Posted by admin on 2024-01-28 05:22:07 | Last Updated by admin on 2025-07-07 18:18:03
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1067
By
Devender Reddy. Chinthakuntla
9848070809.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పాపల్లో ప్రధాన ప్రాత్ర ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావుదే. తొమ్మిదేళ్లుగా పెద్దన్న పాత్ర పోషిస్తూ, ప్రతి బిల్లు రిలీజ్ కి ఇయనదే సంతకం కావడంతో పాటు పరిశీలించాల్సింది ఇయనే. తప్పులు జరిగితే హెచ్చరించి బిల్లులు ఆపివేసే అధికారం ఉంది. కాని అలా ఎప్పుడు చేయలేదు. క్వాలిటీ పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎం లా వాడుకుంది ఈయన ఇతని కొడుకు సాయి అభిషేక్ రావు. పాత కంపనీలో కొత్తగా హర్షవర్ధన్ రెడ్డిని బినామిగా చేర్పించి కొడుకుకి పాత్ర కల్పించారు. పాలమూరుతో పాటు , కాళేశ్వరంలో భారీగా సబ్ కాంట్రాక్టులు ఇప్పించాడు. అనుభవం లేకుండానే అంతా ఆ హర్ష కన్సస్ట్రక్షన్ కి దొచిపెట్టాడు. ఈ ఈఎన్సీ ఇంట్లోకి ఇరిగేషన్ డబ్బుల పై ఇన్క్వెయిర్ స్టార్ట్ చేస్తే ఈ చీటి మురళీధర్ రావు భాగోతం భయటపడుతుంది.
ఆయన పైనే విచారణ జరగాలి. కాని అయనే దర్యాప్తు చేస్తాడట.
కాళేశ్వరం పై ఈనెల 24న అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందులో కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్యా తో కూడిన 8 మంది కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ అభ్యయన కమిటి ఇచ్చిన నిర్ణయం మేరేకే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మురళీధర్ రావు అందులో సమాచారం దాచిపెడుతుండగా అయన చేసిన పనులను అయన వెనుకేసుకోని రాలేరని గ్యారెంటీ ఎంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నమ్మిస్తూ, సమాచారం దాచడంలో దిట్ట.
గడిచిన తొమ్మిదేళ్లలో తాను చేసినంత ఎవ్వరు చేయలేదని వీర్రవీగిన మురళీధర్ రావుకి ఇప్పుడు ఉచ్చు బిగుసుకునే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో 10 ఏండ్లుగా 2 లక్షల కోట్లు సాగునీరు ప్రాజెక్ట్స్ నిర్మించారు. 50 వేల కోట్ల తాగునీరు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటన్నింటకి ఈయనే కీలక సూత్రధారి. రిటైర్డ్ అయినా ఎక్స్టెన్షన్ పేరుతూ 9 ఏండ్లు చేశారు. ఇప్పుడు ఇంకా కొనసాగించడం కాంగ్రెస్ సర్కార్ కే చెల్లింది. విచారణ జరుగుతున్నప్పుడు విధులకు పక్కన పెట్టి విచారణ చేస్తే ఎన్నో విషయాలు భయటకు వస్తాయి. గుండెకాయలాంటి పోస్టులో ఉండి, నాణ్యత మరిచిపోవడం ఇయనకే చెల్లింది.
దర్యాప్తు చేయాల్సిందే.
– 200 రివైజ్ ఎస్టిమేషన్ బట్టభయలు కావాల్సిందే.
ఏటీఎంలా వాడుకున్న
డబ్బులు ఎటు వెళ్లాయో ఆరా తీయడం మొదలు పెట్టాలి. ఎవరెవరికి ఎలా కేటాయింపులు చేశారు.
వర్క ఆర్డర్స్ ఎలా వచ్చాయి. పాత్రదారులు , సూత్రదారులు ఎవరు. అంచనాలు ఎంత..?
ఖర్చు పెట్టింది ఎంత..? అధికారులు చేసిన సహాయానికి బాక్ డోర్ ఎలా వెళ్లింది. వీరందరూ
కలిసి ఎన్ని వందల కోట్లు దాచుకున్నారో గుట్టు రట్టు కావాల్సిందే. రివైజ్ ఎస్టిమేషన్
పేరుతో ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు అవినీతి భాగోతం పై గురి పెట్టాల్సి ఉంది.
కుమారుడు అభిషేక్ ద్వారా కంపనీలను ఎవరెవరికి
ప్లొటింగ్ చేశారని ఆధారాలతో సహా ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ దేవేందర్ రెడ్డి
వివరాలు రాబట్టుతున్నారు. కేంధ్ర రాష్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వబోతుంది. బినామిలు ఎవరెవరో
తెల్చి కాళేశ్వరం డబ్బులు కక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మురళీధర్ రావు కాళేశ్వరం మూటలు ఇలా మొదలయ్యాయా..?
మెఘా తో సబ్ కాంట్రక్ట్ డీల్స్ భయటకు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి.. బీఆర్ఎస్ తీర్దం తీసుకున్న ఉపేందర్ రెడ్డికి ఆయన అల్లుడికి చేసిన సేవలకు గాను. వరంగల్ జిల్లాలోని బిల్లా హార్షవర్దన్ రెడ్డి కి ఈఎన్సీ ఇప్పించిన కాంట్రక్ట్ లు చాలానే ఉన్నాయి..? తన కుమారుడైన సాయి అభిషేక్ రావు కి సంబందాలు జూబ్లిహిల్స్ లోని కార్యాలయాల్లో ఎవరెవరికి కాంట్రక్టులు ఉన్నాయో తెలిసిపోయింది. హర్ష కన్సస్ట్రక్షన్ తో పాటు మరో కంపనీకి మేలు చేసినందుకు లబ్దిగా లబ్ది పొందినట్లు సమాచారం. మరో రెండు ఫర్మ్స్ తో ఇంటర్నల్ డీల్ ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసిన భూములను విత్తనం కంపనీలకు అప్పగించింది కూడా ఈ ముఠా పనేనని తెలుస్తుంది. మురళీధర్ రావుని తప్పించి విచారణ చేపడితే గాని నిజానిజాలు ఎంటో భయటపడే అవకాశాలు లేవు.
ENC Muralidhar Rao | Kaleshwaram projects corruptions | KCR - ENC Cheeti Muralidhar rao scam | ENC Genaral Muralidar Rao | Telangana projects scam |