Gachibowli illegal Food Courts Order by HC

SCAMS Real estate fraud and scams

Posted by admin on 2024-03-11 05:21:10 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 281


Gachibowli illegal Food Courts Order by HC

  • గచ్చిబౌలిలో గ `లీజ్` ఫుడ్ దందా.
  • కూల్చివేసిన హోటల్ లో రోడ్లు కబ్జా చేసి మళ్లీ నిర్మాణం.
  • హైకోర్టు అదేశాలు ఉన్నా పట్టించుకోని పురపాలక అధికారులు.
  • అక్రమ నిర్మాణాలే అదర్శంగా UNOS పుడ్ మార్కెట్ - హైకోర్టు.
  • ఛీటింగ్ చీధర్ రావు నిర్వహాకంతో ఇబ్బందుల్లో ఆఫీసర్స్.
  • నయింతో అంటకాగిన పోలీస్ ఆఫీసర్ ఆస్తులు ఈ ఛీటర్ వద్దే. ?
  • ఇన్నాళ్లు బీఆర్ఎస్, బీజేపీ నేతలతో చెట్టాపట్టాల్,
  • తాజాగా కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలకు గాలం.
  • జాగ్రత్త లేకపోతే జర్నలిస్ట్ సాంబ లాగానే బాధితుల జాబితాలో చేరడం ఖాయం.  
  • చీటర్స్ పట్ల అప్రమత్తం లేకుంటే అంతే సంగతులంటూ
  • కాంగ్రెస్ నేతలకు హెచ్చరిస్తున్న హైకమాండ్.

మహానగరంలో మాయగాళ్లు అనేకం. ఒక్కొక్కడు ఒక్కొ రకంగా ఉంటాడు. మోసాలే పెట్టుబడిగా చేసుకోని కేవలం 10 ఏండ్లలో 20 వేల కోట్ల ఆస్తులు ( భూములు) సంపాదించాడంటే  ఈజీ మనీ ఎలా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. అమాయకంగా టార్గెట్ చేసి తడిగుడ్డతో మెడ కోయడం అంటే ఎలా ఉంటుందో చీటర్ ఛీదర్ రావు బాధితులకే తెలుసు, ఇటీవల ఓ ఛానల్ లీజ్ తీసుకోని 6 నెలల్లో 5 బ్యాచ్ ల సీఈవో, ఎడిటర్స్ ని మార్చాడంతో  జర్నలిస్టులకు ఈ చీటర్ ఛీదర్ రావు వ్యవహారం  తెలిసిపోయింది. సొంత పనులకే మీడియాను వాడటానిక మాత్రమే పనిచేయించుకోవడంతో విలేఖర్లు విసిగిపోతున్నారు. నెల జీతం కోసం పని చేయాలి కాబట్టి చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. నిలకడ లేని మాటలు, అబద్దాలతో ఆరితెలినా బిజినెస్ మెన్ గచ్చిబౌలిలో రోడ్లను కబ్జా చేసి ఫుడ్ మార్కెట్ ఏర్పాటు చేసిన వ్యవహారం హైకోర్టుకు చేరింది. కూల్చివేతలు చేయాలని స్పీకింగ్ ఆర్డర్స్ ని అమలు చేయాలని అదేశాలు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం. W.P. No. 5424 Of 2024 పిటిషన్ పై ఎఫ్రిల్ 1 వరకు చర్యలు తీసుకోని నివేదిక అదజేయాలని జీహెచ్ఎంసీకి సూచించింది హైదరాబాద్ హైకోర్టు.

 గజం 3 లక్షలు ఉండే ఏరియాలో కబ్జా భాగోతం ?

 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సాక్షిగా  FCI లే అవుట్స్ ప్లాట్స్ కబ్జాకు గురవుతున్నాయి. చిన్న లిటిగేషన్ ని ఆసరగా చేసుకోని ఇప్పటికే 75 ప్లాట్స్ ని 10 వేల నుంచి 40 వేల వరకు కొనుగోలు చేస్తున్నాడు. రోడ్లు, పార్క్ లు కొట్టేశాడు. ఈ కబ్జాల పై పోలీస్ స్టేషన్ లో పిర్యాదులు అందాయి.  అప్పట్లో ఈ ఛీదర్ రావే ఓ ఫుడ్ కోర్టుకు లీజ్ కి ఇచ్చాడు. ఆ తర్వాత కోర్టులో కేసు వేయంచి ఆర్డర్స్ తీసుకోచ్చాడు. కూల్చివేతల పై రాద్దంతం జరిగింది. అప్పట్లో  బీఆర్ఎస్ ఎంపీ  రంజిత్ రెడ్డిని కాకా పట్టించి సీపీ రవీంద్రతో అంతా క్లీన్ చేపించాడు. దీంతో పాటు కుమారుల హోటల్ దందాలో దిగాలను ముచ్చట పడుతున్నట్లు అందరికి చెప్పి.. మళ్లీ హోటల్ నిర్మాణం అదే ప్లేస్ లో కట్టించాడు. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 2 వేల గజాల రోడ్లను కబ్జా చేసి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే లీజుకు ఇచ్చిన ప్లాట్స్ ని పోజిషన్ తీసుకోని దందాకు తెరలేపాడు. ప్రభుత్వం మారడంతో.. ఇప్పుడు మాజీ ఎంపీ కొండ విశ్వవేశ్వర్ రెడ్డికి తానేంతో మంచోడిని అంటూ 6 నెలలుగా మసిపూసి మారేడు కాయ చేస్తున్నాడట. కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలకు ఆయన ఉండే  నందగిరి హిల్స్ ఇంటిని చూపించి, ఆస్తుల వ్రాసి ఇస్తాను నాకేందుకు ఇంతా అంటూ పూటకో అబద్దం ఆడుతూ.. కొత్త ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర అని చెప్పుకుంటూ.. దగ్గర అయ్యేందుకు సూపర్ ప్లాన్స్ రేడీ చేసుకుంటున్నాడు. అయితే ఆయన వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి కి మొదటి నుంచి తెలియడంతో ఆ పప్పులు ఉడకవని తెలుస్తుంది.

 ఏ పార్టీ ఉంటే ఆ జర్నలిస్టులను పట్టేస్తాడు.

 క్రైంతో పాటు, పొలిటికల్ గా ఏ జర్నలిస్టులకు పలుకుబడి, పరుపతి ఉంటుందో వారిని పసిగట్టి ఇంటిక పిలుపించుకుంటాడు. ఇంత ఆస్తి పరుడు మనతో ఇంత టైం ఇచ్చాడే అని ఉబ్బితబ్బిపోయి ఉన్న పరిచయాలను అంతా సమర్పించుకుంటారు జర్నలిస్టులు అందులో మొదటి బాధితుడు ఓ ఛానల్ ప్రముఖ జర్నలిస్టు సాంబ అనే చెప్పాలి. అలానే టీవీ9 మాజీ, కొత్త వారిని వాడుకున్నాడు. క్యాచ్ తో కొట్టి కథనాలు వ్రాయించే వాడని అరోపణలు ఉన్నాయి. జర్నలిస్టులు చాల మంది బిజినెస్ లో ఇన్వాల్ కాకపోవడంతో బతికిపోయారు. భూములు వ్రాసిస్తామని చెప్పిన నమ్మలేదు.

 ఓ పోలీస్ ఆఫీసర్ కి బినామిగా చీధర్ రావు అట.

 ఎస్.ఐ. నుంచి ఎస్పీ దాక ఎదిగిన సూపర్ ప్రమోషన్ కొట్టిన నయిం బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ కి ఇయనకు ఫెవికల్ బందం. ఏ ఇబ్బందులు వచ్చినా ఆయనే సెటిల్ చేస్తాడు. చాల మంది జర్నలిస్టులను ఈ ఆఫీసరే పరిచయం చేయించాడు. అయితే అక్రమ ఆస్తులు కూడా ఇయన వద్దే ఉన్నాయని తెలుస్తుంది. లీగల్ గా కేసులు పెట్టించడంలో ఈయన పాత్రే ఎక్కువ ఆట. అసలే ఛీటర్ ఆ పైగా ఇలాంటి ఆఫీసర్ తగలడంతో పదేళ్లలో 20 వేల కోట్లు సంపాదించాడని తెలుస్తుంది. సాహితీ సొమ్ము ఇక్కడే మిగిలింది. ఫినిక్స్ తో ఫిక్స్ చేసుకోవాలని చూసాడు.  ఎవ్వరు మొదట పరిచయం అయినా వారికి తీయటి మాటలు చెప్పి, నమ్మేవిధంగా అబద్దాలు అతికినట్లు ఊటకాయించి, తేనే పూసిన కత్తితో ఇట్టే మెడలను కోసిపడేసే చీధర్ రావుకి ఇంకా ఎంత మంది బలి అవుతారోనని అందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హై కమాండ్ హెచ్చరిస్తుంది. 

 కోర్టు ఆర్డర్స్ అమలు అవుతాయా..?

చేసిన పాపాలు ఊరికే పోవని అంటుంటారు. కుట్రలతో కూల్చివేసిన 2 కోట్ల షెడ్స్ ని అదే ప్లేస్ లో గత ప్రభుత్వ అధికారంతో ఇట్లే నిర్మించిన ఛీటర్ ఛీదర్ రావు కి హైకోర్టు చురకలు అంటించింది. జీహెచ్ఎంసీ ఇచ్చిన అదేశాలను అమలు చేసి మరో మూడు వారాల్లో తెలపాలని అదేశించింది. మళ్లీ ఛానల్ పేరుతోనో, లేక గత ప్రభుత్వాల ఒత్తిడి ఇంకా ఉందనో ఆగిపోతారా.. లేక కూల్చివేస్తారా.. అనేది ఇప్పుడు గచ్చిబౌలిలో హాట్ టాపిక్ గా మారిపోయింది. 

Leave a Comment: