CBN CM - Hyderabad Real Estate

NEWS ANGLE for all parties

Posted by admin on 2024-06-04 09:34:48 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 461


CBN CM - Hyderabad Real Estate

ఏపీలో అధికార మార్పు హైదరాబాద్ రియల్ సీన్.

వ్యాపారుల్లో మొదలైన చర్చ.

అమరావతి పై ఆశలు పెంచుకుంటున్న బిల్డర్స్. 

ఉమ్మడి రాజదానికి కాలం చెల్లడంతో 

హైదరాబాద్ కు బుష్టింగ్ ఇచ్చే ప్లాన్స్ లో రేవంత్ సర్కార్. 

రెండేళ్ల పాటు రియల్ మానియా ఎలా ఉంటుంది. ? 

పెట్టుబడులు ఎక్కడ పెడితే మంచింది.? 

ఇప్పటికే ఒక సారి దెబ్బతిన్న వారంతా ఎం చెప్పుతున్నారు.

ఐదేళ్లలో హైదరాబాద్ వర్సెస్ అమరావతి రియల్ ఎస్టేట్ పై 

ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ స్పెషల్ స్టోరీ. 

By 

Devender Reddy

9848070809.


పెట్టుబడికి బెస్ట్   అప్షన్ ఎక్కడ..? 

గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజదాని అమరావతి ఆగమాగం అయింది. చంద్రబాబు విజన్ నమ్ముకుని భూములు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు హైదరాబాద్ కి వచ్చేశారు. హైదరాబాద్ లో లిటిగేషన్ భూముల్లో పెట్టుబడులు పెట్టి భారీగానే సంపాదించారు ఏపీకి చెందిన కొంత మంది రియల్ బిజినెస్ మ్యాన్స్. ఇప్పుడు మళ్లీ ఏపీలో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే అమరావతి శివారుల్లో భూములను అగ్రిమెంట్స్ చేయించుకున్నారు. కొన్ని భూ బదులాయింపులు జరిగాయి. ఐదేళ్ల క్రితం ఊపును తీసుకొచ్చి భారీగా బిజినెస్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమరావతిలో మరో ఏడాది వరకు వేచి చూసే పరిస్థితి వస్తుందని హైదరాబాద్ లో పని చేసే ఉద్యోగులు చెప్పుతున్నారు. అమరావతికి శ్వాశత బిల్డంగ్స్ ఉంటేనే నమ్మకాలు కుదురుతాయని విశ్వసం వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాద్ లో రేట్స్.. స్టేబుల్ అవుతాయా..? 

గడ్డం గిసీనా గీసుకొకున్న పెరిగినట్లు, హైదరాబాద్ జనభా ,రియల్ వ్యాపారం పెరుగుతుందని ఓ నానుడి ఉంది. ఏపీ నుంచి హైదరాబాద్ లో 35 లక్షల మంది ఉన్నట్లు అంచనా. ముందు చూపుతో పెట్టుబడులు పెట్టేది , బిజినెస్ చేసేది వారేనని చాలా మంది నమ్ముతారు. అలాంటి వారంతా పెట్టుబడులు రూపంలో ఏపీకీ వెళ్లితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూంలో ఏం జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో సార్లు హైదరాబాద్ ఎదురుకుంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటికి జరిగిన మార్పుల్లో  హైదరాబాద్ యే బాద్ షా లా ఉంది. గతంలో కంటే పొల్చుకుంటే అన్ని సౌకర్యాలు హైదరాబాద్ కి అదనంగా చేరాయి. దీనికి తొడుగా పొలిటికల్ సఫోర్ట్ ఉంటే హైదరాబాద్ భూముల్లో ఎప్పటికి రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. అయితే ఒక ఏడాది ఒక్కడ స్లేబుల్ గా ధరలు కనిపించినా., ఆ తర్వాత ఒకే సారి పుంజుకునే అవకాశాలు చాల ఉన్నాయని తెలుస్తుంది. 

రేవంత్ నిర్ణయాల పైనే వ్యాపారం దూకుడు..? 

ఎల్.ఆర్.ఎస్, బీఆర్ఎస్, పెండింగ్ లతో హైదరాబాద్ రియల్ వ్యాపారానికి ముక్కుతాడు వేశారు. గ్రామ పంచాయితీ లే-అవుట్స్ రిజిస్ట్రేషన్స్  అపివేయడంతో నగర శివార్లలో ఇబ్బందులు ఎదురయ్యాయి.  ధరణి మాటున ఫామ్ ల్యాండ్స్ లో ఇబ్బందులు ఉన్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ డిమాండ్ గానే ఉన్నా.. అమరావతి మళ్లీ ఊపిరి పిల్చుకోవడంతో.. హైదరాబాద్ కి అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఎంతైనా అవసరమే..? ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ పరిధిని పెంచడంతో పాటు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ ని పట్టాల పైకి ఎక్కించాల్సి ఉంది. అనుమతులు ఈజీగా చేయడంతో పాటు ఒప్పందం చేసుకున్న కంపనీలతో ఇక్కడ పెట్టుబడులు పెట్టించడం కీలకంగా మారనుంది. 

ఎక్కడ పెడితే సేఫ్.

హైదరాబాద్ లోనే పెట్టుబడులు పెడితే అత్యంత లాభాలు గడించవచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్పుతున్నారు. అవసరానికి అమ్ముకునేందుకు ఎప్పుడైనా వీలు ఉంటుంది. కోటి 40 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ స్టేబుల్ ఉంటుంది కాని అమరావతికి 5 ఏండ్ల కాలం పట్టినట్లు ఎప్పుడు కనిపించదని చెప్పుతున్నారు. ఏపికి పెట్టుబడులు వెళ్లినా, ఇక్కడ ధరలు అందుబాటులో ఉండి, రియల్ వ్యాపారం నేల మీద సాము చేస్తుందని తెలిపారు. ఈ రెండేళ్లలోనే హైదరాబాద్ లో రేట్లు అందుబాటులో ఉంటాయని మరోక నిపుణులు తన అనుభవాలను గుర్తు చేశారు. 


Leave a Comment: