Posted by admin on 2024-08-01 06:42:08 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1384
ఆదాయం సమకూర్చే శాఖలో బదిలీల అవినీతి.
ట్రాన్స్పారెన్సీగా జరగాలన్న సీఎం అదేశాలు బెఖారత్.
ఎస్ ఆర్ ఓ, డీఆర్ఓల వద్ద 30 కోట్లు వసూలు
చేసిన ఘనుడు.
అప్పుడు, ఇప్పుడు అన్ని తానై నడిపించిన స్థిత
ప్రజ్నా.
తియ్యటి మాటలతో అధికారులను బుట్టలో వేసుకుని
దందా.
జీరో సర్వీస్ పేరుతో జీవో నెంబర్ 80కి పాతర.
హాడవుడి సమయంలో బదిలీల ఆర్డర్స్ ఓకే చేసిన
మంత్రి.
భారీగా వసూలు చేస్తున్న ఎస్ఆర్ఓ లను
దూరంగా వేయలని సూచనప- ట్టించుకోకుండానే
బదిలీలు.
ఆ డీఆర్ అనుకున్న వారందరికి హై డిమాండ్
పోస్టులే.
బదిలీల్లో భారీగా చేతులు మారిన వైనం
పై ల్యాండ్స్ అండ్ రికార్డ్స్. కామ్ స్పెషల్ స్టోరీ.
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల.
9848070809.
రెండేళ్ల సర్వీస్ పూర్తికాని వారిని బదిలీ
చేయవద్దని జీవో నెంబర్ 80 చెప్పుతుంది. జీరో సర్వీస్ పేరుతో 144 మంది ఉద్యోగులను
బదిలీ చేస్తూ రిజిస్ట్రర్ శాఖ ఐజీ జ్యోతి బుద్ద ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక సర్య్యూలర్ తో అదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, రిజిస్ట్రర్ శాఖలో బదిలీలు విచ్చల
విడిగా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ట్రాన్సఫర్స్ ల్లో ఎంతో ట్రాన్స్ఫరెన్స్
మెయింటెన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అదేశాలు ఉన్నాయి. కాని ఉద్యోగులకు వల వేసి
డిమాండ్ ఉన్న పోస్టింగ్ లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారు. సబ్ రిజిస్ట్రర్ ల
బదిలీల్లో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రర్ పాత్ర పై అనేక అనుమానాలు తావిస్తున్నాయి.
జూలై 31 దాటితే కొత్త జీవోలు అవసరమనుకున్న వారు మంత్రి హాడవుడిగా ఉన్న సమయంలో అన్ని
బాగానే చేశామని చెప్పుకుంటూ అనుమతి తీసుకున్నారు. ఇదే విషయం పై 28న వెళ్లితే తొందర
వద్దన్న మంత్రి... అధికారుల ఒత్తిళ్లకు బదిలీలకు ఓకే చేశారు.
ఆయన పైనే ఎందుకు అరోపణలు.
రంగారెడ్డి నుంచి మేడ్చల్ కి బదిలీ అయినా డీఆర్ పై అవినీతి అరోపణలు వస్తున్నాయి. బదిలీల్లో కీలక పాత్ర పోషించించినట్లు తెలుస్తుంది. సీఎంఓలో శేషాద్రి, ఐజీ బుద్దా ప్రకాశ్, అడిషనల్ ఐజీ వెంకటరాజంలకు ఈ బదిలీల వ్యవహారం చూసుకున్నారు. ఈ ఉన్నతాధికారులకు తియ్యటి మాటలు చెప్పి.. మొత్తం చక్రం తిప్పారు ఈ డీఆర్. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో డిమాండ్ ఉన్న సబ్ రిజిస్ట్రర్స్ కి కోట్ల రూపాయలు డీల్ చేసినట్లు అధారాలు లబించినట్లు సమాచారం. వద్దన్న వచ్చిపడే సొమ్ముతో ఈ బదిలీ పెట్టుబడి 6 నెలల్లోనే సంపాదిస్తామని చెప్పుకుంటున్నారు సబ్ రిజిస్ట్రర్స్. డిమాండ్ ఉన్న పోస్టులకు గత ప్రభుత్వంలో ఈయనే చక్రం తిప్పారని డిఫార్మెంట్ అందరికి తెలుసు. ఇప్పుడు మళ్లీ ఇయనే అందరికి పొస్టింగ్ ల గురించి చర్చించారు. డిమాండ్ ఉన్న 8 పోస్టులకు కోటి రూపాయల చొప్పున డిమాండ్ చేశారట. మల్టీజోన్ 2 , గ్రేడ్ 1 సబ్ రిజిస్ట్రర్ కి 80 లక్షలు, జోన్ లో ఒక్కొక్క పోస్టుకు 20 నుంచి 50 లక్షల వరకు బేరం మొదలు పెట్టారని సమాచారం. అయితే డిమాండ్ ఉన్న పోస్టుల్లో ఉన్న వారికి మళ్లీ అంతే డిమాండ్ ఉన్న పోస్టింగ్ లు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు స్థితప్రజ్నా. ఇదే అంశం పై నిఘా వర్గాలు అధారాలు సేకరిస్తున్నాయి. రోజుకు 5 లక్షలు లేనిది ఇంటికి వెళ్లలేని పోస్ట్ రంగారెడ్డి డీఆర్ ఫోస్ట్. వ్యాలిడేషన్ తో నే భారీగా సంపాదిస్తారు. అలాంటి పోస్టు నుంచి ఇంకా డిమాండ్ ఉన్న మేడ్చల్ పోస్ట్ లోకి వెళ్లారు. అయినా తనకి అన్యాయం జరిగిందని బీద ఏడ్పులతో అందరికి ఫోన్ చేసి అమాయకంగా నటించడం ఇయన టాలెంట్ కి నిదర్శనం. ఏ ఫైల్ అయినా పైసలతోనే కానిస్తాడనే తీవ్ర అవినీతి అరోపణలు ఇయన పై ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేస్తే ఖుషీతో డబ్బులు ఇస్తారని ఒక్కప్పుడు చెప్పుకునే వారు. ఇప్పుడు ఒక్కొక్క సర్వే నెంబర్ కి ఒక్కొ డాక్యుమెంట్ రేటు పెట్టుకుని అవినీతికి పాల్పడుతుంది ఈ శాఖ.
ముఖ్యమంత్రి, మంత్రి అదేశాలు పట్టించుకోలేదు.
బదిలీల్లో తేడాలు రావద్దని హెచ్చరించినా..
ఫైరవీకారులు వారిపని వారు చేసుకుంటున్నారు. ఉన్నాతాధికారుల చేతులకు మట్టి అంటకుండా
పనికానిచ్చే బ్యాచ్ కే ఈ అవకాశాలు ఉన్నాయి. శాఖపరమైన సర్క్యూలర్స్ ఇచ్చేసుకుని గత
ప్రభుత్వంలో జరిపిన దందాలే మళ్లీ ఇక్కడ చేస్తున్నారు. అదే వ్యక్తులు అదే వ్యవస్థ.
కొత్తగా మారింది ఏమి లేదని అధికారులు చెప్పుకుంటున్నారు. మంత్రికి హెల్ప్ చేసిన ఓ
సబ్ రిజిస్ట్రర్ కి అవకాశం ఉంటే మంచి పోస్టింగ్ ఇవ్వాలని కోరితే.. వారి నిజాయితీ
నిరూపించేందుకు వేరే ఆఫీస్ కి బదిలీ చేశారని తెలస్తుంది. ఇలా అనేక కీలకమైన
పోస్టింగ్ ల్లో చాపకింద నీరులా అవినీతికి బదిలీలు జరిగాయని తెలుస్తుంది.
విచారణ జరిగేనా..?
ఒక్క శాఖ బదిలీలతోనే 30 కోట్లు చేతులు మారాయని అరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్దలు విచారణకు అదేశిస్తారా..? ఇదంతా కామన్ అనుకుని వదిలేస్తారో వేచి చూడాలి. డబ్బులు ఇచ్చి పొస్టింగ్ తెచ్చుకున్న వారు.. డబ్బుల వేటలో ఎన్నో తప్పిదాలు చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకరానున్నారు. సబ్ రిజిస్ట్రర్ కార్యాలయానికి వెళ్లితే తెలుస్తుంది అక్కడి అవినీతి. డబ్బులు ఇవ్వకుంటే అన్ని సరిగ్గా ఉన్నా.. ఎదో కొర్రిపెట్టి పంపిస్తారు. బ్రోకర్స్ , డాక్యుమెంట్ రైటర్స్ లేనిది ఫైల్ ముందుకే కదలదు. అన్ని అన్ లైన్ అని చెప్పుకున్నా.. ఫైరవీకారులు లేనిది ఓ సామాన్యుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి ఉంది.