Posted by admin on 2024-01-22 13:30:51 | Last Updated by admin on 2025-07-07 19:03:42
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 541
Devender Reddy
9848070809.
గుర్రాన్ని కొద్ది రోజులు ఒకే చోట కట్టెసీ గడ్డి వేస్తే.. ఆ తర్వాత
కట్టెయ్యకుండానే కట్టుబానిసలా అలాగే అక్కడే ఉండిపోతుంది. ఇప్పుడు తెలంగాణ తీరు కూడా ఇలానే ఉంది. రిటైర్డ్ అయిన 1049 మందిని తీసుకోచ్చి, 5 ఏండ్లలో అక్షరాల 1000 కోట్ల జీతాలు ఇచ్చింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వంలోని పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ కార్యకర్తలకు ఏం కావాలో
అది జబర్దాస్త్ గా రూల్స్ , చట్టాలు ఫాలో కాకుండా చేయించుకున్నారు. సిస్టమ్ ఫాలో కాకపోతే ఇబ్బందులు ఉంటాయనే జాసే లేదు. డబ్బులు వస్తున్నాయా.. తల కొంత పంచుకుంటున్నామా అనే ద్యాసలో ఉన్నారు. అందుకు 1049 మందిలో రీ- రీక్యూట్మెంట్ ఉద్యోగుల్లో 200 మంది అవినీతికి పాల్పడినట్లు లెక్కలు వేస్తున్నారు. వారి వారి శాఖల్లో వారి
పనితీరు ఎలా ఉండేదో చర్చించుకుంటున్నారు. తమ పని లీగల్ గా చేస్తారని
అనుభవం వారని తెచ్చి పెట్టుకుంటే.. అవినీతికి పాల్పడటమే కాకుండా పనులు
చట్టపరంగా చేయలేదు. అక్రమంగా సంపాదిస్తే అడిగే వారెవ్వరు. అంటూ
అందినా కాడికి ఉన్న సమయంలోనే దోచుకోవాలని దొపిడి ముఠాలా తయారు అయ్యారని
అరోపణలు వస్తున్నాయి. రిటైర్డ్ అయినాం మా పై ఎందుకు చర్యలు ఉంటాయి అనుకుంటూ వివిధ శాఖల్లో పనిచేసిన వారి తీరు ఉందని చెప్పుతున్నారు. ఉద్యోగం చేసినన్ని రోజులు సంపాదించలేని
ఆస్తులు ఈ 5 సంవత్సరాల్లో సంపాదించారని అనుకుంటున్నారు
ఉద్యోగులు. నీటిపారుదల ఈఎన్సీలు, హెచ్ఎండీఏ, మున్సిపాల్టీలో ఉన్న అధికారులు తరాతరాలకు తరగని
ఆస్తులను సంపాదించారట. అందుకు ఎన్నో ఊదరహారణలు ఉన్నాయని చెప్పుతున్నారు. తమ వారికే
కాంట్రక్టులు ఇచ్చి , కాంట్రక్ట్ బేసిక్ లో ఉద్యోగాలు ఇప్పించి పెద్ద
ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఒక్కరిని చూసి మరొక్కరు అక్రమంగా ఎన్ని ఫైల్స్
క్లియర్ చేశారో అని చెప్పుకుంటున్నారు.
మున్సిపాల్టీలో చెత్త ఎత్తని దాక వచ్చింది.
హైదరాబాద్ లోని కేటీఆర్ చేసిన శాఖలో అధికారులు
పనులు చేయడం లేదు. అభివృద్ది ఊసే లేకుండా వారికి నచ్చిన సమయానికి వస్తూ ,వెళ్లుతూ ఉన్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, జలమండలి లో ఈ వ్యవహారం కనిపిస్తుంది. ఫీల్డ్
లోకి వెళ్లి పనులు ఎలా జరిగాయో చూడాల్సిన డిప్యూటి కమీషనర్స్ వెళ్లడం లేదు. దీంతో
చెత్త ఎత్తే వారు 3 వేల మంది విధులకు రావడం లేదని సమాచారం. రోడ్ల పై
మురుగు పారుతున్న పట్టించుకోవడం లేదు. రోజురోజుకు పిర్యాదులు పెరుగుతున్న వాటి పై
దృష్టి పెట్టడం లేదు. ఉచిత వాటర్ కలెక్షన్స్ బిజినెస్ బిల్డింగ్ లోకి
వెళ్లుతున్నాయి. వందలాది అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. నెలన్నరగా ఎక్కడెసిన
పాలన అక్కడే ఉన్నట్లు ఉందని విమర్శలు వస్తున్నాయి. పన్నులు వసూలు చేయాల్సిన
అధికారులు చేయడం లేదు. ఈ ఆర్ధిక సంవత్సరానికి ఇంకా రెండు నెలలే సమయం ఉంది. 2100 కోట్లకు గాను 1300 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. బడాబాబులు, రాజకీయ నాయకులే ఇంకా చెల్లించలేదు. వారికి నోటీసులు ఇచ్చేందుకు కూడా సిబ్బంది
వెనకడుగు వేస్తున్నారు. చెల్లించని వారి లిస్టు చూస్తే చాల మంది పేరోందిన ప్రముఖులే ఉన్నారు. ఇలా అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇంకా కేటీఆర్
టీం మేము అనుకుంటూ.. పని చేయడం ఇష్టం లేకపోవడంతో ప్రతి చోట నిర్లక్ష్యం
వెంటాడుతుంది.
రిటైర్డ్ ఈఎన్సీల నుంచి ఔట్ సోర్సింగ్ దాక అక్రమాలే.
చీఫ్ ఇంజనీర్స్ , ఐఎఏస్ లాంటి ఫోస్టుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థానంలో రిటైర్డ్, రీ-రిక్యూట్మెంట్ వారు తీసుకోవడంతోనే అధిక తప్పులు జరిగాయి. అక్రమార్కులు రాజ్యమేలారు. నీటిపారుదల శాఖలో మురళీధర్ రావు తన కుమారుడైన అభిషేక్ కి కాంట్రాక్టులు ఇప్పించుకున్నారు. వెంకటేశ్వర్లు, హారిరాం సిద్దిపేట జిల్లాలో భూములు కొనుగోలు చేశారు. టీఎస్పీసీలో జనార్ధన్ రెడ్డి, స్త్రీ నిధి ఎండీ గా విద్యసాగర్ రెడ్డి, ఆర్టీకల్చర్ డైరెక్టర్ గా వెంకట్రామిరెడ్డి, పశువుసంవర్ధక శాఖలో వంగాల లక్ష్మారెడ్డి, ఎండీసీలో ఆర్. కృష్ణమూర్తి, చివరికి మర్రి చెన్నారెడ్డి ఇన్సిస్టిట్ లో ప్రకాశ్ రావు అనే 72 ఏండ్ల అధికారి నెలకు 2 లక్షలు అక్రమంగా సంపాదించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఔట్ సోర్సింగ్ లో ఉన్న సిటీ ప్లానర్స్ కూడా భారీగా సంపాదించారు. అత్యంత కాస్ట్లీ ఏరియా అయిన శేరిలింగంపల్లిలో ముగ్గురు సిటీ ప్లానర్స్ కాంట్రక్ట్ బేసిక్ లోనే పని చేస్తున్నారు.
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ చిట్ట ఇవ్వనుంది.
బాధ్యత లేకుండా అక్రమాలకు పాల్పడ్డ అధికారుల పై వరస కథనాలు ఇవ్వనుంది ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ .కామ్ , హెచ్ఎండీఏలో, జీహెచ్ఎంసీలో, మైనింగ్ లో, నీటీపారుదల, సివిల్ సప్లైలో రీ-రిక్యూమ్మెంట్ అధికారులు ఎలాంటి స్కాంలు చేశారో రాబోయే కాలంలో అధారాలతో సహా భయటపెట్టనుంది.