Phone Tapping Case Typical mistakes
Crime News
Breaking News
Posted by admin on 2024-07-04 08:18:54 |
Share: Facebook |
Twitter |
Whatsapp |
Linkedin Visits: 536
ఫోన్
ట్యాఫింగ్ లో టైఫికల్ మిస్టెక్స్ కొనసాగుతున్నాయా..?
చార్జీషీట్
లో సరిదిద్దుకుని మళ్లీ ఫైల్ చేశారు.
హైకోర్టుకు
సమర్పించిన అఫిడవిట్స్ లో ఇదే జరగనుందా..?
ప్రణీత్
రావు బదులు నవీన్ రావు అని టైపింగ్ వచ్చిందా..?
పోలీస్
అధికారుల స్టేట్మెంట్ లో ఉన్న పేర్లలో
మాజీ
మంత్రి హరీష్ రావు, ఎంపీ దామోదర్ రావు పేర్లు అఫిడవిట్ లో మిస్ అయ్యాయా..?
ఎమ్మెల్సీ
నవీన్ రావు, కేటీఆర్ అదేశాలతోనే కేసులు పెట్టారా ?
నిందుతుల
జాబితాలో లేకుండానే నవీన్ రావు నిందుతుడని చెప్పడంలో అర్ధమేంటి ?
దర్యాప్తు
అధికారి ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేస్తున్నారా..?
చార్జీషీట్
షీట్ లో చేసిన తప్పులు ఏంటీ..?
అఫిడవిట్
లో పెర్కొవాల్సిన పేర్లను మాయం చేసింది ఎవ్వరు. ?
ట్యాపింగ్
కేసులోడబ్బులు వసూలు చేస్తున్న వారి పై నిఘా ఏది.?
మొద్దు
నిద్రలో ఎస్బి, ఇంటలిజెన్స్ .?
ప్రతిష్టాత్మకంగా
తీసుకున్న కేసులో దర్యాప్తు అధికారుల
టైపింగ్,
మ్యానువల్ తప్పిదాల పై స్పెషల్ స్టోరీ.
దేవేందర్
రెడ్డి చింతకుంట్ల.
9848070809.
రాష్ట్ర
వ్యాప్తంగా సంచలనం స్రుష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు టైపింగ్
మిస్టెక్స్ కలవరపెడుతున్నాయా..? చార్జీషీట్ లో చేసిన తప్పిదం.? అఫిడవిట్ లో
జరిగిందా.. అనే అనుమానాలు తావిస్తున్నాయి. కేసు దర్యాప్తు వివరాలు భయటకు
పొక్కొద్దని మెమో వేసిన పోలీసులకు అన్ని భట్టభయలు కావడంతో నిందుతులు జాగ్రత్త పడే
అవకాశాలు లేవా..? సందట్లో సడేమియా అనే చందంగా ధర్యాప్తు అధికారుల పేరు చెప్పి.. ఓ
బిజినెస్ మెన్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్న వ్యవహారం ఎందుకు
పసిగట్టలేకపోతున్నారనే విమర్శలు తావిస్తున్నాయి. ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్
ఉన్నతాధికారుల వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయనే అరోపణలు ఉన్నాయి.
చార్జీషీట్
లో టైపింగ్ మిస్టెక్స్ - సెక్షన్స్ మిస్సింగ్.
90
రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేసి కేసును సిరియస్ గా తీసుకున్నారు హైదరాబాద్
పోలీసులు. నిందుతులకు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. అయితే చార్జీషీట్ లో టైపింగ్
మిస్టెక్స్, అధారాల సబ్మిట్ లో తప్పిదాలు జరిగాయి. ఎఫ్ఐఆర్ నెంబర్ 243/2024కు
బదులు, 243/2034 అని, ముఖ్యమైన లేటర్స్ తేదిని తప్పుగా మెన్షన్ చేశారు. ఎప్రిల్
11,2024 అయితే ఏప్రిల్ 16 తేదిగా చేర్చారు. మే 20, అయితే ఎప్రిల్ 10 అని
పెర్కొన్నారు. ఫామ్ -60 మొత్తం నాలుగు పేజీలు అయితే 6 పేజీలని టైప్ చేశారు. ముసీ
నదిలో దొరికిన హార్డ్ డిస్క్ ల అవశేశాలను కోర్టుకు సమర్పించలేదు. పంచనామాలో మాత్రం
సీన్ రీ కన్సస్ట్రక్షన్ చేసినప్పుడు అన్ని పెర్కొన్నారు. అయితే ఎవిడెన్స్
నింధుతులకు ఇవ్వరాదని పీపీ సాంబశివా రెడ్డి కోర్టుని వేడుకున్నారు. దీంతో పాటు
కోర్టు విషయాలను భయటకు రాకుండా జాగ్రత్త అవసరమని మెమో దాఖలు చేసినట్లు
తెలుస్తుంది.
అఫిడవిట్
లో ఆ పేర్లు ఎందుకు లేవు.. నిందుతుడుగా నవీన్ రావు ఎప్పుడు చేర్చారు.
ఫోన్
ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటగా తీసుకుంది. నిందుతుల స్టేట్మెంట్స్ తో పాటు
అనేక ప్రత్యేక కథనాలు ల్యాండ్స్ అండ్
రికార్డ్స్ , స్వేచ్ఛ వెబ్ న్యూస్ ద్వారా ప్రజల ముందు ఉంచింది. నిందుతుల
స్టేట్మెంట్ ప్రకారం మాజీ మంత్రి హరీష్ రావు, నమస్తే తెలంగాణ ఓనర్ ఎంపీ దామోదర్
రావు, శ్రావణ్ రావు డైరెక్షన్ , ప్రభాకర్ రావు అదేశాలతో ట్యాపింగ్ చేశామని అడిషనల్
ఏసిపి తిరపతన్న తెలిపారు. నవీన్ రావు, మాజీ మంత్రి కేటీఆర్ అదేశాల మేరకు సంధ్య
శ్రీధర్ రావుని బెదిరించి, కేసులు పెట్టించారని భుజంగరావు ప్రస్తావించారు. అయితే
నవీన్ రావుతో పాటు హరీష్ రావు, దామోదర్ రావుల పాత్ర పై ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు.
అ దిశగా విచారణ జరగలేదు. కాని హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్ లో కేటీఆర్ పేరు,
నవీన్ రావు పేర్లను మాత్రమే ప్రస్తావించారు. మిగితా ఇద్దరి పేర్లు వ్రాయకపోవడానికి
అనేక కారణాలు ఉన్నాయని అరోపణలు వినిపిస్తున్నాయి.
బ్లాక్
మెయిలింగ్ కాల్స్ తో ఓ బిజినెస్ మ్యాన్ బిజి.
మీరంతా
ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారు. మీరు ఇన్వెస్టిగేషన్ అధికారులకు డబ్బులు ఇస్తే పేర్లు
రాకుండా ఉంటయాని ఓ పేరొందిన రియల్ఎస్టేట్ వ్యాపారి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
కొంత మంది వద్ద కోట్లు డిమాండ్ చేసి లక్షల్లో డబ్బులు తీసుకున్నారని పక్క సమాచారం.
ఈ విషయం ఇంటిలిజెన్స్ కి తెలిసినా.. పట్టించుకోవడం లేదు. ఎస్బీ అయితే ఆ దిశగా
అలోసించడం లేదు. దర్యాప్తు అధికారులు కూడా ఆ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు
ఉంటున్నారు. సీఎం రేవంత్ ద్రుష్టికి తీసుకెళ్లేందుకు కొంత మంది ప్రయత్నించిన
మధ్యలోనే అడ్డుకున్నారని తెలుస్తుంది.