Posted by admin on 2024-02-14 13:07:10 | Last Updated by admin on 2025-07-07 19:18:35
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 583
By
Devender Reddy. Chinthakuntla
9848070809
కృష్ణా జలాల పంపణీ ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టిస్తుంటే.. ఏపీ నుంచి హైదరాబాద్ కి అక్రమ ఇసుక తరలింపు హాట్ టాఫిక్ గా మారింది. లారీ ఇసుక టన్ను ఇసుక 2500 కు పైగా ధర పలుకుతుండటంతో మాఫియా బరితెగించింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో లారీలను క్యూ కట్టించి ఏపీ నుంచి ట్రాన్స్ ఫోర్టు చేసుకుంటున్నారు. 13 అర్థరాత్రి భద్రాచలంలో 16 లారీలను పట్టుకున్నారు. టీఎస్ఎండీసీ అధికారులు వెంటనే అధికారులకు సమాచారం చేరవేశారు. స్థానిక పోలీసులు ఎంతకీ రాకపోవడంతో కలెక్టర్ కి పిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ రంగ ప్రవేశం చేసి ఇసుకాసురులను ఆటకట్టించాడు. అయితే అప్పటికే ఆ ఇసుక మాఫియా బెదిరింపులకు దిగింది. లారీలను విడిచిపెట్టాలంటూ వరంగల్ జిల్లాకు, ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల నుంచి ఫోన్స్ చేపించారు. దీంతో ఈ ఇసుకాసురుల దందాకు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతల హాస్తం ఉందని తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ లో ఇసుక రవాణ చేసిన వారే ఇప్పుడు కూడా అదే వాహానాలు తిప్పుతున్నారని కీలక సమాచారాన్ని రాబట్టారు. ఒక్క బిల్లుతో నాలుగు లారీలు ఇసుక రవాణ చేసేవి. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుని మొదట లారీ రంగప్రవేశం చేయడం అందరిని అశ్యర్యానికి గురి చేస్తుంది. మాఫియా ఎంతకైనా తెగిస్తుందని అధికారులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.
అల్లూరి గుండాల ఇసుక ర్యాంపులు- భద్రాచలంలో డంపులు. ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా గుండాల వద్ద ఇసుక ర్యాంపు లు భారీగా ఉన్నాయి. భద్రాచలానికి కూత వేటు దూరంలో నే డంపులు ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్ కి తరలింపు ఈజీ అనుకున్నా ఇసుకాసురులు ఎన్ని అడ్డకులు వచ్చినా.. వారు అనుకున్న పని చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్నారని గత వారమే సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. మైనింగ్ అధికారులతో సమీక్ష జరిపి కొత్త పాలసీ తీసుకరావాలని అదేశాలు జారీ చేశారు. అయితే ఏకంగా ముఖ్యమంత్రి ఫోటో తోనే ఇసుక లారీ ఉండటంతో ఆ బరి తెగింపును కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపేందుకు సిద్దమయింది. వారి వెనక ఎవ్వరు ఉన్నా కఠినంగా శిక్షించాలని అదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తెలంగాణలో ఏపీ ఇసుకను అమ్మడానికి నిషేధం ఉండటంతో టీఎస్ఎండీసీ వే బిల్లులు ఇవ్వడం లేదని ఓ అధికారి తెలిపారు.అందుకే ఏకంగా ముఖ్యమంత్రి ఫోటోను అద్దంకి అతికించి వాడుకుంటున్నారని విచారణలో తెలినట్లు సమాచారం.
Illegal Sand Mafia | Ponguleti Srinivas Reddy | TGMDC | Telangana CM Revanth Photo For sand lorry | sand transport illegal |