Where is MP Santhosh Rao - Rain season Started

NEWS ANGLE for all parties

Posted by admin on 2024-06-18 05:20:23 | Last Updated by admin on 2025-07-07 06:41:05

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 617


Where is MP Santhosh Rao - Rain season Started

వేరీ ఇజ్ ఎంపీ సంతోష్ రావు.

వర్షా కాలం వచ్చేసింది చెట్లు ఎక్కడ నాటుతున్నారు సర్.?

అధికారం ఉన్నప్పుడే మొక్కలు గుర్తుకు వస్తాయా..?

ఫోటోలకు ఫోజులు ఇచ్చి దందాను పెంచుకున్నంత వరకేనా..? 

అధికారం దూరమైతే అంతే సంగతులా..? 

ప్రభాస్ కి దత్తాత ఇప్పించిన ఖాజీపల్లి అడవుల్లో మట్టి దందా.?

మొక్కలంటే తానై నడిపించి ఇప్పుడు భయటకు రాకుంటే ఎలా ? 

గప్ చిప్ గా సైడ్ అయిపోతున్న సంతోష్ రావు.

ఏ ల్యాండ్ స్కాంలో లేనట్లు బిల్డప్.

సంతోష్ రావు `హ్యాపీ` ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు.

 By

Devender Reddy Chinthakuntla.

9848070809.

 వర్షకాలం వచ్చిందంటే అధికారంలో ఉన్న 9 ఏండ్లు మొక్కలు నాటే ఫోటోలు మీడియాలో రోజు ప్రత్యేక్షమయ్యేవి. పద్మశ్రీ చెట్ల రామయ్య చేసిన సేవ కంటే ఎక్కువ తానే చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే వారు సంతోష్ రావు. మొక్కలకు ట్రెడ్ మార్క్ తీసేసుకున్నాట్లు ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వం హారిత హరం తెచ్చిందే .. కేసీఆర్ మరో కుమారుడుగా ఉండే సంతోష్ విజన్ వలనే అన్నట్లు జరిగింది. వేల కోట్ల రూపాయల చేట్లను నాటేశారు.

సెస్ ల రూపంలో పన్నులు వేశారు.

సెస్ ల రూపంలో ఇప్పటికి ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి వసూలు చేస్తుంది. అయితే ఇదంతా అధికారంలో ఉంటేనే గుర్తుకు వస్తుందా.. అన్నట్లు గా ఉంది సంతోష్ రావు వ్యవహారం.  అక్రమంగా సంపాదించిన సొమ్ము, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అయినా పరిచయాలతో  చేసిన దందాలు ఎన్నో ఉన్నాయి. ఆ పరిచయాలు దూరమైతే  సొంతంగా చెట్లు పెట్టలేరా, ? పెట్టించలేరా..? మీకు బాధ్యత లేదా ఎంపీ సంతోష్ రావు గారు. వర్షకాలం ప్రారంభమైంది. గుర్తు చేసేంత వరకు వేచిచూడకుండా చెట్లను పెట్టడం ప్రొత్సహించండి సర్. చెట్లపేరుతో అయినా దాచిన, దొచిన సొమ్మును చెట్లకోసం ఖర్చు చేస్తే పుణ్యం అయినా వస్తుంది. మీ పేరు చిరకాలం ఉంటుంది. 

ఖాజీపల్లి అడవులను గుర్తు చేసుకోండి.

సంగారెడ్డి ఖాజీపల్లి లాంటి అడవులను దత్తత తీసుకుని మొక్కల విత్తనాలు జల్లె ప్రయత్నం చేశారు. అందుకు హీరో ప్రభాస్ ని  ఖాజీపల్లి అడవుల్లోకి తీసుకొచ్చి భారీగా ఖర్చు పెట్టించారు. కాని చెట్లు నాటడం ఈనాడు మర్చిపోయారు. దానికి తొడుగా గత నాలుగేళ్లుగా ఆ ఆడవుల్లో మట్టి దందా రోజురోజుకు ఎక్కువ అవుతుంది. చెట్లు నాటడం దేవుడెరుగు అసలు పట్టించుకునే నాథుడే కరవయ్యారు. మట్టిలోంచి అక్రమంగా ఇసుక తీసినా అది ఫారెస్ట్ ఏరియా అంటూ రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పకృతి ని ప్రేమించాలని భయటకు చెప్పుకున్నవారే పగపట్టి ఆ అడవులును ఖతం కానిచ్చేస్తున్నారు. రెవ్యెన్యూ అధికారులు తమ ఏరియా కాదంటూ సెలువిచ్చారు. ఫారెస్ట్ అధికారులైనా చర్యలు తీసుకుంటారో చూడాలి.

చెట్లు నాటండి, నాటించండి. ? 

చెట్ల పేరుతో ఎన్నో దందాలు కొనసాగించిన సంతోష్ రావుకు ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ .కామ్ లో స్టోరీ చూసైనా  మళ్లీ చెట్ల పై ప్రేమ పెంచుకోవాలని వేడుకుంటున్నారు.  సొంత ఖర్చులతో నాటాలని కోరుకుంటున్నారు. మీ పార్టీ తరుపున చెట్లు నాటించాలని విజ్జప్తి చేస్తున్నారు మీ మేలు కోరే జర్నలిస్టు మిత్రులు. 


BRS Santhosh Rao | MP Joginipally Santhosh Rao lands and records | Where is Tree Santhosh Rao | J Santhosh Rao plantation |

 

Leave a Comment: