Qudbullapoor consistency Govt Land Scam Value 5K Cr for BRS

SCAMS Real estate fraud and scams

Posted by admin on 2024-01-07 16:37:59 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 911


Qudbullapoor consistency Govt Land Scam Value 5K Cr for BRS

  • అత్యంత మెజార్టీ వచ్చినా నియోజకవర్గంలో
  • 5 వేల కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్.
  • అక్రమ నిర్మాణాలు, కబ్జాలే టార్గెట్ గా వెళ్లిన బీఆర్ఎస్ నేతలు.
  • పేదల కోసం అనుకుంటే పొరపాటే..?
  • వేల ఇళ్లు కూల్చివేసినా మళ్లీ చేపట్టుతున్న నిర్మాణాలు. 
  • ఇన్నాళ్లు ప్రభుత్వం ఉందని ధీమా, ఇప్పుడేందుకు ఆగడం లేదు.
  • హెడ్ కానిస్టేబుల్ కనుసన్నల్లో 60 గజాల దందా.. ?
  • వేల కోట్ల ప్రభుత్వ భూమి కళ్ల ముందే కనుమరుగు అయినా పట్టింపు లేదు. 
  • సర్వే నెంబర్స్ తో సహా సవాలు విసిరేందుకు బిజేపి సిద్దమయింది. 
  • నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎవరికి కాపాల ఉంటుంది. 
  • ప్రయివేట్ భూముల సెటిల్మెంట్స్ , కబ్జాలో కాంగ్రెస్ నేతలు బిజి అయ్యారా..? 
  • అత్యంత విలువైన భూములను కాపాడేది ఏవరు ?
  • హెడ్ కానిస్టేబుల్ అశోకుడు అక్కడ 60 గజాల్లో షెడ్ వేయించగలడు. 
  • 10 ఏండ్ల క్రితంలా పేదలు అవసరాలకు కబ్జా పెట్టుకోరు.
  • బీఆర్ఎస్ నేతలు అక్రమంగా అమ్ముకుంటారు. 
  • కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రభుత్వ భూముల కబ్జా పై
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్స్.కామ్ స్పెషల్ స్టోరీ.

by 

Devender Reddy 

9848070809.

హైటెక్ సిటీకి, అసెంబ్లీకి అందుబాటులో ఉండే ప్రాంతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. ఇండ్రస్టియల్ ఏరియా కావడంతో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉంటాయి. నిజాంపేట్ నుంచి మొదలు కొని కొంపల్లి వరకు రెండో అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయి. ఇదే అదునుగా కబ్జా దారులు అప్పటి అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోయారు. పేద కుటుంబాలకు 10 లక్షలకు 60 గజాలు అంటూ అంటకట్టి వందల కోట్లు సంపాదించారు. ఇప్పుడు కూల్చుతుంటే ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యే కే.పి వివేకనంద గౌడ్  అత్యంత మెజార్టీ గెలవడానికి కారణం ఈ కబ్జాలే.. ఆ ఓటర్స్ యే అంటే అశ్చర్యం లేదు. ప్రభుత్వ స్థలంలో కట్టుకున్నోడికి కట్టుకున్నంత.. అమ్ముకున్నోడికి అమ్ముకున్నంతగా దందా చేశారు. ప్రయివేట్ భూముల సెటిల్మెంట్స్ కాకుండా ఒక్క ప్రభుత్వ భూముల కబ్జా విలువనే అక్షరాల 5000 కోట్లు. 

గాజుల రామారం భూములు ఒక్కటి చాలు. 

