Posted by admin on 2024-06-13 06:01:49 | Last Updated by admin on 2025-05-22 18:26:51
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 416
ప్రణీత్ లో
కొంటే పరేషాన్.
మల్లంపేట్ ` లీప్` లో పీటీ వివాదం.
వంద ఫీట్ల రోడ్డును మింగేసిన `అంటీలియా`
`నేషర్ బౌంటీ` లో
ప్రభుత్వభూమిలోకి బౌండరీస్.
30 మంది
విల్లా ఓనర్స్ కి లీగల్ నోటీసులు.
పోర్జరీ
సంతకాలతో పీటీ రికార్డుల సరెండర్.
కేసు నమోదు
చేసి చార్జీషీట్ వేసి దుండిగల్ పోలీసులు.
తప్పును
కప్పిపుచ్చుకునేందుకు హాడవుడిగా నిర్మాణం, అమ్మకం.
ఇబ్బందుల్లో
విల్లా ఓనర్స్ ?
రోజురోజుకు
జఠిలం అవుతున్న టైటిల్ వివాదం.
కలెక్టర్
ఆఫీసులో వాదనలు చేయకుండా కట్టుకథలు.
ప్రభుత్వం
మారినా న్యాయం జరగకపోతే ఎలా అంటున్నబాధితులు.
కుటుంబ
సభ్యులతో ఆందోళనకు రేడీ.
బాచుపల్లిలో
వెంకట ప్రణీత్ డెవలఫర్స్
అక్రమాల పై బిజేపీ నేతలు ఫైర్.
ప్రణీత్
ఓనర్స్ పరేషాన్స్ పై ల్యాండ్స్ అండ్ రికార్డ్స్
స్పెషల్
స్టోరీ.
By
దేవేందర్
రెడ్డి.
9848070809.
ప్రణీత్. ట్రూత్ ఇన్బిల్డ్ పేరుతో మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే వందల కోట్ల భూములను పొగుచేసుకుంది వెంకట ప్రణీత్ డెవలఫర్స్. వివాదస్పద భూములను కొనుగోలు చేస్తూ పలుమార్లు వార్తల్లోకి ఎక్కింది. మల్లంపేట్ ప్రణీత్ ప్రణవ్ లీఫ్ లో టైటిల్ వివాదం ఉందని తెలిసినా డెవలప్మెంట్ కి తీసుకుని నిర్మాణాలు చేపట్టడం విల్లా ఓనర్స్ ని అందోళన కల్గిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విషయాలన్ని కప్పిపుచ్చినా .. ప్రభుత్వం మారడంతో బాధితులు న్యాయం చేయలని పట్టుపడుతున్నారు. దుండిగల్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నెం. 25/2022 కేసులో చార్జీషీట్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏఫ్ 2/1336/2022 కేసులో విచారణకు హాజరై వాదనలు చేయాడానికి భయపడుతున్నారు. ప్రతి విచారణ తేదిలో ప్రణీత్ తరుపున న్యాయవాధి ఏదో వంక చెప్పి వాదనలు వినిపించకుండానే తప్పించుకోవడంతో న్యాయాధికారి అగ్రహాం వ్యక్తం చేశారు. ఫోర్జరీ స్పష్టంగా కనిపించడంతో తీర్పు ఉత్తర్వులను రిజర్వడ్ చేశారు.
ఫోర్జరీ, నకీలతో బిజినెస్.
మల్లంపేట్ సర్వే నెంబర్ 121,122, లో ప్రొటెక్ట్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం 1.34 గుంటల భూమి ఉంది. పట్టాదారులకు, టెన్సీలు సరెండర్ చేయలేదు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక సిద్దమవ్వగానే భూ మాఫియా రెచ్చిపోయింది. పీటీ సరెండర్ చేస్తున్నట్లు దొంగ సంతకాలతో ఫేక్ మనుషులను ముందు పెట్టి వ్యవహారం నడిపించారు. వేలి ముద్రలు వేసే పీటీదారుడు ఇంగ్లీష్ లో సంతకాలు పెట్టెశారు. హాడవుడిలో పట్టాదారులకు కాకుండా మరో వ్యక్తి కి సరెండర్ చేస్తున్నట్లు సంబందం లేని వ్యక్తి పై ఫేక్ నోటరీ చేయించారు. రికార్డులను పరిశీలించకుండానే, మనుషులను గుర్తించకుండానే ఆనాటి ఎమ్మారో రాజేందర్ పీటీ సరెండర్ చేస్తున్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించారు. ఇలా చాలా భూముల్లో వ్యవహారం నడిపించినట్లు ల్యాండ్స్ అండ్ రికార్డ్స్.కామ్ వద్ద అధారాలు ఉన్నాయి. పోలీసులకు పిర్యాదులు అందడంతో ప్రాథమిక అధారాలతో 2022లో దుండిగల్ పోలీస్ స్టేషన్ లో వెంకట ప్రణిత్ డెవలఫర్స్ తో పాటు దీపిక అల్లూరీ, ఏఎస్ఎస్ఎన్ రాజు, మంతెన ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ గోపాల కృష్ణ రాజు ల పై కేసు నమోదు చేశారు. ఇటీవల చార్జీషీట్ దాఖలు చేశారు. అందులో ఛీటింగ్ తో పాటు, పోర్జరీ, నకిలీ నేరాలు చేసినట్లు పెర్కొన్నారు.
అందరికి నోటీసులు
ప్రణీత్ లో కొంటే పరేషాన్ కావాల్సిందేనా అన్నట్లుగా 30 మంది విల్లాల ఓనర్స్ అవేదన వ్యక్తం చేస్తున్నారు.1.34 గుంటల భూమిలో ఉన్నా విల్లా ఓనర్స్, బ్యాంకర్లకి పిటిషనర్స్ లీగల్ నోటీసులు ఇచ్చారు. దీంతో మీరు ఎలాంటి క్రయవిక్రయాలు చేయరాదని తెలపడంతో విల్లా ఓనర్స్ లబోదిబోమంటున్నారు. ప్రణీత్ ఓనర్స్ కి అన్ని తెలిసినా ఏమి తెలియనట్లు వ్యవహారించడంతో వివాదం చినికి చినికి గాలి వానలా తయారవుతుంది. నాలా ను కబ్జా చేసి 20 గుంటల భూమిని తన బౌండరీలోకి కట్టుకున్నారని మల్లంపేట్ గ్రామస్తులు అరోపిస్తున్నారు.
ఆందోళనకు కుటుంబ సభ్యులు రెడీ.
తమ తాతల అస్తిని కొట్టెసిన వారి పై ఇన్నాళ్లు పోరాటం చేసిన ఫలితం రావడం లేదని, పీటీ వారసులైన రామా కుటుంబ సభ్యులు ఆందోళనకు సిద్దమయ్యారు. పెండ్లీ ఏజ్ కి వచ్చిన పిల్లలు ఉండటం, కొన్ని కుటుంబాలకు ఎలాంటి జీవనాధారం లేకపోవడంతో విల్లాల ముందు న్యాయం జరిగేంత వరకు మౌన దీక్ష చేస్తామని చెప్పుతున్నారు.
అంటీలియా లో అంతే..
ఓల్డ్ ముంబై హైవే తో పాటు మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్ల రోడ్డు అందులో నుంచి వెళ్లుతుంది. మల్లంపేట్ రోడ్డు విస్తరణలో వివాదం తలెత్తుతుంది. ప్రణీత్ అంటీల్లా నుంచి ఎందుకు రోడ్డు క్లోజ్ చేశారని ప్రశ్నిస్తున్నారు. మాస్టర్ ప్లాన ప్రకారం రోడ్లు తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
నేషర్ బౌంటీలో బౌండరీల గోడవ.
కేవీఆర్ వ్యాలీ కాలనీని అనుకుని ఉన్నా.. నేషర్ బౌంటీలో ప్రభుత్వ భూమి ఉందని బిజేపి నేతలు అందోళనకు సిద్దమయ్యారు. కాని ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకున్నట్లు సమాచారం.
అన్ని
చూసుకోవాల్సిందే..
ఇంటి నిర్మాణాలు అయిపోయాయి. అన్ని అనుమతులు వచ్చాయని కొనుగోలు చేస్తే ఇలాంటి టైటిల్ వివాదాలు పొంచి ఉంటాయి. అధికారులను మత్తులో ముంచి, అధికార పార్టీలతో కొమ్ముకాసుకుని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తారు. అన్నింటికి బిల్డర్స్ బాధ్యత వహించి క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
PRANEETH GROUP / CHEATING AND FORGERY CASE ON PRANEETH DEVELOPERS / PRANEETH Narendra Kumar Kamaraju / Narendra Kumar / Praneeth leaf / Praneeth Antilia / Praneeth Nature bounty / landsandrecords