Exclusive Story on Corrupted ACP Uma Maheshwar Rao

SCAMS Real estate fraud and scams

Posted by admin on 2024-05-21 06:14:24 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1415


Exclusive Story on Corrupted ACP Uma Maheshwar Rao

పోలీస్ శాఖకే మచ్చతెచ్చే కేటుగాడి పై ఏసీబీ రైడ్స్.

అదాయానికి మించిన ఆస్తుల కేసులో 10 చోట్ల సోదాలు.

ఉన్నతాధికారుల ముందు నీతుమంతుడిలా పాఠాలు.

డబ్బుల కోసం ఏ పనైనా చేయడం ఈ ఉమామహేశ్వర్ కి వెన్నతో విద్య.

వేల కోట్ల స్కాంలను ఇట్లే నీరుగార్చేసిన ఘనుడు.

ఇరువైపుల డబ్బులు తీసుకుని దందాలు నడిపిన రౌడీపోలీస్.

1000 కోట్ల ఎఫ్ఎంసీజీ ఫార్మా స్కాంలో 5 కోట్ల ముడుపులు ?

సాహితీస్కాంలో లక్ష్మినారాయణ వద్ద మరో 5 కోట్లు పిండేశాడు.

ఇబ్రహీంపట్నంలో మరో ఏసీపీ తో కలిసి రియల్ దందా.?

నోటీదూల, అడవాళ్లను హెళన చేయడం అలవాటే.

పైసలు పిండేంత వరకు నోటీసుల పై నోటీసులు.

వందల కేసులను నీరుగార్చిన ఏసీపీ ఉమామహేశ్వర్ రావు పై

Landsandrecords.com ఎక్స్లూజివ్ స్టోరీ.

 

By

Devender Reddy Chinthakuntla.

9848070809.

 

 

వీడు పోలీసోడు కాదు- దొపిడి దొంగ.

 

ఎస్.. దోపిడి దొంగ దోచుకుంటే ఒకేసారి ఒంటి పైవి దోచుకుంటాడు. కానీ పోలీస్ డిపార్మెంట్ లో రౌడీకంటే రూడ్ గా ప్రవర్తిస్తాడు. డబ్బులు ఇస్తే కేసును ఎటు నుంచి ఎటు వైపు అయినా తిప్పేస్తాడు. వందల మంది బాధితుల బాధలు గుర్తుకు రావు. మోసపోయిన వారి పట్ల సానుభూతి ఉండదు. కేసు మొదట్లో నిజాయితీ ఆఫీసర్ గా నటిస్తూ.. రోజుల కొద్ది స్టేషన్ లో కూర్చోపెట్టుతాడు. ఆ తర్వాత డబ్బులు ముట్టిన తర్వాత కేసును ఎందుకు పనికి రాకుండా చేస్తూ చార్జీషీట్లు వేస్తారు. నిందుతులు తప్పించుకునేందుకు వీలుగా సెక్షన్స్ మారుస్తాడు. బాధితులు ఎంత బతిమిలాడుకున్నా వారినే నిందుతులు అంటూ బెదిరిస్తాడు. నోటీకి ఎదొస్తే అది మాట్లాడుతాడు. సెటిల్మెంట్స్ చేస్తానని కబ్ల్స్ లో కూర్చోబెట్టి ప్రయివేట్ గా కమిషన్స్ తీసుకుని రాజీ కుదుర్చడంలో దిట్టగా మారిపోయాడు ఏసీపీ ఉమామహేశ్వర్ రావు.

 

ఫార్మా కంపనీలో పదికోట్లు మింగేశాడు.

పెనుమచ్చ క్ఈష్ణం రాజు. ఎఫ్ఎంసీజీ అనే ఫార్మ కంపనీ 10 కోట్లతో ప్రారంభిస్తారు. తనకు చెందిన నాలుగు కంపనీలకు సరుకు పంపించినట్లు, వాళ్లు డబ్బులు వేసినట్లు ఫేక్ ఇన్వాయిస్, డబ్బు బదులాయింపులు చేయిస్తారు. కంపనీ విలువను 1600 కోట్లు అయినట్లు లెక్కలు చూపిస్తారు. దీంతో వివిధ రంగాలలో నిఫుణులైనా వారితో ఒక్కొక్కరి వద్ద 50 నుంచి 100 కోట్లు పెట్టుబడులు పెట్టిస్తారు. వీరిలో సైటింస్టులు కూడా ఉన్నారు. అతి కొద్ది కాలంలోనే ఎన్నో రకాలుగా మోసాలు చూపించి అందరిని చీటింగ్ చేస్తాడు కఈష్ణంరాజు. ఈ కేసు సిసిఎస్ కి చేరుతుంది. మొదట్లో మూడు రోజులు కూర్చోబెట్టుకుని కేసును సిరియస్ గా తీసుకున్నట్లు డబ్బుల కోసం నటిస్తాడు. ఆ తర్వాత ముడుపులు ముట్టడంతో కేసును నీరుగార్చేస్తాడు. పూర్తి కథనం మరో స్టోరీలు చూద్దాం.

 

సాహితీలోను మింగేయడమే పని..

1200 కోట్ల స్కాం 3500 మంది బాధితులు 15 మంది డైరెక్టర్స్ . రెండేళ్లుగా సీసీఎస్ లో కేసు కొనసాగుతున్నా ఇప్పటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. అందుకు ఈ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు వ్యవహారమే నిదర్శనం. లక్ష్మినారాయణ వద్ద డబ్బులు తీసుకుని కేసును నీరుగార్చని బాధితులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు అధారాలు ఉన్నాయి. మిగితా డైరెక్టర్స్ ని పైసల కోసం ఊపిరి సడలకుండా నోటీసుల పై నోటీసులు ఇచ్చేశాడు. విచారణ చేసి ఎమైనా సాధించాడా అంటే.. తన అక్రమ సంపాదనను పొగుచేసుకున్నాడు. తాజాగా ఓ చార్టెడ్ అకౌంటెంట్ తో కలిసి సెటిల్మెంట్స్ చేసేందుకు పూనుకున్నాడని బాధితులు చెప్పుతున్నారు.

 ఇబ్రహింపట్నంలో రియల్ ఎస్టేట్ దందా..

సమూహా అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఇబ్రహింపట్నంలో మోసాలకు పాల్పడుతుంది. అందుకు సెటిల్మెంట్ల పేర్లతో 50 కోట్లు అర్ధిక లావాదేవీలు చేశారు. ఆ కేసు డీల్ చేసిన ఏసీపీ – ఈ ఉమామహేశ్వర్ రావులు కలిసి దందా కోనసాగించారు. ఇలా 50 లక్షలకంటే ఎక్కువ ఫ్రాండ్ చేసిన కేసులు సీసీఎస్ కి రావడంతో ఏసీపీగా ఉన్న ఈ అధికారి పంటపడింది. నిందుతుల వద్ద డబ్బులు తీసుకుని నాలుగు, ఐదు రోజుల్లోనే బెయిల్ వచ్చేలా ప్లాన్ చేయడం ఇయనకు అలవాటుగా మారింది. వందల కేసుల్లో సెటిల్మెంట్స్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించారనే అనుమానంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో 10 చోట్ల దాడులు నిర్వహించారు. ఎంతో మంది బాధితులు ఇప్పుడు భయటకు రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కి మించిన దోపిడి దొంగతనం ఈ ఉమామహేశ్వర్ అధ్వర్యంలో సీసీఎస్ లో కోనసాగిందని ల్యాండ్స్ అండ్ రికార్డ్. కామ్ వద్ద ఎక్ల్సూజివ్ సమాచారం ఉంది.  

 

Leave a Comment: