Posted by admin on 2024-10-25 05:23:39 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 330
ఫోన్ ట్యాపింగ్
ఏ1 ప్రభాకర్ రావు హైదరాబాద్ లోనే ఉన్నాడా ?
సిటీలోనే
ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం.
ఇక్కడే ఉంటే
ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.?
దీపావళి లోపే
పేలుతుందని చెప్పడానికి ఇదే కారణమా..?
ప్రభాకర్ రావు
కోర్టులోనే లొంగిపోయి,
స్టేట్మెంట్
ఇచ్చేందుకు సిద్దమయ్యారా.?
ట్రీట్మెంట్
అంటూ జైలుకి వెళ్లకుండా ప్లాన్ వేశారా.?
ప్రభాకర్ రావు
నోరు విప్పుతేనే కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా..?
పక్క ప్లాన్ తో
కాంగ్రెస్ ముందుకు వెళ్లడం వెనక రహాస్యం ఏంటీ..?
పొలిటికల్
అరెస్ట్ లో పేలనున్న బాంబులు ఎన్ని..?
6 గురు
బీఆర్ఎస్ నేతలకు ఉచ్చు బిగుస్తుందా..?
మళ్లీ హాట్
టాఫిక్ గా మారుతున్న ఫోన్ ట్యాపింగ్ పై
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ . కామ్ ఎక్స్లూజివ్ ఇన్ఫర్మెషన్
దేవేందర్
రెడ్డి చింతకుంట్ల. 9848070809.
ఫోన్ ట్యాపింగ్
కేసు కీలక దశకు చేరుకుందా..? ఏ1 ప్రభాకర్ రావు మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ విచారణకు సహాకరించనున్నారా..? అందుకు పక్క ప్లాన్ తో హైదరాబాద్ కి చేరుకున్నారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు వస్తున్నాయి. ప్రభాకర్ రావు హైదరాబాద్ కి వచ్చింది
నిజమేనని కొంత మంది విశ్వసిస్తున్నారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
నిజానికి ప్రభాకర్ రావు దేశానికి చేరుకుంటే ఎయిర్ ఫోర్ట్ అధికారులు వెంటనే
పోలీసులకు సమాచారం ఇవ్వాలి. గతంలోనే నేను విచారణకు సహకరిస్తాను. నన్ను అరెస్ట్
చేయవద్దని ఇన్వెస్టిగేషన్ అధికారులకు లేటర్స్ వ్రాశారు. కోర్టులో పిటిషన్ దాఖలు
చేశారు. రెడ్ కార్న్ నోటీస్ జారీ చేసేందుకు అన్ని ఏర్పాటు పూర్తి అయ్యాయి. లుక్
అవుట్ నోటీసులు ఎనాడో ఇచ్చేశారు. ఎప్పుడు దేశం వచ్చినా ఇట్లే తెలిసిపోతుంది. అయితే ప్రభాకర్ రావు వచ్చారని తెలిసిన గోప్యంగా ఉంచడానికి కారణం ఏమై ఉంటుందని బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్ లాంటి మాజీ మంత్రులను అరెస్ట్ చేయలంటే ఏ1 ప్రభాకర్ రావు స్టేట్మెంట్ చాల కీలకం.
పోలీసుల ముందు ఇచ్చే వాంగ్మూలం కంటే, మెజిస్ట్రేట్ ముందు ఇచ్చే స్టేట్మెంట్ కి చాల ఫవర్ ఉంటుంది. మళ్లీ మార్చేందుకు వీలు ఉండదు. దీంతో అరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని రాజకీయ సమాధి చేసేందుకు వీలు ఉంటుందని ప్లాన్ లో భాగంగానే ప్రభాకర్ రావు వచ్చిన
విషయాన్ని దాచిపెట్టినట్లు సమాచారం. నిజానికి వచ్చారా.. ? లేదా .? రప్పించి, జైలుకు వెళ్లకుండా రక్షించి, సమాచారం అంతా సేకరించేందుకు ప్రచారం చేస్తున్నారో.. ఒక్కటి, రెండు రోజుల్లో దీపావళీ బాంబులు అరెస్టుల
రూపంలో పేలనున్నట్లు మాత్రం స్పష్టం అవుతోంది.
ఎవ్వరెవరు
ఉంటారో..
ఫోన్ ట్యాపింగ్
వ్యవహారంలో చాల కీలకంగా వ్యవహారించిన నేతలు ఈ లిస్టులో ఉండనున్నారు. సాధరణ ఎన్నికల
సమయంలో ఆయా 3 ఉమ్మడి జిల్లాల మంత్రులు, అలాగే మరో నిందుతుడు శ్రావణ్ కుమార్,
అతన్ని నడిపించిన ఓ పేపర్ ఓనర్ తో పాటు పలువురు ఈ కేసులో ప్రభాకర్ రావు ఇచ్చే
స్టేట్మెంట్ అధారంగా నిందుతులు కాబోతున్నారని తెలుస్తుంది.