Posted by admin on 2024-01-16 05:57:53 | Last Updated by admin on 2025-07-07 07:36:27
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 531
తెలంగాణలో ఆంధ్ర అఫీసర్స్ దే పై చేయి.
ఐఎఏస్ కావాలనే కంఫర్డ్స్ ఆశల పై లాబీయింగ్ నీళ్లు.
ఢిల్లీలో సీఎస్ నిర్ణయమే ఫైనల్ అయిందా ?
ఏఐసీసీ కార్యదర్శితో పాటు మరో కీలక నేత ఒత్తిళ్లతో ఆ ఇద్దరు ఎంపిక ?
తనకే రావాలని అనర్హులను సైతం లిస్టులో చేర్చిన అప్పటి ఓఎస్డీ.
కమర్షియల్ టాక్స్ డిపార్మెంట్ నుంచే ఇద్దరికి
స్థానికత ఆంధ్రప్రదేశ్ వారికే అవకాశం.
ఎన్నో ఆశలు పెట్టుకున్న అర్హులకు లాబీయింగ్ లేకపోవడంతో
ఈ సారి కూడా నిరశే మిగిలింది.
గతంలో జరిగిన లాబీయింగ్ లపై
వివరంగా చెప్పిన ల్యాండ్స్ అండ్ రికార్డ్స్.కామ్
by
Devender Reddy
9848070809
ప్రతి గ్రూప్ వన్ అధికారి కల ఐఎఏస్ కావాలనే. అందుకు కంఫర్డ్ ఐఎఏస్ లు రిటైర్డ్ అవుతున్నా కొద్ది సినియార్టీ, 8 ఏండ్లు రూరల్ సర్వీస్ ల ప్రకారం ప్రమోషన్స్ ఉంటుంది. నియమ నిబంధనలతో ఇంటర్వ్యూల కోసం యూపీపీఎస్సీ కి లిస్టు పంపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎవ్వరైతే అయ్యా.. ఎస్ అంటూ పొలిటికల్ పనులు చేసి పెడుతారో.. వారికే ఎక్కువ శాతం ఈ ఇంటర్వ్యూలో పాస్ అవుతారు. రాష్ట్రం నుంచి ముగ్గురు సీనియర్ ఐఎఏస్ లు, యూపిపిఎస్సీ నుంచి 2 ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసే అధికారులు ఏది అనుకుంటే అదే ఫైనల్ అవుతుంది. అందుకు సీఎస్ కీ రోల్ పోషిస్తారు. సహాజంగా సీఎం లేదా కీలక మంత్రులు చెప్పిన వారికే మొగ్గు చూపుతూ నిర్ణయం తీసుకుంటారు. గతంలో హరీష్ రావు పీఎస్ అశోక్ రెడ్డి, కేటీఆర్ అడిషనల్ పీఎస్ కాంతాయినీ ఇలా వారికి అనుకూలమైన 5గురికి ఇచ్చేసుకున్నారు. ఈసారి లిస్టులో తనకే దక్కలని గతంలో అర్హత ఉన్న వారిని కూడా పక్కకు పెట్టి, అప్పటి మంత్రి ఓఎస్డీ లిస్టు ప్రిపేర్ చేసి పంపించారని అర్హులు తీవ్ర అరోపణలు చేశారు. లిస్టు లో అప్పటి ప్రభుత్వం పెద్దలు చెప్పారని జీఏడీ సెక్రెటరీ శేషాద్రి సంతకంతో యూపిపిఎస్సీకి లిస్టు వెళ్లింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి గ్రూప్ వన్ అధికారులు వినతి పత్రం ఇచ్చారు. అయితే అప్పటికే సీఏం వద్ద లిస్టు పంపించిన శేషాద్రి ఫర్సనల్ సెక్రెటరీగా ఉండటంతో తాను పంపించిన లిస్ట్ పై తాను సమర్ధించుకోవడంతో.. ఈ ఇంటర్వ్యూ కొనసాగిందని గ్రూఫ్ వన్ అధికారులు అరోపిస్తున్నారు. అప్పటి యువరాజు అదేశాలతో 3 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారినే పంపించారు. వారికి అవకాశం వస్తే ఊరుకుంటారా..! లాబీయింగ్ తో ఈసారి ప్రమోషన్స్ కొట్టేశారు.
సీఎస్ కి చెప్పింది ఆ సెక్రెటరీయేనా..?
పదవుల కోసం, ప్రమోషన్స్ కోసం ఎలాంటి మోహామాటం లేకుండా లాబీయింగ్ చేసి కీలక పోస్టుల్లో ఉంటారు ఆంధ్రకు చెందిన వారు. అందుకు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడటంతో ఢిల్లీలోని ఆ పార్టీ సెక్రెటరీగా ఉండే ఆంధ్ర నేతతో సీఎస్ కి చెప్పించినట్లు సమాచారం . దీంతో సీఎస్ వారి చెప్పిన వారికే మార్కులు వేపించి పాస్ చేయించారని తెలుస్తుంది. ఇక కర్నూల్ స్థానికత ఉండే ఫణింధ్ర రెడ్డి గత ప్రభుత్వం నుంచే ఐఎఏస్ కల ఖచ్చితంగా కావాల్సిందేనని పట్టుపడ్డారట. దీంతో ఆయన బంధువులు అంతా రాజకీయ, అధికార వర్గంలో బలంగా ఉండటంతో ఆయనకు సీఎస్ మొగ్గు చూపారని అర్హులు అనుమానిస్తున్నారు.
లాబీయింగ్ లేకుంటే లిస్టులో కూడా ఉండరా..?
ఐఎఏస్ కావాలంటే పొలిటికల్ లాబీయింగ్ లేకుండా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ అంటూ ఉద్యమం చేసి, గొంతు చించుకుని పని చేసిన అధికారులను గుర్తించి ఇలాంటి ఐఎఏస్ పోస్టుతో గౌరవించాల్సి ఉంటుంది. రాబోయే కాలంలోనైనా అలా జరుగుతుందని ఆశీద్దాం.