Posted by admin on 2024-03-15 10:28:08 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 894
లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కు రంగం సిద్దం.
కేసీఆర్ కూతురు ఇంట్లో సెంట్రల్ ఏజెన్సీల దర్యాప్తు.
ఇంట్లోనే ఉన్న కవిత, అమె భర్త అనిల్.
మొదట ఈడీ అధికారులను లోనికి రానివ్వకుండా అడ్డుకున్న అడ్వకేట్స్.
కేసీఆర్ తో హుటాహుటీనా హరీష్ రావు బేటీ.
సోదాల వెనక అనేక రాజకీయ కారణాలు.
ఇప్పటికే అప్రూవలర్స్ గా మారిన అనుచరులు.
విచారణకు హజరు కాకుండా కోర్టు గడపలు తొక్కిన కవిత.
సిబిఐ చార్జీషీట్ లో నిందుతురాలిగా చేర్చిన తర్వాత మొదటి సారి రైడ్స్.
కేజ్రీవాల్ ని ప్రశ్నించాలంటే కవిత అరెస్ట్ మస్ట్ అంటున్న ఈడీ అధికారులు.
పంజాబ్ ఎన్నికలకు 100 కోట్లు చేరవేసినట్లు లీకులు ఇచ్చిన సుకేష్ చంద్రశేఖర్.
మోడీ పర్యాటన రోజే కవిత అరెస్ట్ ఉంటుందని ఊహాగానాలు.
అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులు , పార్లమెంట్ కి చేయోద్దని రాష్ట్ర కేడర్ వినతి.
దీంతో ఒకేసారి మొదలైన అలజడి.
By
Devender Reddy
9848070809
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లెక్కలు తెల్చేందుకు ఈడీ ఫైల్ రెడీ చేసుకుంది.. సీబీఐ చార్జీషీట్లలో చేరిన తర్వాత ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలకు 10 మంది అధికారులు రావడం కలవరం మొదలయింది. విచారణకు సహాకరించకుంటే అరెస్ట్ చేసేందుకు సిద్దమయినట్లు సమాచారం. సిబిఐ చార్జీషీట్లలో నిందుతురాలిగా లేనప్పుడు మూడు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. ఒక్కొక్క నిందుతుడు అప్రూవర్ గా మారుతుండటంతో సిబిఐ కి ఢిల్లీ సీఎం క్రేజీవాల్, ఎమ్మెల్సీ కవిత మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేరారు. విచారణకు రాకుండా ఎదో కారణలు చెప్పడంతో నేరుగా రంగంలోకి దిగింది ఈడీ. అమె భర్త అనిల్ కుమార్ ఆస్తుల పై ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఈ సమయంలో కేసీఆర్ తో హరీష్ రావు బేటీ కావడంతో మ్యాటర్ సిరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అరెస్ట్ చేస్తే ఎలా ముందుకు వెళ్లాలో సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. హుటాహుటిన భేటీలు నిర్వహించాలని అలోచిస్తున్నారు. కవిత ఇంటి ముందు భారీగా పోలీసులు మోహారించారు. అనుచరులు పార్టీ అభిమానులు ఎవ్వరు వచ్చినా లోనికి అనుమతించకపోవడంతో ఇంట్లో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు.