IAS Arvind Kumar illegal works

SCAMS Illegal Business

Posted by admin on 2024-01-11 05:27:09 | Last Updated by admin on 2025-07-07 23:12:54

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1105


IAS Arvind Kumar illegal works

  • ఔటర్ రింగ్ అదాయానికి మరోసారి గండికొట్టిన ప్రయత్నంలో అరవింద్ కుమార్.
  • నామినేషన్ పద్దతిలోనే మీడియా రైట్స్ ఇచ్చేసి ఘనుడు. ?
  • కుటుంబ సభ్యులను మీనాబజార్ లో డైరెక్టర్స్ గా చేర్చారంట.
  • శంషాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు
  • లీడ్ స్పెస్, ప్రకాశ్ యాడ్స్, మీనాబజార్ కే వ్రాసి ఇచ్చారు.
  • రాత్రికి రాత్రి 5 మున్సిపాల్టీలకు ప్రత్యేక ఉత్తర్వులు.
  • ప్రొసిడింగ్స్ లేకుండా ఎన్నో దందాలు చేసిన అరవింద్ కుమార్.
  • మోమెలు ఇచ్చుకుంటూ పోతే వారానికి ఒక్కటి ఇవ్వాల్సిందే.  
  • 5 లక్షలు ఇస్తే ఐ అండ్ పీఆర్ లో ఎంపానల్ ఎజెన్సీ కావచ్చు.
  • మూడు శాఖల్లో చేసిన తప్పులు భయటకు వస్తే
  • అరవింద్ కుమార్ కి ఏ శిక్ష వేసినా తక్కువేనట ?
  • హెచ్ఎండీఎ లోకి అమ్రాపాలి వచ్చినా.. ఆయన మనుషులదే పై చేయి.
  • అరవింద్ వింత పొకడల పై సీఎం సిరీయస్.
  • అయ్యా.. ఎస్. అంటూ ఐఎఎస్ అరవింద్ కుమార్ చేసిన
  • విచ్చల విడి తీరు పై ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ స్పెషల్ స్టోరీ.

By

Devender Reddy

9848070809.

     చిన్న ఉద్యోగి తప్పుచేస్తే వెంటనే చర్యలు ఉంటాయి.  కాని కాసుల కోసం  ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారి గడ్డికరిస్తే ఎం చేయాలి. టోల్ టెండర్ లో బంగారు గుడ్లు పెట్టే బాతును ఒకే సారి కోసేసి తిన్నారని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి బాధ్యతయుతమైన అధికారి అరవింద్ కుమార్ పై ఫైర్ అయ్యారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి నోటీసులు, కోర్టు వరకు వెళ్లింది. అయితే నెలకు 62 కోట్లకు అదాయం వచ్చే అదొక్కటే అమ్ముకోలేదు. సరిగ్గా వేలం వేస్తే ఏటా 80 కోట్ల అదాయం వచ్చే డిజిటల్ యాడ్స్ ని అక్రమంగా నామినేషన్ పద్దతిలో అంటగట్టేందుకు అన్ని పూర్తి చేసుకున్నారు. డబ్బులు తీసుకుని నామినేషన్ పద్దతిలోనే మీడియా రైట్స్ అప్పగించారని అరోపణలు గుప్పుమంటున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పై డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్ అన్ని ప్రకాశ్ యాడ్స్ నామినేషన్ పద్దతిలోనే మీడియా రైట్స్ దోచిపెట్టారని అంటున్నారు. మొదటి దశగా కోకాపేట్ వద్ద పనులు చేసుకోండి అంటూ సెలవు ఇచ్చారట. ప్రభుత్వ అదాయానికి గండి కొట్టి శంషాబాద్,  కోకాపేట్, నార్సింగ్, నానక్ రాం గూఢ తెల్లాపూర్ లో లాంటి మేజర్ సర్కిల్స్ వద్ద బ్యూటిఫికేషన్ పేరుతో  మీనా బజారు, లీడ్ స్పెస్ కి గంప గుత్తగా ఇచ్చేశారు. కేవలం ఔటర్ పైనే 120 బోర్డులు పెట్టుకునేలా ప్లాన్ చేసుకున్నారు. 200 బోర్డ్స్ సర్కిల్స్ వద్ద, మెట్రో గ్రోత్ కారిడర్స్ లో 150, కొత్తగా సైకిల్ ట్రాక్ , ఐ లాండ్స్ , టోల్ బూత్ ల వద్ద అర్చిలు, ఎల్ ఈడీలు అన్ని కలిపి ఈ మూడు ఎజెన్సీలకే ఇచ్చేశారు. మళ్లీ మా ప్రభుత్వమే వస్తుందనే ధీమాతో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తుంది. నిత్యం అదాయం వచ్చే బిజినెస్ కావడంతో మీనా బజారు లో తనకు కుతూరుగా చూసుకునే వారిని  డైరెక్టర్ గా చేర్చారని విశ్వసనీయ సమాచారం.

 మున్సిపాల్టీలో హోర్డింగ్స్ తీసివేయాలని అదేశాలు.

 శంషాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు ఓఆర్ఆర్ ఉన్న మున్సిపాల్టీలకు ఓఆర్ఆర్ పై వెళ్లే వాహానాదారులకు కనపడేలా హోర్డింగ్స్ కి అనుమతి ఇచ్చారు. ఒక్కొక్క హోర్డింగ్ 50 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నింటికి మున్సిపాల్టీలు అనుమతులు ఇచ్చాయి. ఔటర్ పై, ఆయా సర్కిల్స్, టోల్ బూత్ ల వద్ద డిజిటల్ , ఎల్ఈడీ యాడ్స్ పెత్తనం చెలాయించాలంటే.. సర్వీస్ రోడ్డులో ఉండే పెద్ద పెద్ద హోర్డింగ్స్ తీసివేయాలని అదేశాలు ఇచ్చారు. ఏడాది గడవక ముందే తీసివేయాలంటే ఎలా అంటూ కోర్టుకు వెళ్లారు  నార్సింగి, మణికొండ,శంషాబాద్, తెల్లాపూర్ మున్సిపాల్టీలకు చెందిన హోర్డర్స్. అంతలోనే ఎన్నికలు రావడం కాంగ్రెస్ గెలవడంతో ఇప్పటికి ఆ దిశగా లాభం చేకూరేలా అరవింద్ కుమార్ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి ఆయన కీలక పదవుల్లోనే ఉండటంతో అనధికార ఒప్పందం ప్రకారం వర్క్ చేసుకోండి అంటూ సెలవిచ్చారని తెలుస్తుంది. భారీగా డబ్బులు చేతులు మారడంతో లీడ్ స్పెస్, ప్రకాశ్ యాడ్స్ , మీనా బజార్ లు తమకు వర్క్ అవుట్ కావడం లేదని డబ్బులు ఇవ్వాల్సిందిగా అరవింద్ కుమార్ పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతా మా వాళ్లే ఉన్నారు పని పూర్తి అవుద్దని ధీమా వ్యక్తం చేస్తున్నారట. దీంతో హైదరాబాద్ మెట్రో గ్రోత్ కారిడర్ ప్రాంతాల్లో కేవలం ప్రకాశ్, లీడ్ స్పెస్, మీనా బజారుకు మాత్రమే అవకాశం ఉండేలా చేశారు.  ఒక్క లీడ్ స్పెస్ కే గత ఏడాది 70 కోట్ల యాడ్స్ ఇచ్చిన ఐ అండ్ పీఆర్ కి 10 కోట్ల విలువ చేసే ప్రచారం కూడా చేయలేదు. అంతా అరవింద మహిమేనట. బ్రాండింగ్ పెట్టుకోని బ్యూటిఫికేషన్ అంటూ నామినేషన్ పద్దతిలో కోట్టేసిన తీరు ఉంది. విషయం భయటకు పొక్కుండా ప్రోసిడింగ్స్ దాచిపెట్టేశారని తెలుస్తుంది. ప్రభుత్వం మారడంతో బీవోటీ పద్దతిలో వెళ్లాలని కొంతమంది సూచిస్తున్నారు.

 ఐ అండ్ పీఆర్ లో ఆయన స్టైల్ ల్లో ఎంపానెల్ ఎజెన్సీ దందా..?

యాడ్ ఇవ్వాలంటే ఎంపానల్ ఎజెన్సీ ద్వారా వెళ్లాల్సిందే. హోర్డింగ్స్ బిజినెస్ లో ఉండే వారు అర్హులుగా ఉంటారు. అయితే ఏడాది క్రితం ఎంపానల్ ఎజెన్సీలకు పిలిచారు. 10 లక్షల రిఫండబుల్ డీడీ తీయాలి. అర్హులైన వారు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి ఎంపానల్ కావాలి. కాని ఎలాంటి డీడీలు తీయకుండానే 5 నుంచి 10 లక్షలు అండ్ పీఆర్ లోని అధికారులు తీసుకొని ఎంపానల్ ఇచ్చేశారు. ఇదంతా కూడా అరవింద్ కుమార్ కనుసన్నల్లోనే జరిగిందని తెలుస్తుంది. 15 ఎజెన్సీలు కొత్త గా చేరాయి. బిజినెస్ తెచ్చుకున్నారు. అంటే ఏ ఒక్క రూల్స్ ని ఫాలో కాకుండా ఎవ్వరైతే డబ్బులు ఇచ్చారో వారికి పనులు చక్కపెట్టారు.

 అరవింద.. గురివిందెంటో తెలాలి.?

ఆయన ఇప్పించిన తప్పుడు నిర్మాణాల అనుమతులు, కేటీఆర్ కి ఆయన శాఖకు ఆదాయ మార్గాలు చూపిస్తూ.. ఆయన సంపాదించుకున్న తీరు పై విచారణ జరగాల్సి ఉంది. ప్రభుత్వ అదాయానికి గండికోట్టిన వ్యవహారాల పై నోటీసులు ఇచ్చి ఎవ్వరు చేయమన్నారో వారి అభిప్రాయం తీసుకోవాల్సి ఉంది. ఒక్క అరవింద్ కుమార్ ఆయన పని చేసిన డిపార్మెంట్లలో జరిగిన అక్రమాల పై కమిటీ వేసి నిగ్గుతెల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.   

IAS Arvind Kumar | lead space | Prakash arts | meena bazar | ORR adds | illegal adds business |   


Leave a Comment: