Posted by admin on 2024-01-16 16:25:41 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 836
by
Devender Reddy
9848070809
వెనకబడిన వర్గాల యువత విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ
ప్రభుత్వం 20 లక్షల అర్ధిక సహాయం చేస్తుంది. ఇలా ప్రతి ఏటా 300 మందికి లబ్ది చేకూరేలా
ప్లాన్ చేసుకుంటుంది బీసీ వెల్ఫర్. విదేశీ విద్య నిధికి బడ్జెట్ కేటాయిస్తారు. అదనంగా
రిలీజ్ చేస్తారు. కాని వ్యయం మాత్రం బడ్జెట్ కంటే తక్కువగానే అవుతుంది. లంచాలు ఇచ్చిన
వారికే లబ్ది చేకూరుతుందని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో
భయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు బూర వెంకటేశం సెక్రెటరీగా ఉన్నప్పుడు చాప కింద నీరులా
జరిగే వ్యవహారం ఇప్పుడు బహిరంగంగానే 5 లక్షలు ఇస్తే 20 లక్షలు వస్తాయి అంటూ బీసీ వెల్ఫర్
ఉద్యోగులే విద్యార్ధులకు చెప్పడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్పులు చేసి
పేద, మధ్య తరగతి కుటుంబాలు బేరాసారాలతో డబ్బులు సమర్పించుకుంటున్నారు. కొంత మంది ఎందుకులే
అనుకుని పొలిటికల్ లీడర్స్ వద్దకు ఫైరవీలకు వెళ్లుతున్నారు.
అర్హతలు ఇవే.
35 ఏండ్లు నిండకుండా ఉండాలి. కుటుంబ వార్షికాదాయం 5 లక్షల
లోపు ఉండాలి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, హ్యుమానిటీస్, ప్యూర్
సైన్స్, ఎదైనా మేనేజ్మెంట్ డిగ్రీలో 60 శాతం మార్కులతో పాటు జీఆర్ఈ, జీ మ్యాట్ సాధించాలి.
ఐ 20 ఇన్విటేషన్ ఉండాలి. వీసాలు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికా, కెనడా,
జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, అస్ట్రేలియా, న్యూజిలాంట్
లాంటి దేశాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గతంలో 10 నుంచి 12 లక్షలు ఇచ్చేవారు. బీఆర్ఎస్
సర్కార్ 20 లక్షల ప్రకారం బడ్జెట్ రిలీజ్ చేసేవారు. అభ్యర్ధులు జీఆర్ఈ స్కోర్ తో
20 శాతం వెయిటేజీ ఉంటుంది. టోఫెల్, ఐఈఎల్టీఎస్, పిటీఇలకు కూడా 20 శాతం ఉంటుంది. ఎక్కువ
మంది అప్లయి చేసుకుంటే మెరిట్ స్కోర్ కు ప్రాదన్యత ఇస్తారు. కాని ఇప్పుడు అప్లయి చేసుకున్న
వారిని దశల వారిగా లిస్టు పంపిస్తున్నారు. బడ్జెట్ రిలీజ్ చేయించుకుంటున్నారు.
అవినీతి తిమింగలాలు ఎప్పటి నుంచో పాతుకపోయారు.
బీసీ వెల్ఫర్ లోని కొంత మంది ఉద్యోగులు లంచాలకు మరిగి
విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్త్ తో ఆడుకుంటున్నారు. అన్ని అర్హతలు ఉన్నా.. రిలీజ్ చేసేందుకు
లంచాలు అడుగుతున్నారు. గతంలో ఇలాంటివి ఎన్నో భయటకు వచ్చినా.. ఎదో ఒక్క కొర్రి పెట్టి
మీకు ఇవ్వలేమని చెప్పే వారు. ఎంతో కొంత అప్పగించిన వారికి ఈజీగా వచ్చేవని వినికిడి.
ఇప్పుడు అయితే మొత్తానికే బరితెగించారు. ఈ ఏడాదికి అర్హత ఉన్న విద్యార్ధులకు అల్టిమెట్
చేస్తున్నారు. ప్రభుత్వం మారింది. డబ్బులు ఇవ్వాల్సిందే అంటున్నారంటే ఎంతగా రెచ్చిపోతున్నారో
అర్ధం చేసుకోవచ్చు. డబ్బలు ఇచ్చిన 15 మందితో కూడిన ఫైల్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
వద్దకు చేరవేసేందుకు సిద్దమయ్యారు. ఈ లంచాల వ్యవహారం పై ఎప్పటి నుంచో ల్యాండ్స్ అండ్
రికార్డ్స్ డాట్ కామ్ ఓ కన్నేసి ఉంచింది. కాని అధారాలు దొరకకుండా జాగ్రత్త పడుతుండటంతో
అలస్యం అయింది. ఇప్పుడు ఏకంగా మంత్రి వద్దకే ఫైల్ పెట్టడంతో పేద విద్యార్ధులకు భారీగా
నష్టం వాటిళ్లే అవకాశం ఉంది. డీడీ ఉదయ్ ప్రకాశ్, జూనియర్ అసిస్టెంట్ నికేష్ జైస్వాల్,
సెక్రెటరీ పీఏ వెంకటేశ్ లను విచారిస్తే.. అన్ని విషయాలు భయటపడుతాయని అంటున్నారు బీసీ
విద్యార్దుల సంక్షేమం కోరుకునే ఉద్యోగులు.
బడ్జెట్ లో అదనపు కేటాయింపులు ఉన్నా.. ఖర్చు అదే
బీసీ విదేశీ విద్యా నిధికి బీఆర్ఎస్ సర్కార్ ఎంత ఖర్చు
చేసింది. ఎవ్వరెవ్వరు ఎంత తిన్నారో ల్యాండ్స్ అండ్ రికార్డ్ చీఫ్ ఎడిటర్ దేవేందర్ రెడ్డి ఇన్వేస్టిగేషన్ మొదలు పెట్టారు.
2016 నుంచి ఆరా తీయడం జరిగింది. 2016 లో ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు. 2017-18 కాలంలో
40 కోట్లు కేటాయించి, విడుదల చేశారు. వాటన్నింటిని 370 మంది బీసీ విద్యార్ధులకు 40
కోట్లు ఖర్చు చేశారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 60 కోట్లు బడ్జెట్ పెట్టి, 39 కోట్లు
300 విద్యార్ధులకు ఇచ్చారు. 2019-2020 లో 68 కోట్లు ఖర్చు చేసి 630 విద్యార్ధులకు మేలు
చేశారు. 2020-21 కి మాత్రం బడ్జెట్ లో 33 కోట్లు రిలీజ్ చేసినా 190 మందికి 19 కోట్లు చేశారు. 2021-2022 కి 320 మందికి 33 కోట్లు
చెల్లించారు. మరో 28 కోట్లు పెండింగ్ లో బిల్స్ ఉన్నాయి. 2022-2023 కి 60 కోట్లు
300 మంది విదేశి విద్యకు పంపివాలని కేటాయించారు. కాని అవి ఎప్పుడు ఎలా రిలీజ్ అవుతాయో
వేచి చూడాలి. ఈలోపే .. ఉద్యోగులు గతంలో లంచాలు తిన్నట్లు ఇప్పుడు బహిరంగానే చెప్పుకోని
ఫైల్స్ పెట్టడంతో ఈ వ్యవాహారాన్ని తెల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.