దేవేందర్ నగర్, కైసర్ నగర్, షాబీర్ నగర్, నారాయణరెడ్డి నగర్,సిద్దులా నగర్ ఇలా వివిధ కాలనీల చుట్టు పక్కల ఉండే కాలనీల పేర్లతో సర్వే నెంబర్ 307,342,329 సర్వే నెంబర్ లో 153 ఎకరాలను కబ్జా చేశారు. క్వారీలు ఉంటే పూడ్చివేసి 60 నుంచి 100 గజాలుగా ప్లాటింగ్ చేసి 5 లక్షల నుంచి 10 లక్షలకు అమ్ముకున్నారు. ఈ ఒక్క కబ్జా లోనే ఎమ్మెల్యే అనుచరులకు 100 కోట్లు మిగిలాయి. కలెక్టర్ PRO No. A1/1221/2023 Dated: 11-05-2023 న స్వయంగా 2500 షెడ్స్ అక్రమంగా నిర్మించారు. వీటన్నింటి పై చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీ చేశారు. కాని ఎమ్మెల్యే వివేకనందగౌడ్ మాత్రం జీ.వో. నెంబర్ 59 ప్రకారం రెగ్యూలరైజేషన్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడ ప్రజల మీద ప్రేమతో కాదు. ప్రతి ప్లాట్ కి రెవెన్యూ కి 1 లక్ష, పోలీస్ అధికారులకు లక్ష, ఎమ్మెల్యేకి 2 లక్షలు, కరెంట్ మీటర్ ఇచ్చే వారికి లక్ష, ఇలా 5 లక్షలు మాముళ్లు పోగా.. పైన వచ్చిన సొమ్ముని మధ్యలో ఉండే బీఆర్ఎస్ రౌడీలు లేదా బ్రోకర్స్ పంచుకుంటారు. వారికి ఒక్కొక్క ప్లాట్ కి  3 నుంచి 5 లక్షలు మిగిలేవని తెలుస్తుంది.

అశోకుడు - 60 గజాల్లో షెడ్ వేసి అమ్మించబడును.

ఎవ్వరైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రశ్నిస్తే.. బదిలీలు చేసినవి ఎన్నో.. అశోక్ అనే హెడ్ కానిస్టేబుల్ ఇవ్వన్ని డీల్ చేసే వాడు. అతన్ని ఏ పోలీస్ అధికారి టచ్ చేయలేకపోయారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల లేటర్స్ తో వచ్చిన సీఐ, ఏసీపీలు కూడా భయపడేవారు. బీఆర్ఎస్ నేతలు హెచ్ కానిస్టేబుల్ ని అశోక్ అన్న ఉన్నతాధికారుల ముందే సంబోధించడంతో అశోక్ అన్న అని అధికారులు కూడా పిలిచేవారంటే ఎన్ని వందల కోట్లు ప్రభుత్వ భూమి పై పట్టు సాధించారో ఇట్లే తెలిసి పోతుంది. 

స్టేట్ కార్పోరేషన్ 60 ఎకరాలు కబ్జా. 

సర్వే నెంబర్ 307/A లో 317 ఎకరాల భూమిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ కి కేటాయిస్తుంది. ఇంకా మిగిలి ఉన్న ప్రభుత్వ భూమి 120 ఎకరాలు . ఇందులో 60 ఎకరాలు దశాబ్ది ఉత్సవం అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజునే కబ్జా చేసి వారం రోజుల్లో 60 నుంచి 100 గజాల చొప్పున ప్లాటింగ్ చేసి అమ్మేశారు. పేదలకు ఒక్క గజం భూమికి ఫ్రీగా రాలేదు. ప్రయివేట్ సర్వే నెంబర్ అయినా 326 వేసుకోని ప్లాటింగ్ చేసి 60 ఎకరాల్లో  రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. దీని విలువ 1500 కోట్లు ఉంటుంది.

యాదిరెడ్డి బండలో 50 కోట్లు లేపారు

పేట్ బషీర్ బాగ్ లోని  సర్వే నెంబర్ 25/1 యాదిరెడ్డి బండలో 50 కోట్ల ప్రభుత్వ భూమి లేపేశారు. ప్లాట్స్ చేసి ఓ మహిళ బీఆర్ఎస్ నేత అక్రమంగా సంపాదించారు. పేదల వద్ద నుంచి భారీగా సొమ్ములు వసూలు చేసింది. 

సాయిబాబా నగర్ లో 10 ఎకరాలు. 

గజం 30 వేలు అమ్ముడు పోయే సాయిబాబ నగర్ లో సర్వే నెంబర్ 49 లోని 10 ఎకరాలు కబ్జా చేశారు . ఇది నిజానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిల్ భూమి ( ప్రభుత్వ భూమి వేలం వేసిన భూమి) ఇక్కడ అక్రమంగా నిర్మిస్తే .. అప్పటి ఆర్డీవో మల్లయ్య కూల్చివేశారు. ఆ తర్వా త కాంప్రమైజ్ అయిపోయి.. కబ్జాలకు సహాకరించారు. ఇదే గాజుల రామారంలో సర్వే నెంబర్ 100 లో అత్యంత విలువైన 13 గుంటలు కబ్జా చేశారు. మొదట కూల్చివేస్తారు ఆ తర్వాత చెర మాములే. 

దుండిగల్ మున్సిపాల్టిలో దులుపుకున్నారు..? 

మల్లంపేట్ లోని సర్వే నెంబర్ 170 లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసుకుని విల్లాలు నిర్మించి అమ్మేస్తున్నారు. అప్పటి కమిషనర్ సురేష్ కూల్చివేశారు. ఆ తర్వాత చర్యలు తీసుకున్నారు. కాని ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడే 100 కోట్ల స్కాం విజయ లక్ష్మి అనే బీఆర్ఎస్ మహిళ నేత స్థానిక కౌన్సలర్ అంజనేయులుతో కలిసి మోసం చేసిందని బాధితులు చెప్పుతున్నారు. ఇక నాలుగేళ్ల క్రితం గ్రామ పంచాయితీ లో 2 అంతస్థుల అనుమతి తీసుకుని 5 నుంచి 6 అంస్థులు నిర్మించినవి లెక్కే లేవు. అవ్వన్ని రికార్డుల్లో ఉండవు. పేపర్స్ లో కనిపిస్తాయని అరోపణలు ఉన్నాయి. స్థానిక బీఆర్ఎస్ నేతకు ఒక్కొక్క ప్లోర్ కి లక్ష సమర్పించుకోవాలి. కౌన్సలర్స్ నుంచి ఛైర్మన్ వరకు సంపద 200 కోట్లు దాటిందని స్థానికంగా టాక్.  విజిలెన్స్ దర్యాప్తు చేస్తే ఇట్లే తెలిసిపోతుంది. 

లావాణి పట్టాలో లావిష్ విల్లాలు. 

బౌరంపేట్ లో సర్వే నెంబర్ 166 ప్రభుత్వానికి చెందిన లావాణి పట్టా భూములు ఇందులో వ్యవసాయం చేసుకోవాలి కాని వాణిజ్యం చేయకూడదు. కానీ కలెక్టర్ నుంచి అక్రమంగా ఎన్ వోసీలు తెప్పించి .. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని అరోపణలు ఉన్నాయి. 166 సర్వే నెంబర్ పై విచారణ జరిపితే వందల కోట్ల స్కాంలు భయట పడుతాయి. కీలక నేతల సఫోర్టు ఎంటో తెలుస్తుందని స్థానికులు అరోపిస్తున్నారు. 

నిజాం పేట్ లోనూ నిలువు దోపిడి. 

సర్వే నెంబర్ 346 బీఆర్ఎస్ నేత భర్త 6 ఎకరాలు ప్రభుత్వ భూమిని అమ్మేసుకున్నారు. దీని విలువ 100 కోట్ల పై మాటే. దీంతో పాటు ప్రగతి నగర్ లో ని ప్రభుత్వ భూమి అయిన పార్కులు, ఇతర స్థలాలు అప్పటి కమ్యూనిస్టు సర్పంచ్ దయాకర్ రెడ్డి వందల కోట్ల వ్యాపారం చేసుకున్నారు. ప్రయివేట్ ల్యాండ్స్ లో కాంగ్రెస్ ,బీఆర్ఎస్ తో కలిసి వ్యాపారం చేయడంలో ఇయనకు మించిన వారు లేరని ఆయన గురించి తెలిసిన నేతలు అంటారు . బీఆర్కే కాలేజీ పక్కనే ఉండే భూములు, సతీష్ లే-అవుట్ ప్లాట్స్ లో ఇయన కాంగ్రెస్ నేత భూపతి రెడ్డితో పాటు స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి చేసిన దందా వందల కోట్ల విలువ చేస్తుందని అంటున్నారు. ప్లాట్ ఓనర్స్ బాధలు వింటే వీరి దందా ఎంటో తెలుస్తుంది. ప్రగతి నగర్ లోని సర్వే నెంబర్ 141,142,143 లోని సిలింగ్ ల్యాండ్ ని అక్రమంగా రెగ్యులరైజ్ చేయించుకున్నారు. 10 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమిని కాజేశారు. పార్క్ స్థలాన్ని మింగేశారు. వీటి విలువ 300 కోట్లకు తగ్గదు. 

శంషీగూఢలో చిందులు వేసినా కేటీఆర్.

శంషీ గూఢ లోని సర్వే నెంబర్ 57 లో ఉన్న భూమి చరిత్ర గురించి ఎంత తక్కువ చెప్పితే అంత మంచింది. ఆ భూమి నుంచే ఎంతో మంది నేతలు పుట్టారు. దేశ్ పాండే 100 ఎకరాల భూమిని కేటీఆర్ స్వయంగా వచ్చి.. ప్రభుత్వం భూమిని సుప్రీం కోర్టులో ప్రయివేట్ పరం చేశారని అరోపణ. ఫినిక్స్ సంస్థ భూములను అమ్మేసుకుంది కూడా.. అయితే ఇదే సర్వే నెంబర్ తో కుత్బుల్లాపూర్ లోని ధరణిలోని సర్వే నెంబర్ చూపిస్తూ..  307 పేరుతో 100 చేశారు. కుత్బుల్లాపూర్ లో ధరణి సర్వే నెంబర్స్ కడస్ట్రాల్ మ్యాప్ లు, హెచ్ఎండీఏ, 2డీ భువన్ మ్యాప్ లతో పొల్చితే సరి తూగవు. కాని భూమి ఎక్కడ ఉన్నా.. కబ్జా మాత్రం బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో వందల ఎకరాలు అయింది. కౌలు రైతులను కోట్టేసింది ఫినిక్స్ సంస్థ. ఆ తర్వాత ఎకరాల కొద్ది అమ్మేసుకుంది. వీటి పై బ్యాంకుల్లో లోన్స్ ఉన్నాయి. కోర్టుల్లో కేసులు ఉన్నాయి. వాటిని ఏమి పట్టించుకోకుండా తక్కువ ధరకు వస్తుంది కొనండి అంటూ వంద ఎకరాలను ఇట్లే వ్యాపార వేత్తలకు అమ్మేసింది. ఆ భూమి ఎప్పటికైనా వివాదమే.. అందుకు ఎన్నో వివాదాలు చుట్టిముట్టి ఉన్నాయి. పొజిషన్ ఉన్నామనే ఒకే ఒక్క కారణంతో అమ్మేసుకున్న ఫినిక్స్ చుక్కలు చూడటం కామన్. 

ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ కి ఎంతో కొంత డిటెల్డ్ గా తెలుసు. 

ప్రతి నియోజకవర్గంలో ఎవ్వరెవరు ఏం చేశారో చీఫ్ ఎడిటర్ దేవేందర్ రెడ్డి ( 9848070809) కి అధారాలతో సహా భయటపట్టేందుకు సిద్దంగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ల్యాండ్ స్కాంలు సువివరంగా నిజాయితీగా.. రికార్డుల ప్రకారం తెలియజేస్తుంది. గతంలో ప్రభుత్వ భూమి ఇప్పుడు ఎలా ప్రయివేట్ భూమి అవుతుంది. అందుకు ఎవ్వరెవరికి ఎంత ముట్టిందో. ఎక్కడ ముట్టిందో చెప్పే ధైర్యం ఒక్క ల్యాండ్స్ అండ్ రికార్డ్స్.కామ్ కే ఉంది. కాంగ్రెస్ నేతలైన భూపతి రెడ్డి, హన్మంత్ రెడ్డిలు వారి ప్రయివేట్ లే-అవుట్ భూములను కాపాడుకునేందుకు మాత్రమే పని చేసుకుంటున్నారని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. 


Leave a Comment: