Sahithi Scam- We know who are involved and who got the Money.

SCAMS Real estate fraud and scams

Posted by admin on 2024-01-09 06:52:38 | Last Updated by admin on 2025-07-07 23:51:21

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1187


Sahithi Scam- We know who are involved and who got the Money.

  • సాహితీ కస్టమర్స్ సొమ్ము స్వాహా చేసింది వీళ్లే.
  • ల్యాండ్స్ అడ్వాన్స్ అంటూ 420 కోట్లు మంది వద్దే.
  • డోషన్స్ పేరుతో మూడేళ్ల 20 కోట్లు పంచిపెట్టాడు.
  • హైకోర్టులో మార్కెంటింగ్ ఫర్సన్ పిటిషన్ తో ఈడీ అస్తుల అటాచ్మెంట్
  • 50 లక్షలకు పైగా సొమ్ముతిన్న 88 మందిని సీసీఎస్ పోలీసులు ఎప్పుడు విచారిస్తారో.
  • డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు రెడీ అయినా ల్యాండ్ లార్డ్స్.
  • ఫైనాన్సర్స్ కి వడ్డిల రూపంలో 70 కోట్లు.
  • సంధ్య కన్వెన్షన్ కి 40 కోట్ల లావాదేవీలు,
  • నగదు సర్దినందుకే 15 కోట్ల లాభం.
  • పొరెన్సిక్ అడిట్ చేయించిన సీసీఎస్ పోలీసులు.
  • సొమ్ము రికవరి కాకుండా ఒత్తుళ్లు పెట్టిన గత ప్రభుత్వం.
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్స్.కామ్ వద్ద పూర్తి అధారాలు ఉన్నాయి.
  • బాధితులకు న్యాయం చేస్తారా ?
  • అమీన్ పూర్ అనుమతుల కోసం అప్పటి ముఖ్యమంత్రి బిడ్డకు
  • 20 కోట్లు సమర్పించిన సాహితీ .

 By

Devender Reddy

9848070809.

 మధ్యతరగతి కుటుంబాల ఆశలను పెట్టుబడిగా మలుచుకోని 1500 కోట్లు మింగేసిన సాహితీ గ్రూప్ దొంగలు ఒక్కొక్కరు భయటపడుతున్నారు. ఎదైనా బంగారం దొంగలించి తాకట్టు పెట్టినా, కరిగించినా.. గోల్డ్ స్మిత్ వారిని ఆరెస్ట్ చేసే పోలీసులు. సాహితీ సొమ్మును స్వాహా చేసిన వారిని పట్టించుకోవడం లేదు. నోటీసులు ఇచ్చి విచారించ లేదు. డైరెక్టర్స్, మార్కెటింగ్ టీం వరకే ముక్కు పిండి వదిలేశారు. మరి బాధితులకు న్యాయం జరగాలంటే ఆ సొమ్ము రికవరి కావాలి కదా..? ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు పడుతాయని బాధితుల తరుపున ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ . కామ్ అధారాలు సేకరించింది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన బడాబాబుల వద్ద నుంచి సొత్తు రికవరి చేసి ఇవ్వాల్సిన బాధ్యత సీసీఎస్ పోలీసుల పై ఉంది.

 112 కోట్ల నగదు డిపాజిట్ చేశారు.

మూడేళ్లలో సాహితీ గ్రూప్ వివిధ బ్యాంకుల్లో 112 కోట్లు కస్టమర్స్ వద్ద నుంచి నగదు వసూలు చేసి బ్యాంకుల్లో వేసుకుంది. ఏ ఒక్క శాఖ పట్టించుకోలేదు. 2018-19 ఫైనాన్స్ ఇయర్ లో 41 కోట్లు, 2019-20 లో 26 కోట్లు, 2000-21 లో  17 కోట్లు, 2021-2022 లో 26 కోట్లు, 2022-2023 లో 2 కోట్లు.  డిపాజిట్ చేసినట్లు అధారాలు ఉన్నాయి . వివిధ వ్యక్తులకు మరో 72 కోట్ల 93 లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చేసింది సాహితీ సంస్థ.

 వడ్డీ వ్యాపారులకు భారీగా లబ్దీ చేకూరింది.

ప్రముఖ ఫైనాన్సర్ కేడియా కు 13-06-2020 నుంచి 15-12-2021 మధ్య కాలంలో 135 సార్లు నగదు బదిలీ అయ్యాయి. వీటి విలువ  అక్షరాల 45 కోట్ల,92 లక్షల 97 వేలు. ఇదే కాకుండా కాకతీయ హిల్స్ లోని పనోరమ లో షేరింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేత నేతి విధ్యసాగర్ కి 9కోట్ల 65 లక్షలు తీసుకున్న అప్పు కంటే ఎక్కువగా చేరాయి. మరో ఫైనాన్సర్ సునీల్ హౌజా కి 11 కోట్లు బదీలి చేశారు.

సంధ్య శ్రీధర్ రావుకు 40 కోట్లు.

సాహితీ లెక్కలు ఎటుపోయాయో అని చూస్తే కోట్లాది రూపాయలు బడాబాబులకు చేరాయి. దొరికినంత దొచుకున్నారు మెఖం చాటేశారు. నానక్ రాం గూఢ లో 3 వేల గజాల భూమి అడ్వాన్స్ కోసం 18 కోట్లు ఇచ్చారు. నగదు బదిలీల కోసం అంటూ మరో 22 కోట్లు బదిలీ అయ్యాయి. అగ్రిమెంట్స్ తోనే ఫోర్జరీ చేసి ప్రీ లాంచ్ పేరుతో అమ్ముకున్న తీరును చూసి శ్రీధర్ భయపెట్టించడంతో అడ్వాన్స్ ఇచ్చిన నగదుని వదిలేసుకున్నాడు లక్ష్మి నారాయణ. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే గాంధీ అనుచరుడైన డైరెక్టర్ శ్రీనివాస్ రావు తో పాలు పంచుకున్నారు. ఈ ఒక్క సెటిల్మెంట్స్ లోనే సాహితీ సొమ్ము 15 కోట్లు సంధ్య శ్రీధర్ రావుకు చేరుకోవడంతో పోలీసులు అవాక్ అయ్యారు.

అడ్వాన్స్ తిరిగి ఇచ్చేందుకు రేడీ అయినా ల్యాండ్ లార్డ్స్ 

నానక్ రామ్ గూఢలో ఎకరం 17 గుంటలకు గాను 65 కోట్లు డి. అరవింద్ర కుమార్ వద్ద  ఉన్నాయి. శిల్పా మోహాన్ రెడ్డి కుటుంబం వద్ద 5 కోట్లు, పీసీహెచ్ ఆఫీస్ స్పెస్ కి ఎల్ఎల్ పీ కి 18 కోట్లు బదిలీ అయ్యాయి. అసోసియేట్స్ ప్రాజెక్ట్స్ ఇన్ఫాకి 20 కోట్లు, శ్రీనిధి ఇన్ఫ్రా కి 9 కోట్ల 36 లక్షలు. ఇలా  87 మంది వద్ద 357 కోట్లు ఉన్నాయి. ఇంకా చిన్న చితక అన్ని కలిపితే 420 కోట్లు భయటనే ఉన్నాయి.

డోనేషన్స్ తో కవరింగ్ చేసుకున్నాడు- జూబ్లి హిల్స్ కబ్ల్ కి 5 లక్షలు – టీటీడికి 14 కోట్లు

 స్వామీజీలకు , ట్రస్టులకు డోనేషన్ అంటూ మూడేళ్లలో 20 కోట్లు ఖర్చు పెట్టాడు సాహితీ ఓనర్. శ్రీ రామాంజనేయ సహారబుద్దీ కి  50 లక్షలు, వికాస్ ఎడ్యుకేషన్ సోసైటికి 3.5 లక్షలు. దివ్య సాకేతం కి 17 లక్షలు.  హరే కృష్ణ వారికి 5 లక్షలు, మూవీ అర్టిస్టులకు లక్ష, జూబ్లి క్లబ్ కి 5 లక్షలు, జగద్గురు శంకరా చార్యులకు 62 లక్షలు, శారద పీఠం కి 25 లక్షలు. శ్రీమత్ హరిహరపూరా 10 లక్షలు. గణపతి సచ్చితనంద అవదూతకు 5 లక్షలు, శ్రీమతా హరిహరపురాకు 5 లక్షలు, మరో 15 లక్షలు వివిధ ట్రస్టులకు చేశారు. టీటీడీకి 14 కోట్ల 34 లక్షల 47 వేలు డొనెషన్ చేశాడు.

 మార్కెంటింగ్ టీంని పట్టేసిన ఈడీ.  

 కస్టమర్స్ కి మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసి ఇచ్చినందుకు మార్కెటింగ్ టీం కి గట్టి గుణపాఠమే జరిగింది. అయితే వీరే 100 కోట్లు తినేశారని భూషిగా చూపించి కేసునంత బీఆర్ఎస్ నేతలు తప్పుదారి పట్టించారు. అప్పటి ఎస్ఓటీ చీఫ్ సందీప్ రావు మాధపూర్ పోలీస్ స్టేషన్ లో పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టించి ఓ వ్యక్తి దగ్గర నుంచి సొంత అస్తులు 40 కోట్ల విలువ చేసేవి శ్రీనిధి శ్రీహరికి ఇచ్చేలా చేశారని హైకోర్టులో కేసు ఉంది. ఈ విషయం పై హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈడీకి ఎప్పటి నుంచే ఆస్తుల పై అధారాలు కావాలి. కాని ఎవ్వరు సహాకరించడం లేదు.దీంతో హైకోర్టులోని పిటిషన్ తీసుకోని లావాదేవీలు జరిగిన ఆస్తులను అటాచ్ చేసింది.

 పోలీసుల పెత్తనం అంతా చిన్నపాటి వారి పైనే

ఎక్కడ బీఆర్ఎస్ నేతల పేర్లు భయటపడుతాయోనని పోలీసులు పెత్తనం అంతా మార్కెటింగ్ టీం పైనే పడేవారు. వచ్చిన సొమ్ము ఎంత..? సంస్థకు చేరింది ఎంతో లెక్కలేసుకుంటే సరిపొద్ది.. ఆ మొత్తం అంతా కంపనీకే చేరిందని లెక్కలు ఉన్నా.. తీసుకున్న కమిషన్ కక్కేయాలి అంటూ కేసును సాగదీశారు సీసీఎస్ అధికారి ఉమామహేశ్వర్ రావు. నిజానికి క్రైం అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ రావు అద్వర్యంలోనే అకౌంట్స్ అన్ని ఆడిటింగ్ జరిగాయి. కాని పెద్ద మొత్తంలో లాభపడ్డవారిని , నగదు రూపంలో ఇచ్చిన వారిని ఎప్పుడు విచారించలేదు.

అమీన్ పూర్ అనుమతులకే 20 కోట్లు.

ఎమ్మెల్సీ కవిత తన బినామిగా అంథోని రెడ్డి అనే వ్యక్తిని డైరెక్టర్ గా పెట్టుకున్నారని సాహీతి సంస్థలోని ఉద్యోగులు కోడై కూస్తారు. కవిత అమీన్ పూర్ అనుమతులు కావాలంటే 20 ఇవ్వాలని అనడంతో కస్టమర్స్ సొమ్మును పట్టుకెళ్లి ఇచ్చారని లెక్కలు చూపిస్తున్నాయి. పోలీసులు సరైన పద్దతిలో విచారిస్తే ఎక్కడ , ఎవ్వరికి , ఎలా ఇచ్చారో తెలిపోతుంది.

 బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఉంటుంది.

ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ . కామ్ బాధితుల సొమ్ము చేరంత వరకు అధారాలు సేకరిస్తునే ఉంటుంది. ఆ కంపనీలోని డైరెక్టర్స్ , బడాబాబులు తిన్న సొమ్మును కక్కించేంత వరకు పోరాడుతుంది. 

Sahithi Scam hyderabad | CCS Police Sahithi scam | Sandya Sridhar rao | Financer Kedia, sunil Howza | MLC kavitha sahithi | MLA Gandhi sahithi


Leave a Comment: