీఎస్ పోలీసులకు తెలిసిపోయింది. శనివారం అన్ని ప్రాజెక్టుల బాధితులతో హైదరాబాద్ క్రైం అడిషనల్ కమిషనర్ రంగనాథ్ సమావేశం ఏర్పాటు చేశారు. లెక్కలు అన్ని పక్కాగా తెల్చారు. 1800 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం వచ్చింది. అయితే ఆ సొమ్మంత ఎక్కడికి పోయింది . ఎంత మంది నిందుతులు ఉన్నారనే సమాచారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గతంలో సాహితీ లెక్కల పై ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ప్రత్యేక సమాచారం పోలీసులకు అందించింది. తాజాగా మారో సారి పోలీసులకు బాధితులు ఇచ్చినదే కాకుండా ఫినిక్స్ లాంటి సంస్థలకు ఎలా చేరాయో ఎక్స్ క్లూజివ్ సమాచారం చేరవేస్తుంది.

 అమీన్ పూర్ లో రూ.430 కోట్ల వసూలు– ఫినిక్స్, ఒమిక్స్ సంస్థలకు ఎక్కువ ట్రాన్స్ ఫర్స్

సాహితీ సంస్థ నుంచి లక్ష్మీ నారాయణ తన కుమారుడికి నగదు ట్రాన్స్ ఫర్ చేశాడు. తర్వాత అతని అకౌంట్ నుంచి శిభ ఇన్ఫ్రా టెక్ కు ఆ సొమ్ము తరలింది. ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నది చుక్కపల్లి సతీష్, బూదాటి కొడుకు. వీళ్లు పార్టనర్స్ గా ఉన్న సంస్థకు సాహితీ నగదును తరలించారు. పోలీసులు ఈ లింక్స్ పై ఆరా తీయాల్సి ఉంది. సాహితీ నుంచి ల్యాండ్ అడ్వాన్సుల రూపంలో పలు కంపెనీలకు నగదు వెళ్లింది.  భూస్వాములకు ఇచ్చామంటున్న రూ.104 కోట్లు, అడ్వాన్సుల రూపంలో తరలిన రూ.129 కోట్లు, పర్సనల్ గా వాడేసుకున్న రూ.112 కోట్ల లెక్కలు బయటకు తీసి.. తమకు ఆ సొమ్ము తిరిగి ఇచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు కస్టమర్లు. అయితే ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. క్యాష్ డిపాజిట్ల ద్వారా రూ.112.58 కోట్లను మళ్లించాడు. 2019 నుంచి 2023 వరకు పలు దఫాలలో ఈ డిపాజిట్లు జరిగాయి..సాహితీ కన్ స్ట్రక్షన్స్ కు రూ.43 కోట్లు, సాహితీ శ్రీ కన్ స్ట్రక్షన్స్ కు రూ.21 లక్షలు, సాహితీ ఇన్ఫ్రాకు రూ.2.50 లక్షలు, సాహితీ ఇన్ఫ్రా టెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు రూ.69 కోట్లు వెళ్లాయి.  ఇంత మొత్తంలో నగదు క్యాష్ డిపాజిట్ ఎలా చేశారు? బ్యాంకులు ఎలా యాక్సెప్ట్ చేశాయో దర్యాప్తులో తెలనుంది.  వసూలు చేసిన 430 కోట్లలో 67 కోట్లు వరకు పర్సనల్ అవసరాల కోసం వాడేసుకున్నాడు, రూ.52 కోట్లను క్యాష్ రూపంలో సైడ్ చేశాడు. కుమారుడికి రూ.5 కోట్లు, కుమార్తెకు రూ.2 కోట్లు ఇచ్చాడు. ఇవి కాకుండా రూ.104.92 కోట్ల రూపాయలను ల్యాండ్ అడ్వాన్సుల రూపంలో తరలించాడు. వీటిలో ఫినిక్స్, ఒమిక్స్ సంస్థలకే అధికంగా నగదు సరఫరా అయింది. అలాగే, ఫినిక్స్ తో పాటు ఇతర కంపెనీలకు లోన్స్, అడ్వాన్సుల రూపంలో పంపిన అదనపు సొమ్ము రూ.129 కోట్లకు పైనే ఉంటుంది. పెద్దగా సంబంధం లేని ఫినిక్స్ సంస్థకు అధిక సంఖ్యలో డబ్బులు ముట్టడమే పెద్ద ప్రశ్నగా మారింది. యజమాని పేరు మీద ప్రభుత్వ వాల్యూ ప్రకారం 15 కోట్లు వెళ్లగా.. మిగతావి క్యాష్ గా ఇచ్చారు. దీని వెనుక రహస్యం పోలీసులే ఛేదించాల్సి ఉంటుంది. ఏకరాకు ఫినిక్స్ కు రూ. 7  కోట్లు  ఎక్కువ చెల్లించారు. ఫినిక్స్, బూదాటి లక్ష్మీ నారాయణ కలిసి రిజిస్ట్రేషన్ వాల్యూ విషయంలో రూ.16 కోట్లకు పైగా ప్రభుత్వాన్ని మోసం చేశారు.

అమీన్ పూర్ లో 1700 మంది బాధితులు.

అమీన్ పూర్ లో 23 ఎకరాల్లో సాహితీ ఇన్ఫ్రా టెక్ వెంచర్ వేసింది. మొత్తం 4,300 ప్లాట్లు అంటూ ప్రచారం చేసింది. 2019 జూన్ లో ప్రీలాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఫ్లాట్లను విక్రయించడం మొదలు పెట్టింది. దాదాపు 1700 మంది నుంచి రూ.430 కోట్ల దాకా వసూలు చేసింది. 2023 మార్చి కల్లా ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సంస్థ ఇంతవరకూ నిర్మాణం చేపట్టింది లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.25 లక్షలు, ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.35 లక్షల చొప్పున వసూళ్లకు పాల్పడ్డాడు లక్ష్మీ నారాయణ. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనుల్లో అడుగు పడకపోవడంతో బాధితులు ఆందోళన బాట పట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీ బసవరాజు – 8 ఎకరాలు, ట్విలైట్ ప్రాపర్టీ – 3 ఎకరాలు,  భవ్య ఎస్టేట్స్ – 1.5 ఎకరాలు, పీ రామ్మోహన్ రావు – 2.25 ఎకరాలు ,పీ లక్ష్మి నరసింహా – 0.25 ఎకరాలు ,దేవీ ప్రాపర్టీ – ఎకరం,  కే శ్రీనివాస్ రావు – 4 ఎకరాలు ,ఒమిక్స్ శ్రీనుబాబు – 5 ఎకరాలు కొనుగోలు చేశారు. 


పక్కదారి పట్టిన నిధులు

ప్రజల నుంచి సాహితీ లక్ష్మీ నారాయణ వసూలు చేసిన సొమ్ములో చాలా డబ్బు పక్క దారి పట్టింది. ఆ వివరాలను చూస్తే.. ఫినిక్స్ అండ్ ఒమిక్స్ సంస్థలకు ల్యాండ్ అడ్వాన్స్ కింద రూ.104 కోట్లు వెళ్లాయి. అలాగే, ఇతర భూముల వారికి ల్యాండ్ అడ్వాన్స్ రూ.74 కోట్లు ఇచ్చారు. అనుబంధ ప్రాజెక్టుల కోసం రూ.20 కోట్లు, బీఎల్ఎన్ వ్యక్తిగత అవసరాల కోసం రూ.67 కోట్లు, టీటీడీ సహా ఇతర డొనేషన్ల కోసం రూ.14.34 కోట్లు, వినోద్ కెడియాకు రూ.45 కోట్లు సమర్పించుకున్నారు. ఏజెంట్ కమిషన్ రూ.40 కోట్లు, క్యాష్ డిపాజిట్ రూ.51 కోట్లు, పది ఎకరాల పర్మిషన్ అండ్ ఇతర ఖర్చుల కోసం 15 కోట్లు కేటాయించారు.

ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఎఫెక్ట్. 

సాహీతీ స్కాం పేరుతో ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఎండీ. చీఫ్ ఎడిటర్ ఎన్నో కథనాలు ఇచ్చారు. ఎక్స్లూజివ్ గా సమాచారం సేకరించి బాధితులకు అందించారు. మధ్యతరగతి కుటుంబాల ఆశలను అసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేశారు. ఆ దందాలో పొలిటికల్ లీడర్స్ , ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు సబితా, మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మాగంటి గోపినాథ్ లు ఉన్నారు. వీరందరిని విచారిస్తే మరిన్ని విషయాలు భటయకు వస్తాయి. డైరెక్టర్స్ రూపంలో ఉన్న నిందుతులు కటకటాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈడీ కేసు నమోదు చేయడం , నోటీసులు జారీ చేయడంతో సీసీఎస్ పోలీసులు దూకుడు మీద ఉన్నారు.  


Leave a Comment: